ఈరోజు భాగంలో అనుభవాలు:
బాబాకు భక్తుడిగా మలచిన రెండు అనుభవాలు
- సాయీ’ అని తలచుకున్న మరుసటిరోజుకే ఆరోగ్యం కుదుటపడింది
- బాబాకు భక్తుడిగా మలచిన రెండు అనుభవాలు
'సాయీ’ అని తలచుకున్న మరుసటిరోజుకే ఆరోగ్యం కుదుటపడింది
నేను సాయిభక్తుడిని. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు సాయిబాబాపై రచించిన పుస్తకాలు చదవటం నాకు చాలారోజులనుండి అలవాటు. కొన్నిరోజుల క్రితం ఒక అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇటీవల మా అమ్మగారిపై సాయి కురిపించిన ఆశీస్సులను ఇప్పుడు మీతో పంచుకుంటాను.
కొన్ని రోజుల క్రితం మా అమ్మగారికి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. తను షుగర్ వ్యాధిగ్రస్థురాలు. వైద్యపరీక్షలు చేయిస్తే, ఆహారం తీసుకునేముందు 333, ఆహారం తీసుకున్నాక 455 రీడింగ్ వచ్చింది. పైగా జ్వరంతో వారంరోజులపాటు మంచం దిగలేదు. డాక్టర్లు అమ్మని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పారు. కానీ నేను బాబాపై భారం వేసి శనివారం, ఆదివారం రెండురోజులు వేచిచూసి, తర్వాత అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేద్దామని అనుకున్నాను.
నేను సాయిబాబాని, సాయి మాస్టర్ ని(భరద్వాజ గారిని)మనసులో తలచుకొని, “నాపైన నిజంగా మీకు ప్రేమ ఉంటే అమ్మ ఆరోగ్యం కుదుటపడేలా చేయండి సాయీ! మీమీదే భారం వేస్తున్నాను” అని చెప్పుకొని, బాబా స్మరణ చేశాను. ఆశ్చర్యకరంగా మరుసటిరోజే అమ్మ ఆరోగ్యం డెబ్భై శాతం కుదుటపడింది. జ్వరం ఛాయలే లేవు. నేను ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ తరువాత అమ్మ పూర్తిగా కోలుకుంది. వారంరోజులపాటు మంచంమీదనుంచి లేవని వ్యక్తి, ‘సాయీ’ అని తలచుకున్న మరుసటిరోజుకే ఆరోగ్యం మెరుగై కోలుకోవడం నిజంగా బాబా దయ. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

ముంబాయి నుండి సాయిభక్తుడు రామ్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ప్రియమైన సాయిభక్తులందరికీ ఓం శ్రీ సాయిరామ్!
2013లో నేను ఒక ప్రముఖ బ్యాంకులో పనిచేస్తుండేవాడిని. నాకు వచ్చే జీతం చాలా తక్కువగా ఉండేది. ఒక సహోద్యోగి సూచనలపై నేను ఒక సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. కొన్నిరోజుల తరువాత ఆ సంస్థ హెచ్.ఆర్ నాకు ఫోన్ చేసి, "మీరు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు, మీ మెయిల్ ఐడికి ఆఫర్ లెటర్ పంపించాము. మీరు అంతా చూసుకుని, మీకు సమ్మతమైతే కన్‌ఫర్మ్ చేస్తూ రిప్లై చేయమ"ని చెప్పారు. నేను మెయిల్ చూస్తే, నాకు వస్తున్న జీతం కంటే కేవలం 2500 రూపాయలు మాత్రమే పెంచారు. అందువలన నేను, "మీరు ఇస్తానన్న జీతం చాలా తక్కువగా ఉంది. దయచేసి నా అనుభవానికి తగినట్లు జీతం పెంచేలా అవసరమైన చర్య తీసుకోమ"ని అభ్యర్థిస్తూ సమాధానమిచ్చాను. ఆ తర్వాత నేను నా ఆఫీసు నుండి క్రిందకి దిగి సాయిబాబా మందిరానికి వెళ్ళాను. బాబాకు నమస్కరించుకుని, "నాకు వాళ్ళు ఇస్తానంటున్న జీతం చాలా తక్కువగా ఉంది. నా బాధ్యతలు నెరవేర్చడానికి, నా అవసరాలలో కొన్నింటినైనా తీర్చుకోవడానికి సహాయకారిగా ఉండేవిధంగా కనిష్ఠంగానైనా జీతాన్ని పెంచేలా చూడండి బాబా" అని బాబాను ప్రార్థించాను. కొన్నిరోజుల తరువాత హెచ్.ఆర్ ఫోన్ చేసి, "సవరించిన ఆఫర్ లెటర్ పంపించాను, దయచేసి ఒకసారి చూసుకోండి. వీలైనంతవరకు పెంచాను, అంతకన్నా ఎక్కువ సాధ్యం కాదు" అని చెప్పారు. నేను మెయిల్ చూసి ఆశ్చర్యపోయాను. నేను సాయితో ఎంత మొత్తాన్ని చెప్పుకున్నానో అంతే మొత్తాన్ని నా జీతంగా నిర్ణయిస్తూ వాళ్ళు ఆఫర్ లెటర్ పంపించి ఉన్నారు. నేనెంతో ఆనందంతో మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇది నా మొదటి అనుభవం.
ఆ తరువాత హెచ్.ఆర్ నేరుగా సంస్థకు వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోమని చెప్పారు. నేను అక్కడికి వెళ్లి, హెచ్.ఆర్ వద్దనుండి ఆఫర్ లెటర్ తీసుకుని ఆ ఉత్సాహంలో నేను రిపోర్టింగ్ మేనేజర్(బాస్)కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపాను. అతను బయటకు వచ్చి నన్ను అభినందించి, "ఇప్పుడు సంతోషంగా ఉన్నారా?" అని అడిగాడు. నేను 'అవున'ని చెప్పాను. అతను, "మీరు 15 రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సిన అవసరం ఉంద"ని చెప్పారు. అది విని నేను నిర్ఘాంతపోయి, "ఇదెలా సాధ్యం? నా ప్రస్తుత కంపెనీలో నోటీసు వ్యవధి నెలగా ఉంది. అందువలన నేను నెలలోపు ఇక్కడ ఉద్యోగంలో చేరలేను" అని చెప్పాను. అతను, "నాకవన్నీ తెలియవు, 15 రోజుల్లో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంద"ని ఖరాఖండీగా చెప్పాడు. నాకు వేరే దారి లేక సరేనని చెప్పాను. వెంటనే అక్కడ ఉద్యోగం గురించి నాకు చెప్పిన నా సహోద్యోగితో మాట్లాడి విషయం చెప్పాను. తరువాత నా ఆఫీసుకి వెళ్ళాను. నేను ఆఫీసు గేట్‌లోకి ప్రవేశించేముందు సాయిబాబా మందిరానికి వెళ్లి, "15 రోజుల్లో చేరమని బాస్ చెప్తున్నారు. అది నాకు సాధ్యం కాదు. నెలరోజుల వ్యవధి ఇచ్చేలా దయచేసి మీరే ఏదైనా అద్భుతం చేయండి. అసలు నేను నా బాస్ కి ఫోన్ చేయడం నా తప్పే. నేను ఫోన్ చేయకుండా ఉండివుంటే అతను నన్నిలా నిర్బంధించి ఉండేవాడు కాదు. అందుకు నన్ను క్షమించండి బాబా!" అని బాబాకు మొరపెట్టుకున్నాను.
తరువాత ఆఫీసుకు వెళ్లి నా బ్యాగును నా డెస్క్‌పై పెట్టి, నా సహోద్యోగి వద్దకు వెళ్లి, జరిగిందంతా ఆమెకు వివరించాను. అది విన్న ఆమె నేరుగా బాస్‌తో ఎందుకు మాట్లాడారని నా మీద కోప్పడి, "ఇక మీరే అతనితో నేరుగా మాట్లాడి ఒప్పించుకోండి" అన్నారు. నేను ఆమెకు క్షమాపణలు చెప్పి, "నేను నేరుగా ఆ వ్యక్తితో(బిగ్ బాస్) ఎలా మాట్లాడగలను? దయచేసి మీరే అతనితో మాట్లాడి ఉద్యోగంలో చేరడానికి గడువు పెంచేలా చేయమ"ని అభ్యర్థించాను. ఇంకా "దయచేసి నన్ను క్షమించండి. మళ్ళీ ఇలాంటి తప్పు పునరావృతం చేయన"ని కూడా ఆమెతో చెప్పాను. ఆమె నా సీటుకు వెళ్ళమని చెప్పింది. నేను పూర్తిగా నిరుత్సాహపడిపోయి మౌనంగా ఉండిపోయాను. నా చివరితేదీ గురించి నా ప్రస్తుత రిపోర్టింగ్ మేనేజర్‌కు చెప్పాల్సి ఉండటంతో ఏం చేయాలో అర్థంకాక సాయిబాబా నామం లోలోపల జపిస్తూ ప్రశాంతంగా, ఓపికగా కూర్చున్నాను. అదేసమయంలో నా డెస్క్ మీద వున్న బాబా ఫోటోను చూస్తూ, “బాబా! మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్లీజ్! ఏదో ఒక అద్భుతం చేయండి. అది మీరు మాత్రమే చేయగలరు" అని ప్రార్థించాను. ఆరోజు సాయంత్రానికి నా సహోద్యోగి నా వద్దకు వచ్చి, "నేను మాట్లాడాను. మీరు ఒక నెలలో అక్కడ చేరండి" అని చెప్పింది. నేను ఆనందంగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పి, నా ప్రవర్తనకు క్షమాపణలు కూడా చెప్పుకున్నాను. తను వెళ్ళిపోయాక నేను సాయికి కృతజ్ఞతలు తెలుపుకుని, "మీరు అద్భుతం చేస్తారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీరెప్పుడూ మీ బిడ్డల చేతిని మధ్యలో విడిచిపెట్టరు" అని చెప్పుకున్నాను.
ఈ రెండు సంఘటనలు నా జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఈ సంఘటనలు జరగకముందు నేనెప్పుడూ సాయిబాబా మందిరానికి వెళ్ళలేదు, ఆయనను ప్రార్థించలేదు. అప్పటినుండి నేను సాయిబాబా భక్తుడినయ్యాను. "ఈరోజువరకు మీరు నాపై కురిపిస్తున్న ఆశీస్సులకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! 'శ్రద్ధ - సబూరి' కలిగివుండేలా అందరినీ ఆశీర్వదించండి".
అల్లా మాలిక్.
అల్లా మాలిక్.
🕉 sai Ram
ReplyDelete