సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 174వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. నవగురువార వ్రతం చివరిరోజున బాబా నన్ను తన మందిరానికి రప్పించుకున్నారు
  2. పోయిందనుకున్న వస్తువును తిరిగి చూపించారు సాయి

నవగురువార వ్రతం చివరిరోజున బాబా నన్ను తన మందిరానికి రప్పించుకున్నారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను న్యూజిలాండ్‌లో నివసిస్తున్నాను. ప్రతిరోజూ బాబా నాకు చూపే అద్భుతాలతో నేను రోజురోజుకు ఆయనతో ప్రేమలో పడిపోతున్నాను. ఆయన మన జీవితాలకి గొప్ప అండగా ఉంటూ సహాయాన్ని అందిస్తున్నారు. నేను చిన్నప్పటినుండి ఆయన భక్తురాలిని. రోజూ 'సాయిచాలీసా' చదువుతూ  మందిరానికి వెళ్లి ఆయన దర్శనం చేసుకునేదాన్ని. గత రెండు సంవత్సరాలనుండి నేను ఆయనకి ఇంకా ఇంకా దగ్గరయ్యాను. ఇప్పటికీ కొన్నిసార్లు నేను కొన్ని తప్పులు చేస్తుంటాను. కానీ బాబా నన్ను మారుస్తారని నా నమ్మకం. ఇక నా అనుభవానికి వస్తే....

నేను, నా భర్త నెలలో 2-3 సార్లు సాయిబాబా మందిరానికి వెళ్తాము. అది కూడా సాధారణంగా వారాంతాల్లోనే వెళ్తాము. ఇటీవల నేను నవగురువార వ్రతం పూర్తి చేశాను. ఆరోజు సాయంత్రం నేను పూజ ప్రారంభించేముందు నా స్నేహితులలో ఒకరు ఫోన్ చేశారు. ఆమె కూడా సాయిభక్తురాలే. మాటల్లో నేను, "వ్రతం పూర్తి చేస్తున్నాను, అందుకే ఇప్పుడు నేను బాబాకు నైవేద్యం తయారు చేస్తున్నాన"ని చెప్పాను. ఆమె, "అవునా! మంచిది" అని చెప్పి, "మరి బాబా మందిరానికి వెళుతున్నావా?" అని అడిగింది. "మేము సాధారణంగా వారాంతాల్లో వెళ్తాము, ఈరోజు వెళ్లడం సాధ్యం కాదు" అని తనతో చెప్పాను. కానీ తనతో మాట్లాడాక, "ఈరోజు నా వ్రతం పూర్తవుతుంది, పైగా నిన్ననే సచ్చరిత్ర పారాయణ పూర్తి చేశాను. కాబట్టి మందిరానికి వెళ్తే బాగుంటుంది" అని నా మనసుకు అనిపించింది. ఆరోజు నా భర్త ఇంట్లోనే ఉన్నారు. కానీ, 'నన్ను మందిరానికి తీసుకెళ్లమ'ని తనని బలవంతపెట్టడం నాకు ఇష్టంలేక ఊరుకున్నాను. నేను ఊరుకున్నా సాయిబాబా తన అద్భుతాన్ని చూపించారు. హఠాత్తుగా నా భర్త నా వద్దకు వచ్చి, "సాయిబాబా మందిరానికి వెళదామా?" అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. పట్టలేని ఆనందంతో నా భర్తతో 'వెళ్దాం' అని చెప్పాను. కొన్నిరోజుల క్రితం క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో 'ఉల్లిపాయలు, చపాతీలు దానం చేయమ'ని నాకు మెసేజ్ వచ్చింది. అకస్మాత్తుగా ఆ మెసేజ్ నా మదిలో మెదిలి నా భర్తతో, "ఉల్లిపాయలు, చపాతీలు కొని మందిరంలో బాబాకు సమర్పిద్దామా?" అని అడిగాను. అందుకు ఆయన సరేనన్నారు. నా వ్రతం చివరిరోజున  బాబా మందిరానికి వెళ్లి ఉల్లిపాయలు, చపాతీలు, ఇంకా నేను ఇంట్లో తయారుచేసిన క్యాబేజీ కూరను సాయిబాబాకు సమర్పించాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా ఆశీస్సులతో తిరిగి ఇంటికి వచ్చాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

మరొక అనుభవం: 2019, జనవరి 31 నుండి నా భర్తకు వేరే శాఖలో పనిచేయాల్సి వచ్చింది. ఆ ఆఫీస్ ఉండే చోటు మా ఇంటినుండి చాలా దూరం. అక్కడికి వెళ్ళడానికి మావారికి గంటన్నర సమయం ప్రయాణించాల్సి వచ్చేది. దానితో మేము కొద్దిగా నిరాశ చెందాము. కానీ, "మా సాయి ఎప్పుడూ మాకు తోడుగా ఉన్నారు. కాబట్టి భయమెందుకు?" అనుకున్నాము. మావారి సహోద్యోగులలో ఒక వృద్ధురాలు ఉన్నారు. ఆమె, "గురు, శుక్రవారాలలో నేను ఆ ఆఫీసులో పని చేస్తాన"ని ఆ రెండురోజులు తను తీసుకున్నారు. బాబా అత్యుత్తమమైన రీతిలో మాకు చేసిన సహాయానికి నేను చాలా సంతోషించాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! నాకు మంచి ఉద్యోగాన్నివ్వండి. మా గురించి మీకు తెలుసు. నేను మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీ ఆశీస్సుల కోసం, అద్భుతాల కోసం సహనంతో వేచి ఉంటాను".

source: http://www.shirdisaibabaexperiences.org/2019/07/shirdi-sai-baba-miracles-part-2412.html

పోయిందనుకున్న వస్తువును తిరిగి చూపించారు సాయి

కరేబియన్‌ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను సుమారు 7 సంవత్సరాల నుండి బాబా భక్తురాలిని. బాబా నన్ను చాలా అద్భుతమైన అనుభవాలతో ఆశీర్వదించారు.

ఒకసారి నేను సత్సంగానికి వెళ్ళడానికి తయారవుతున్నాను. డైమండ్ గాజులు వేసుకుందామని చూస్తే అవి కనిపించలేదు. కృత్రిమ ఆభరణాల పెట్టెలో, ఇంకా ఇతర చోట్ల, అంతటా వెతికాను కానీ, ఎక్కడా కనిపించలేదు. చివరిసారి ఆభరణాలు తీసినప్పుడు ఎక్కడో పడిపోయివుంటుందని అనుకున్నాను. సాయికృపతో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందిన అనుభవాలు జ్ఞప్తికి వచ్చి, "ఇది వ్యాపారం కాదు కానీ, నా గాజు దొరికితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. తద్వారా ఇతర భక్తులకు ప్రయోజనం కలగవచ్చు కదా" అని నా మనసులో అనుకుని, "సాయీ! దయచేసి సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. నేనలా సాయిని తలచుకున్నానో లేదో మరుక్షణంలో కృత్రిమ ఆభరణాల పెట్టెపై చూస్తే గాజు ఉంది. అదివరకు నేను ఆ బాక్సులో కూడా వెతికాను. అలాంటిది దానిమీద ఉండటం ఆశ్చర్యం! ఎవరికీ నమ్మశక్యం కాదు, కానీ నేను చెప్పేది నిజం. ఇది మన సాయి అనుగ్రహం. ఆయన మన కోరికలన్నీ నెరవేరుస్తారు. నిజంగా బాబా నాకు చూపిన గొప్ప అద్భుతమిది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

source:  http://www.shirdisaibabaexperiences.org/2019/07/shirdi-sai-baba-miracles-part-2411.html

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo