ఈరోజు భాగంలో అనుభవాలు:
- పుట్టినరోజున బాబా అద్భుతం.
- మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమైన సాయిబాబా
పుట్టినరోజున బాబా అద్భుతం.
సాయిభక్తుడు నకుల్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిబాబా భక్తుడినైన నేను మధ్యప్రదేశ్ లోని రత్లం నివాసిని. ప్రతిరోజూ నేను నిద్రలేస్తూనే సాయిబాబాను స్మరించుకుంటాను. ఫిబ్రవరి 18న నా పుట్టినరోజు. ఆ రోజు ఉదయాన లేచి బాబా నామం తలుచుకున్న మరుక్షణం అకస్మాత్తుగా 'సాయిబాబా మందిరానికి స్వీట్లు తీసుకెళ్ళి మొత్తం స్వీట్లను ప్రసాదానికి ఇచ్చేయాలి' అని నా మదిలో ఒక ఆలోచన వచ్చింది. కానీ ఆ విషయాన్ని పగలంతా మర్చిపోయాను. సాయంత్రం నేను నా స్నేహితుని ఇంటికి వెళ్లి, అక్కడినుండి కాశీమాత ఆలయాన్ని సందర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బాబా మందిరానికి స్వీట్లు తీసుకుని వెళ్లాలనుకున్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే నేను నేరుగా స్వీట్ షాప్‌కి వెళ్లి స్వీట్స్ తీసుకుని మందిరానికి వెళ్ళాను. ఆరతి ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. ఆరతి పాడే వ్యక్తి ప్రసాదంకోసం ఎదురు చూస్తున్నట్లు నన్ను చూసి నవ్వాడు. నేను అతనికి స్వీట్లు అందించాను. స్వీట్లను బాబాకు ప్రసాదంగా పెట్టి ఆరతి మొదలుపెట్టారు. నాకంతా అద్భుతంలా అనిపించింది. వాస్తవం ఏమిటంటే నా ప్రసాదం కోసమే బాబా ఎదురు చూస్తున్నారు. సాయి ఎంత చక్కగా ప్రణాళిక చేసారో! ప్రతి సెకనూ ఆయన నిర్ణయమేనని నాకు అనుభవమైంది. బాబా నాపై చూపించిన దయకు నేను ఆనందం పట్టలేకపోయాను. అలా పుట్టినరోజునాడు బాబా నన్ను ఆశీర్వదించారు.

మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమైన సాయిబాబా
యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తుడు హరీష్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను సాధారణ సాయిభక్తుడిని. ఆయన గురించి తరచుగా ఆలోచిస్తూ, ఆయన పేరును జపిస్తూ ఉంటాను. భక్తుల అనుభవాలకు నిలయమైన బ్లాగు నిజంగా 'సాయి ఆలయం'. అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. మనమందరం ఇక్కడ మన ప్రియమైన బాబాతో భక్తులకున్న అనుభవాలను చదివి, ఆయనను స్మరిస్తూ ఆనందంగా ఉందాము. దీన్ని నడుపుతున్న బృందానికి బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నా అనుభవానికి వస్తే...
చాలామందికి ఈ అనుభవం సరళంగా అనిపించవచ్చు కానీ దీనిలో లోతైన అర్థం ఉంది. దీనిని చదివిన ప్రతి భక్తుడిని తన అందమైన లీలను ఆస్వాదించేలా ఆశీర్వదించమని బాబాను కోరుకుంటున్నాను. కొన్ని నెలల క్రితం నా ఫోన్ చాలా నెమ్మదిగా పనిచేస్తూ, ఉన్నట్టుండి రీస్టార్ట్ అయిపోతూ ఉండేది. అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతూ ఉండేది కూడా. అందువలన నేను నా ఫోన్ మార్చివేయాలని అనుకున్నాను. ఒక మొబైల్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ అది నాకు సరైనదని బలంగా అనిపించలేదు. అందువలన నాకు మార్గనిర్దేశం చేయమని సాయిని ప్రార్థించాను. కానీ నాకు ఆయన నుండి ఎటువంటి సంకేతమూ రాలేదు. దానితో నేను ఏదీ నిర్ణయించుకోలేకపోయాను. అకస్మాత్తుగా నా ఆలోచనలో మార్పు వచ్చి కొత్త ఫోన్ కోసం వెతకడం ఆపేశాను.
రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. మళ్ళీ చాలారోజుల తరువాత నేను సాయిని, "బాబా! నేను ఇప్పటికీ నా ఫోన్ మార్చలేదు. నాకేదైనా మార్గనిర్దేశం చేయండి" అని ప్రార్థించాను. ఆ మరుసటిరోజే నేను 'ఎల్జీ స్టైలో 4' ఫోన్ గురించి కొన్ని సమీక్షలు చూసి, ఆ ఫోనును ఇష్టపడ్డాను. దాని ధర కూడా నేను వెతుకుతున్న పరిధిలోనే ఉంది. మరీ అంత హై ఎండ్ ఫోన్ కాకపోయినప్పటికీ నాకు సరిపోతుందని అనుకున్నాను. దాన్ని కొనాలని బలంగా అనిపించింది. అదే సాయి యొక్క సమాధానమని లోపలినుండి దృఢంగా అనిపించింది. అంతలో నా భార్య అంతకంటే మంచి మోడల్ కోసం చూడమని చెప్పింది. కానీ అది సరిపోతుందని నేను చెప్పాను. ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చి
2018, సెప్టెంబర్ 21న ఆర్డర్ పెట్టాను. నా జీవితంలో ఈ తేదీ నాకెంతో విలువైనది.
తరువాత అదేరోజు నేను ఫోన్ తీసుకుని ఇంటికి వచ్చాను. సాయంత్రం పూజ తరువాత, నేను ఫోన్ తెరచి, మామూలుగా సెటప్ చేసాను. మునుపటి బ్యాకప్ తీసుకుని క్రొత్త ఫోన్ సెటప్ చేసినప్పటికీ డీఫాల్ట్‌గా తయారీదారు పెట్టిన స్క్రీనే వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఆశ్చర్యం! అద్భుతం! డీఫాల్ట్ హోమ్ స్క్రీన్‌గా సాయిబాబా ఫోటో వచ్చింది. అది చూసి నేను పట్టలేని ఆనందంలో మునిగిపోయాను. నా సంతోషానికి, ఉల్లాసానికి అవధుల్లేవు. కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. అప్పటి నా స్థితిని చెప్పటానికి అస్సలు మాటలు లేవు. తరువాత నేను సెట్టింగ్స్ లోకి వెళ్లి అంతా వెతికాను. కానీ హోమ్ స్క్రీన్ మీద కనపడుతున్న సాయి ఫోటో ఎక్కడా కనపడలేదు. ఆ సాయి ఫోటో నా పాత ఫోన్‌లో కూడా లేదు. అసలు ఆ ఫోటో ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ నేను తెలుసుకోలేకపోయాను. చివరికి సాయి యొక్క మార్గాలను కనుగొనడం వ్యర్థమని తెలుసుకున్నాను. ఆయన మార్గాలు ఆయనవే. అవి పూర్తిగా అస్పష్టంగా ఉన్నాయి. అయినా బాబానే చెప్పారు, "నా లీలలు అనూహ్యాలు" అని.
ఈ అనుభవం జరిగిన సమయంలో నా మనస్సులో చాలా ప్రశ్నలు ఉదయించాయి. వాటికి బదులుగా సాయి చిత్రం రూపంలో వచ్చారు. ఆయన అన్నీ గమనిస్తున్నారని, కాబట్టి ఎటువంటి ఆందోళన, భయం అవసరం లేదని నాకు భరోసా ఇచ్చారు. కాబట్టి ఈ అనుభవాన్ని చదువుతున్న వారికి నా వినయపూర్వకమైన ప్రార్థన - సాయికి మీ కోరికలు విన్నవించుకుని, వాటిని ఆయన పవిత్ర పాదాల చెంత విడిచిపెట్టండి. ఆయన సరైన సమయంలో వాటిని మనకు అందిస్తారు. అదే సాయి సమయం. "ఓ దేవా! ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి. వారిని మీ రక్షణలో ఉంచుకుని మీ పాదాలను గుర్తుంచుకునేలా చేయండి. మీ నామాన్ని ఎల్లప్పుడూ జపించేలా మమ్మల్ని ఆశీర్వదించండి".
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
No comments:
Post a Comment