ఈ భాగంలో అనుభవాలు:
1. దయతో ఇబ్బందులు లేకుండా సంతోషపరచిన బాబా
2. పిలిచిన వెంటనే పలికే బాబా ఉండగా భయం ఎందుకు?
3. బాబా దయతో దొరికిన లాకర్ తాళం
దయతో ఇబ్బందులు లేకుండా సంతోషపరచిన బాబా
మా రెండో అమ్మాయి MS ENT పూర్తిచేసి ప్రైవేట్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్గా చేస్తుంది. 2025, సెప్టెంబర్ మూడో వారంలో తను తన స్నేహితులతో(అందరూ అమ్మాయిలు మరియు డాక్టర్లు) కలిసి 3 రోజులు గోకర్ణ, మురుడేశ్వర్ యాత్రకి వెళ్ళింది. అసలే ఆ సమయంలో ఎక్కడ చూసినా ఉరుములు, పిడుగులు, భారీ వర్షాలు. అందువల్ల మేము ఎలా వెళ్ళొస్తారోనని టెన్షన్ పడ్డాము. నేను ఏ కష్టం వచ్చినా ముందుగా చెప్పుకునే మన బాబాకి "వాళ్ళు క్షేమంగా వెళ్లి, రావాల"ని చెప్పుకున్నాను. బాబా దయ, వాళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా వెళ్లొచ్చారు. నమో సాయినాథం!
పిలిచిన వెంటనే పలికే బాబా ఉండగా భయం ఎందుకు?
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. 2025, సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం నిద్రలేవగానే నాకు ఎందుకో బాగా కడుపునొప్పి వచ్చింది. ఒక 2 నిముషాలు కూడా నిల్చోలేకపోయాను. వాంతి కూడా అయింది. ఒక పక్క మా పాప స్కూలుకి సమయమవుతుంది. నాకేమో వంట చేయడానికి అస్సలు ఓపిక లేదు. నా బాధ చూడలేక మావారు వెంటనే వెళ్లి మాత్రలు తెచ్చారు కానీ, నాకు వాటిని వేసుకోవడం ఇష్టంలేక, "బాబా! మీ అనుగ్రహంతో ఈ కడుపునొప్పి తగ్గేలా చేయండి" అని హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించి, ఆయన మీద భారమేసి పడుకున్నాను. బాబా దయతో ఒక అరగంట/గంటకల్లా నా ఆరోగ్యం కుదుటపడింది. ఇంకోరోజు రాత్రి అందరూ పడుకున్నాక హఠాత్తుగా మా బాబు చెవినొప్పి అని ఏడ్చాడు. ఆ రాత్రివేళ ఏమి చేయాలో నాకు తోచక పెద్దవాళ్ళు వేసుకోనే ఎయిర్ డ్రాప్స్ బాబు చెవిలో వేసాను. అయినా వాడికి నొప్పి తగ్గలేదు. నాకు ఏం చేయడానికి అర్ధంకాక 'ఓం సాయి రక్షక శరణం దేవా' అని నామస్మరణ చేస్తూ వుంటే, గంటసేపటికి బాబు నిద్రపోయాడు. బాబా దయవల్ల వాడి చెవినొప్పి తగ్గింది. పిలిచిన వెంటనే పలికే బాబా ఉండగా మనకి భయం ఎందుకు?. ఆయన మీద భారమేస్తే, అయనే మనల్ని కాపాడతాడు. "సాయినాథా! ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడండి".
బాబా దయతో దొరికిన లాకర్ తాళం
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు గురుమూర్తి. ఒకరోజు నేను బ్యాంకు లాకర్ పని చేసుకొచ్చాను. కొన్నిరోజుల తరువాత ఇంట్లో వెతికితే ఆ బ్యాంకు లాకర్ తాళం కనిపించలేదు. దాదాపు రెండు వారాలపాటు కప్బోర్డ్స్ మొదలుకొని ఇంట్లో అంతా వెతికినా ఆ తాళం కనిపించలేదు. దాంతో ఇక కనిపించదేమోనని భయమేసింది. ఎందుకంటే, బ్యాంకు లాకర్ తాళం పోతే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. అందువల్ల సాయినాథుని, ఏడుకొండలవాడిని తాళం దొరికేలా చేయమని మనసారా వేడుకున్నాను. ఒక వారం తరువాత వేరే వస్తువుకోసం వెతుకుతుంటే ఎప్పు డూ పెట్టని చోట హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. ఆ హ్యాండ్ బ్యాగులో చూడగా తాళం అందులోనే ఉంది. మా ఆనందానికి అంతులేదు. "ధన్యవాదాలు సాయినాథా, ఏడుకొండలవాడా!".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

ఓమ్ శ్రీ సాయినాథాయ నమో నమః 🙏🏻
ReplyDelete🕉️🌹🙏🏻🙏🏻🙏🏻🌹🔯
Om srisairam.....sairam...sairam....sairam...sairam...sairam...🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Rakshak Saranam Devaa 🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏
ReplyDeleteOmsrisaiarogyaskemadhayanamah🙏🌹🙏
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
om Sai Ram
ReplyDeleteOm Sai Ram my favourite month is Kaartika masamu. Full Shiva and Vishnu pooja and lighting diyas is happy.Sai Baba likes lighting diyas.Om Sai Baba is Shiva and Vishnu roop . Daily rituals are good
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏