ఈరోజు భాగంలో అనుభవాలు:
- బాబా నా ప్రేమను గెలిపించారు
- ఆటోడ్రైవరుగా సహాయం చేయడానికి వచ్చిన బాబా
బాబా నా ప్రేమను గెలిపించారు
అద్దంకి నుండి శ్రీమతి ఝాన్సీ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
నా పేరు ఝాన్సీ. నేను డిగ్రీ చదువుతున్న రోజులనుంచి బాబా భక్తురాలిని. నేను చాలా సంవత్సరాలనుంచి నా సహాధ్యాయి అయిన ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. తన పేరు సుధీర్ కుమార్. మేము చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నాము. మాది ఒకే సామాజికవర్గం అయినప్పటికీ మా తల్లిదండ్రుల మధ్యనున్న గొడవలవల్ల ఎన్నిసార్లు ప్రాధేయపడినా మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు. సుధీర్ మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ తను ఇంకా మంచి పొజిషన్లో ఉండాలనీ, మా పెద్దలు మా పెళ్ళికి ఒప్పుకోవాలనీ నేను ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ వుండేదాన్ని. ఒకరోజు నేను సాయిభక్తుడైన మా అన్నయ్యకి ఫోన్ చేసి, “అన్నయ్యా! మా ఇద్దరి పెళ్ళి మా పెద్దల ఇష్టంతో జరుగుతుందో లేదో ఒక్కసారి బాబాను అడుగు” అని చెప్పాను. మా అన్నయ్య ఈ విషయం గురించి బాబాని అడిగినప్పుడు, “వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టంతోనే వాళ్ళ పెళ్ళి చేస్తాను, కానీ కొద్దిగా సమయం పడుతుంది. ఆలోపు నా మీద బాగా నమ్మకంతో వుండాలి” అని బాబా సమాధానం చెప్పారు. ఆ విషయం మా అన్నయ్య నాతో చెప్పాడు. బాబా మాటలపై విశ్వాసంతో నేను మా ఇంట్లో పెళ్లి విషయంలో ఎన్ని గొడవలైనా మా పెళ్ళి బాబా ఖచ్చితంగా జరిపిస్తారనే నమ్మకంతో సహనంగా ఉండేదాన్ని. కొన్నాళ్ళకి బాబా దయవల్ల సుధీర్ కి దుబాయ్ వెళ్ళే అవకాశం వచ్చింది. తరువాత సరిగ్గా ఆరునెలలు గడిచేసరికి మా పెద్దవాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకున్నారు. అలా బాబా చెప్పినట్లుగానే ఆయన ఆశీస్సులతో మా పెద్దల ఇష్టంతోనే మా పెళ్ళి జరిగింది. ఎప్పుడైతే అస్సలు జరగదనుకున్న మా పెళ్ళిని బాబా జరిపించారో అప్పటినుంచి నాకు ఆయన మీద నమ్మకం బాగా పెరిగింది.
తరువాత 2 సంవత్సరాలకి ప్రాజెక్ట్ అయిపోవడం వల్ల మేము దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగివచ్చాము. మేము మళ్లీ విదేశాలకి వెళ్ళే అవకాశం ఇవ్వమని బాబాను అడిగితే, '2,3 నెలలు వేచివుండమ'ని సమాధానం వచ్చింది. సరిగ్గా 2 నెలల తరువాత బాబా చెప్పినట్లే మావారికి విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది. బాబా ఆశీస్సులతో ఇప్పుడు మాకు ఒక పాప ఉంది. ఆయన దయవల్ల మేమంతా బాగున్నాము. నా బాబా పెట్టిన భిక్షవల్ల నా జీవితానికి ఇప్పుడు ఏ లోటూ లేదు.

ఆటోడ్రైవరుగా సహాయం చేయడానికి వచ్చిన బాబా
సాయిభక్తురాలు స్మిత తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ నమస్కారములు. నేను బాబా వైపు ఆకర్షితురాలినైనప్పటినుండి ఎన్నో అనుభవాలు పొందాను. ఆయన నా ప్రార్థనలన్నీ వింటున్నారు. వాటిలో కొన్నింటికి ఆయన నుండి స్పందన లేకపోయినప్పటికీ ఆయన వాటి విషయంలో చాలా మంచి ప్రణాళికలు కలిగి ఉంటారని నాకు ఖచ్చితంగా తెలుసు. నేనిప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను.
నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. అందుకు అవసరమైన ఒక క్లాసులో చేరాను. అందులో పాల్గొనే వారందరూ సమయానికి క్లాసులో ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆలస్యం అయితే వాళ్ళు పాఠంలో కొంత భాగాన్ని మిస్ అవుతారు, అప్పుడు మిగిలిన భాగం అర్థం కాకుండా పోతుంది. పైగా ఆలస్యంగా వచ్చిన వారిని లోపలకి అనుమతించకపోయే అవకాశం కూడా ఉంది. క్లాసు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. సాధారణ ట్రాఫిక్ ఉంటే నేను మా ఇంటి నుండి క్లాసుకు చేరుకోవడానికి 35 నుండి 40 నిమిషాలు పడుతుంది. ఒకరోజు నేను సాయంత్రం 5 గంటలకు క్యాబ్ బుక్ చేసి, గంట సమయముంది కదా అని చాలా ప్రశాంతంగా ఉన్నాను. కానీ ఊహించని విధంగా 10 నిమిషాల తరువాత క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేసి రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పాడు. అందువల్ల నేను బుకింగ్ రద్దు చేసి వేరే క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నించాను. కానీ, దురదృష్టవశాత్తు క్యాబ్‌లేవీ అందుబాటులో లేవు. బాబా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారని నాకు ఆయనపై నమ్మకం ఉంది. సమయం 5:20 అయినా ఇంకా క్యాబ్ బుకింగ్ కాలేదు. నేను బస్సు, ఆటో కోసం ప్రయత్నించినా కూడా ఆ మార్గంలో అవేవీ కనిపించలేదు. నేను నా మనసులో, 'బాబా నన్ను సమయానికి ఖచ్చితంగా చేరుస్తారు. కానీ ఎలా?' అని అనుకుంటూ ఉన్నాను. గం.5:25ని అవుతుండగా ఒక నిమిషం నడక దూరంలో ఆటో ఉండటం నేను గమనించాను. వెంటనే ఆ ఆటో బుక్ చేసుకుని, ఆటో ఎక్కింది మొదలు బాబా నామస్మరణ చేయడం మొదలుపెట్టాను. కానీ మనసులో, 'బాబా నన్ను ఆలస్యం చేయాలనుకుంటున్నారా? ఒకవేళ అదే ఆయన నిర్ణయమైతే నేను సంతోషంగా దానిని స్వీకరిస్తాను' అని అనుకున్నాను. ఆశ్చర్యం! ఇంతలో ఆటోడ్రైవర్ అతి దగ్గర మార్గంలోకి మలుపు తీసుకున్నాడు. సాధారణంగా ఆటోలు ఆ మార్గంగుండా ఎప్పుడూ ప్రయాణించవు. నేను నా గమ్యాన్ని కేవలం 25 నిముషాల్లో అంటే 5:50 కల్లా చేరుకున్నాను. క్లాసుకి ఆలస్యమై ఇబ్బందిపడకుండా బాబా ఆటోడ్రైవరుగా వచ్చి నాకు సహాయం చేసారు. ఒక ముఖ్యవిషయం ఏమిటంటే, నేను డ్రైవర్ పేరు 'భోలా' అని ఉండటం గమనించాను. "భోలా" అంటే శివుని పేరు. నేను ఎప్పుడూ బాబాను శివుని అవతారంగా భావిస్తాను. సమస్య చిన్నదైనా, పెద్దదైనా మనకు బాబాపై విశ్వాసముంటే ఆయన తన బిడ్డలకు సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. "బాబా! మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు మాకోసం చేస్తున్న వాటన్నిటికీ మేము ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాము".
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Sai Ram 🙏🏼
ReplyDelete