సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 173వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. పుట్టినరోజునాడు బాబా నాకెంతో సంతోషాన్నిచ్చారు
  2. ఒక చిన్ని సాయిభక్తురాలి అనుభవాలు

పుట్టినరోజునాడు బాబా నాకెంతో సంతోషాన్నిచ్చారు

ఓం సాయిరామ్! నా పేరు వల్లి. నేను విశాఖపట్నం నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు, తోటి సాయిబంధువులకు నా ప్రణామములు. సాయి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఇదివరకు కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను ఈ మధ్యనే నవగురువార వ్రతం పూర్తి చేశాను. వ్రతాన్ని పూర్తిచేసే సమయంలో, "బాబా! నాకు ఏదైనా ఒక అనుభవాన్ని ప్రసాదించండి" అని అడిగాను. బాబా ఒక పెద్ద అద్భుతాన్ని చేసి చూపించారు. ఈనెల 6వ తేదీన నా పుట్టినరోజు. ఆరోజు అనుకోకుండా నా స్నేహితురాలు ఒక మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ మహాపారాయణ గ్రూపుకు సంబంధించినది. ఒక నంబర్ ఇచ్చి, గ్రూపులో చేరే ఆసక్తి నాకుంటే దానికి కాల్ చేయమని కూడా చెప్పింది. నేను వెంటనే ఆ నంబర్ కి కాల్ చేశాను. వారు నా పేరు అడిగి, 'తప్పకుండా మిమ్మల్ని గ్రూపులో చేర్చుకుంటామ'ని చెప్పారు. చెప్పినట్టుగానే నన్ను మహాపారాయణ గ్రూపులో చేర్చారు కూడా. నా ఆనందానికి అవధుల్లేవు. పుట్టినరోజు సందర్భంగా బాబా ఇచ్చిన గొప్ప కానుక ఇది. ఇది నాకెంతో సంతోషాన్నిచ్చిన అనుభవం. నిజానికి నేను ఎప్పటినుంచో మహాపారాయణ గ్రూపులో చేరాలని ఆరాటపడుతున్నాను. కానీ ఎలా చేరాలో నాకు తెలిసేది కాదు. చివరికిలా నా స్నేహితురాలి ద్వారా బాబా నన్ను అనుగ్రహించారు. "బాబా! మీకు నా శతకోటి ధన్యవాదాలు. ఎప్పుడూ ఇలాగే మా కుటుంబంపై మీ ప్రేమానురాగాలు కురిపిస్తూ ఉండండి".

ఓం శ్రీ సాయిరామ్.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

ఒక చిన్ని సాయిభక్తురాలి అనుభవాలు

తెనాలి నుండి ఒక చిన్ని సాయిభక్తురాలు తన అనుభవాలను ఇలా తెలియజేస్తోంది:

నా పేరు హిమజ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేనిప్పుడు బాబాతో నాకున్న అనుబంధాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.

నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. నేను ఆయనను ఎంతోగానో ప్రేమిస్తున్నాను. నేను బాబాను ఏది అడిగినా ఇస్తారు. నేను నాకొక తమ్ముడు కావాలని బాబాను అడిగాను. బాబా ఆశీర్వదించి నాకొక ముద్దులొలికే చక్కటి తమ్ముడినిచ్చారు. నా తమ్ముడు కూడా బాబాను ప్రేమిస్తాడు.

గత సంవత్సరంలో(2018) ఒక గురువారంనాడు నేను స్కూలుకి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు రహదారిపై ఒక తెల్లని బాబా విగ్రహం కనిపించింది. గురువారంనాడు ఎవరో బాబానిలా విడిచిపెట్టారని ముందు నేను బాధపడ్డాను. కానీ ఆ తరువాత, గురువారంరోజు బాబా నా దగ్గరకు వచ్చారని చాలా సంతోషించాను. ఆనందంతో బాబాను ఇంటికి తీసుకొని వెళ్లి, బాబాకి స్నానం చేయించి, పూజ చేసి, చాక్లెట్ పెట్టాను. ఇప్పుడు బాబా నాతో ఉన్నారు. నేను చాలా అదృష్టవంతురాలిని. "ఐ లవ్ యూ బాబా!". బాబా ఫోటో మీ కోసం క్రింద ఇస్తున్నాను.


ఒకసారి నేను శిరిడీ వెళ్ళినప్పుడు గురుస్థాన్ దగ్గర నాకు వేపాకులు చాలా దొరికాయి. వాటిలో ఒక ఆకుపై బాబా కనిపించి నన్ను ఆశీర్వదించారు. నేను చాలా చాలా లక్కీ.

ఒకసారి నా పుట్టినరోజు సమయంలో మా అత్త శిరిడీ వెళ్ళింది. ఆమె సంస్థాన్‌లో నా పేరు మీద కొంత మొత్తాన్ని విరాళంగా కట్టింది. వాళ్ళు రశీదుతోపాటు ఒక బాబా వస్త్రాన్ని, చాలా ఊదీ ప్యాకెట్లను ఇచ్చారు. మా అత్త, "సాధారణంగా చిన్న మొత్తాన్ని విరాళంగా కట్టినప్పుడు 2 లేదా 3 ఊదీ ప్యాకెట్లను మాత్రమే ఇస్తారు. కానీ ఈసారి వస్త్రం, చాలా ఊదీ ప్యాకెట్లను ఇచ్చారు" అని చెప్పింది. నా పుట్టినరోజు కానుకగా బాబా వాటిని ప్రత్యేకంగా పంపారని ఎంతో ఆనందించాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఐ లవ్ యూ బాబా!".

నేను బాబాపట్ల నాకున్న ప్రేమతో ఒక కవిత కూడా వ్రాశాను. ఫోటో రూపంలో దానిని క్రింద ఇస్తున్నాను. చదివి నన్ను ఆశీర్వదించండి.



కవిత యొక్క భావం: -


సాయిబాబా... సాయిబాబా!
మీరు ఎక్కడున్నారు?
అందరూ మీరు ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు,
కానీ నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను.

నేనెందుకు మిమ్మల్ని  చూడలేకపోతున్నానో నాకు తెలియజేయండి బాబా!

ఓ! నాకు అర్థమైంది,
నేను మిమ్మల్ని చూడవలసిన అవసరంలేదు,
ఎందుకంటే, మీరు నా చుట్టూ మరియు నా హృదయంలో ఉన్నారు.

నాకు ఏ సమస్య వచ్చినా
నేను మిమ్మల్ని అడగడానికి ముందే మీరు నాకు సహాయం చేస్తున్నారు.

నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించిన మీకు నా ధన్యవాదాలు.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo