ఈరోజు భాగంలో అనుభవాలు:
- అనూహ్యరీతిన వేపాకు అందించారు బాబా
- ఫ్లాట్ కొనుగోలు చేయడంలో బాబా సహాయం
అనూహ్యరీతిన వేపాకు అందించారు బాబా
హైదరాబాదు నుండి సాయిభక్తుడు సి.సురేష్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నా పేరు సురేష్. నేను మల్టీమీడియా ఉత్పత్తులు మరియు శిక్షణ విభాగాలలో పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా నేను సాయిబాబా భక్తుడిని. నేను నా భార్య స్వప్నమీనాక్షి, నా నాలుగు సంవత్సరాల కూతురు ఆద్యశ్రీలతో హైదరాబాదులో నివాసముంటున్నాను. వాళ్లిద్దరూ కూడా సాయిబాబాకు దృఢమైన భక్తులు. మేము ప్రతి విషయంలో బాబా ముందు 'అవును', 'కాదు' అని చీటీలు వేసి నిర్ణయం తీసుకుంటాము. నేనిప్పుడు ఇటీవలి మా శిరిడీ సందర్శనానికి సంబంధించిన అనుభవాన్ని పంచుకుంటాను.
ఇటీవల నాకు సాయిబాబా ప్రశ్నలు-సమాధానాలు పుస్తకంలో, 'శిరిడీ వెళ్ళమని, గురుస్థాన్ వద్ద ధూపం వేయమని' వచ్చింది. దాంతో నేను నా భార్య, కుమార్తెలతోపాటు 2019, ఫిబ్రవరి 15న శిరిడీ వెళ్ళాను. హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్ సాయిబాబా మందిరం ద్వారా బుక్ చేసుకున్న రూములో దిగి, ఫ్రెషప్ అయ్యి దర్శనానికి వెళ్ళాము. సమాధిమందిరంలో బాబా దర్శనం బాగా జరిగింది. మధ్యాహ్నం గురుస్థాన్ వద్ద ధూపం వేసి, ప్రదక్షిణలు చేశాను. మా మనస్సు, హృదయం సాయిబాబా పాదాలవద్ద విశ్రమించాయి. ఆయన ఆశీస్సులతో మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది.
గురుస్థాన్ వద్ద మేము వేపాకుల కోసం చాలా వెతికాము, కానీ ఒక్కటి కూడా మా దృష్టిలో పడలేదు. నా భార్య, 'కనీసం ఒక్క వేపాకైనా కావాలి' అని నన్ను అభ్యర్థించింది. నేను ఎంతగా వెతికినప్పటికీ వేపాకు దొరకలేదు. సాధారణంగా నేను ప్రతిదానికీ సాయిబాబా సహాయం అడుగుతాను. కానీ నేను బాగా అలసిపోయినందున బాబాను అడగకుండానే నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. తరువాత మేము ప్రసాదాలయానికి వెళ్లి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకోవడానికి హోటల్‌కు వెళ్ళిపోయాము. సాయంత్రం 6 గంటలకి మేము మళ్ళీ దర్శనం కోసం సమాధిమందిరానికి వెళ్ళాము. తరువాత మేము కొంత షాపింగ్ చేసుకుని, శేజ్ ఆరతికి హాజరయ్యేందుకు ద్వారకామాయికి వెళ్లి తులసిచెట్టు వద్ద కూర్చున్నాము. ఆరతి చివరలో నేను నా కళ్ళు మూసుకుని బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. హఠాత్తుగా ఎవరో నా చేతులు తడుతుంటే నేను కళ్ళు తెరచి చూశాను. ఒక అరచేయి ఒక ఊదీ ప్యాకెట్టుతోపాటు ఒక వేపాకును నాకు అందిస్తోంది. నేను వాటిని తీసుకున్న మరుక్షణంలో అతను గుంపులో అదృశ్యమయ్యాడు. జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్న నా భార్య, నేను ఆశ్చర్యపోయాము. మధ్యాహ్నం వేపాకుకు సంబంధించిన విషయం నాకు, నా భార్యకు తప్ప మూడవవ్యక్తికి తెలియదు. అలాంటిది ఇప్పుడిలా వేపాకు నా చేతిలోకి వచ్చిందంటే, సాయిబాబా మమ్మల్ని గమనిస్తున్నారని మాకర్థమై మా మనస్సులు ఆనందంతో పరవశించిపోయాయి. వేపాకు ద్వారా బాబా మమ్మల్ని ఆశీర్వదించారని భావించాము. శిరిడీలో ఇంత గొప్ప అనుభవాన్ని మేము పొందాము.

ఫ్లాట్ కొనుగోలు చేయడంలో బాబా సహాయం
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నేను సాయిభక్తురాలిని. బాబా నాకు సహాయం చేసిన అనేక అనుభవాలున్నాయి. వాటిలో ఇటీవల 2018, డిసెంబరులో జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
నేను ఒక ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆ ఫ్లాట్ యజమానితో మాట్లాడటానికి వెళ్ళాను. అయితే అతను నా బడ్జెట్ కు మించి అధిక మొత్తం చెప్పారు. నాకు అద్దె ఇంటిలో నివసించడం ఇష్టంలేదు. ఆ ప్రదేశం, అక్కడి పరిసరాలు నా మనసుకు అనుకూలంగా ఉంటాయని నేను అదే సొసైటీలో ఫ్లాట్ కొనుక్కోవాలని అనుకున్నాను. ఏమి చేయాలో నాకు అర్థంకాక, 'సహాయం చేయమ'ని బాబాను అడుగుతూ ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే నిలబడి ఉన్నాను. అంతలో ఒక వ్యక్తి వచ్చి, "ఇక్కడ నిలబడి ఉండటానికి కారణమేమిట"ని నన్ను అడిగాడు. నేను అతనికి విషయమంతా చెప్పాను. వెంటనే అతను, "ఇదే ఫ్లాట్ పైన ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంది. ఆ ఫ్లాట్ యజమాని దానిని అమ్మాలని అనుకుంటున్నారు" అని చెప్పాడు. నేను ఆ ఫ్లాట్ యజమానిని సంప్రదించాను. మా ఇద్దరి మధ్య కొంత చర్చ జరిగాక నా బడ్జెట్ పరిధికన్నా తక్కువకే ఒప్పందం కుదిరింది. "నాకు సహాయం చేసి ఆశ్రయమిచ్చినందుకు ధన్యవాదాలు బాబా!"
ఓం శ్రీ సాయిరాం జీ 🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDelete