ఈరోజు భాగంలో అనుభవాలు:
- గృహప్రవేశానికి విచ్చేసిన సాయి
- సాయి ఆశీస్సులతో లభించిన ఉద్యోగం
గృహప్రవేశానికి విచ్చేసిన సాయి
సాయిభక్తురాలు శ్రీమతి పి.నాగేశ్వరి ఇటీవల జరిగిన తమ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదములు. నా పేరు నాగేశ్వరి. నేను సాయిభక్తురాలిని. సంతోషాన్నైనా, బాధనైనా ప్రతి విషయాన్నీ సాయితో పంచుకోవడం నాకెంతో సంతోషం. ఈమధ్యనే జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
మా స్వంత ఊరు తుని. మా అమ్మాయి అనకాపల్లిలో ఉంటుంది. మేము రిటైరయ్యాక వేరుగా సొంత ఊరిలో ఉండటమెందుకు, అమ్మాయితోనే కలిసి ఉందామని అనకాపల్లిలో ఒక చిన్న స్థలం కొనుక్కున్నాము. మేము కొన్న స్థలం బాబా గుడికి ఎదురుగా ఉన్న వీధిలో. నిజానికి ఆ అడ్రస్ ఎవరికి కావాలి? బాబానే మాకు అంతా. ఆ స్థలంలో క్రింద పోర్షనులో మా అమ్మాయి వాళ్ళు వుండేలా, పైన మేము ఉండేలా గృహనిర్మాణం చేసుకున్నాము. 2019, జూన్ 23న గృహప్రవేశం పెట్టుకున్నాము. ఆ కార్యక్రమానికి ఏదో ఒక రూపంలో రమ్మని బాబాను ప్రార్థించాను. తరువాత మా వాళ్ళందరితో, "కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు మొదలైనవి ఏవి వచ్చినా వేటినీ తరమకుండా ఏదో ఒకటి ప్రసాదం పెట్టి పంపించండి" అని చెప్పాను. గృహప్రవేశం చాలా బాగా జరిగింది. కానీ, బాబా వచ్చినట్లుగా ఆయన ఉనికి తెలియక నేను కాస్త బాధపడ్డాను. అందరి భోజనాలు పూర్తయ్యాక బహుమతులు ఒక్కొక్కటీ తెరచి చూస్తున్నాం. ఆశ్చర్యం! వాటిలో బాబా నిలువెత్తు ఫోటో ఒకటి, బస్ట్‌సైజ్ ఫోటో ఒకటి, రేడియం విగ్రహం ఒకటి ఉన్నాయి. వాటిని చూసి పట్టలేని ఆనందంతో నాకు మాటలు రాలేదు. మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అప్పటి నా అనుభూతిని పదాల్లో పెట్టాలంటే నాకు చేతకావటం లేదు. 'ఈ రోజుల్లో బాబా ఫోటోలు బహుమతులుగా ఇవ్వటం మామూలే కదా!?' అని అనిపించవచ్చు. కానీ మేము ఆ ఊరికి కొత్తగా వచ్చాము. ఇరుగుపొరుగున వున్న అయిదుమంది తప్ప వేరెవరూ మాకు తెలీదు, మేము తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. నేను గృహప్రవేశానికి ఇరుగుపొరుగున ఉన్న ఆ ఐదుమందిని, మా చుట్టాలు ఒక పదిమందిని మాత్రమే పిలిచాను. ఆ పదిహేనుమందిలో కొంతమంది చుట్టాలు బట్టలే పెట్టారు. మిగతావాళ్ళలో ముగ్గురి ద్వారా బహుమతుల రూపంలో బాబా దర్శనమిచ్చారు. భక్తులు ప్రేమతో పిలిస్తే ఆ తండ్రి రాకుండా ఉండగలరా? ఆయన ఏ రూపంలో అయినా వస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ. అందరికీ సాయి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

సాయి ఆశీస్సులతో లభించిన ఉద్యోగం
నా పేరు స్నేహ. నేను ఇటీవలికాలంనుండి సాయిభక్తురాలిని. నేనిప్పుడు నా స్వీయ అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. గతంలో నేనొకసారి 4 నెలలపాటు ఉద్యోగంకోసం చాలా వెతికాను. నేను MNC కంపెనీలలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. వాటిలో కొన్ని కంపెనీల్లో నేను ఎంపికయ్యాను కూడా. కానీ అనుకోకుండా ప్రాజెక్ట్ రద్దు కావడంతో నాకు ఆఫర్ లెటర్ రాలేదు. ఆ తరువాత నేను ఎంత ప్రయత్నించినప్పటికీ నాకు ప్రతికూల స్పందనే ఎదురయ్యేది. 2 నుండి 3 రౌండ్లు నేను బాగా చేసినా గాని రోజు నిరాశతో ముగిసేది. రెండు MNC కంపెనీలలో అయితే అన్ని రౌండ్లు పూర్తి చేసినా కాని నాకు ఆఫర్ లెటర్ రాలేదు. ప్రతిసారీ ఇలానే జరుగుతుండటంతో నేను చాలా ఆందోళనపడి సాయిబాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. "9 గురువారాలపాటు సాబుదానా కిచిడి మాత్రమే తిని ఉపవాసం ఉంటాను" అని నేను బాబాకు మ్రొక్కుకున్నాను. అదేరోజు నేను సాయిభక్తుల అనుభవాల వెబ్‌సైట్ గురించి తెలుసుకున్నాను. వెంటనే నేను భక్తుల అనుభవాలను చదవడం ప్రారంభించాను. బాబా తన భక్తులపై చూపే ప్రేమకు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. బాబా ఈ భక్తులందరి ప్రార్థనలు వింటున్నప్పుడు, ఆయన నా ప్రార్థనలను కూడా వింటారని నేను అనుకున్నాను. అప్పటినుండి నేను హృదయపూర్వకంగా ఆయనను ప్రార్థించడం మొదలుపెట్టాను. నేను రోజూ సాయి సచ్చరిత్ర వినడం, భక్తుల అనుభవాలు చదవడం చేస్తూ చాలా సంతోషంగా ఉండేదాన్ని. అలా ఉండగా ఒకరోజు నేను ఒక భక్తుని అనుభవాన్ని చదివాను. అతని పరిస్థితి కూడా నాలాంటిదే. అతనికి ఉద్యోగం రాక చాలా కలతతో బాబాపై కోపం తెచ్చుకుని ఆ కోపంలో ఏదేదో మాట్లాడి, "ఇప్పటికైనా కరుణించమ"ని బాబాను ప్రార్థించాడట. బాబా అతనికి సహాయం చేశారు. అతను తన ప్రార్థన ముగించి చేతిలోకి మొబైల్ తీసుకున్న మరుక్షణం తనకు ఉద్యోగం వచ్చిందని ఒక కంపెనీ నుండి కాల్ వచ్చింది. ఎంత ఆశ్చర్యం! ఆ అనుభవాన్ని చదివాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. సాయిపై నాకు పూర్తి నమ్మకం వచ్చింది. నేనెప్పుడూ సాయిపట్ల చెడుగా అనుకోలేదు, కలత చెందలేదు. ఆయన నా తల్లిదండ్రుల వంటివారు, మనకు ఏది మంచిదో దానినే మనకు ఇవ్వాలని ఆయనెప్పుడూ ఆలోచిస్తుంటారు.
నేను, "ఆ భక్తుడికి సహాయం చేసినట్లు నాకు కూడా సహాయం చేసి నా కలను పూర్తి చేయండి బాబా" అని కన్నీళ్లతో సాయిని ప్రార్థించాను. అలా ఒక గంటసేపు బాబాను ప్రార్థిస్తూ గడిపాను. తరువాత నా మొబైల్‌ను నా చేతిలోకి తీసుకుంటూనే ఆశ్చర్యపోయాను. ఒక MNC సంస్థ నుండి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు రెండు రౌండ్లు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు చేసి నన్ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ సంస్థ కనీసం 4 రౌండ్లు చేసి గాని ఉద్యోగంలోకి తీసుకోదు. అలాంటిది కేవలం 2 రౌండ్లతో ఉద్యోగం ప్రసాదించి బాబా నన్ను ఆశీర్వదించారు. కాబట్టి సాయి ఆశీస్సులుంటే మనం ఏదైనా పొందవచ్చు. "లవ్ యు సాయీ! మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఇలాగే మీ ఆశీస్సులు నాపై సదా ఉంచండి".
Sri sainathmaharajuki jai
ReplyDeleteఓం శ్రీ సాయిరాం 🙏
ReplyDelete