ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా అనుగ్రహం
2. నమ్మినవాళ్ళని ఎల్లవేళలా చాలా చక్కగా చూసుకుంటారు బాబా
3. అడిగినంతనే అనుగ్రహించిన బాబా
బాబా అనుగ్రహం
సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు రాణి. కాకినాడ మా స్వగ్రామం. నాకు ఇద్దరు అమ్మాయిలు. మా పెద్దమ్మాయి ఎంబిబిఎస్ పూర్తి చేసింది(తనకి అది బాబా పెట్టిన భిక్ష). తర్వాత తను పీజీ చేయడానికి యూఎస్ఏ వెళ్లేందుకు బాబాని అనుమతి అడిగితే, ఆయన తమ అంగీకారం తెలియజేశారు. అంతా బాగుంది కానీ, డబ్బు విషయంలో మేము చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. బ్యాంకు లోన్ అప్రూవ్ అవ్వడానికి ఇంజనీర్ అప్రూవల్ అవసరమైంది. మేము ఎంతోమంది ఇంజినీర్లను కలిసాము. వాళ్లంతా మాకు లోన్ రాదని చెప్పారు. ఇక ఆఖరికి, "బాబా! ఇదే చివర ప్రయత్నం" అని బాబాతో చెప్పుకొని ఒక ఇంజనీర్ దగ్గరకి వెళ్ళాము. అక్కడ మొదలైంది బాబా అద్భుతం. ఆ ఇంజనీర్ సాయి భక్తుడు. అతని ఆఫీసులో ఎంట్రన్స్ దగ్గర నిలువెత్తు సాయి ఫోటో వుంది. అది చూసి 'వేర్ యు గో. ఐ విల్ ఫాలో యు(నువ్వెక్కడికి వెళ్లినా నేను నీ వెంటుంటాను)' అని బాబా నిరూపించారని నాకు అనిపించింది. ఆ ఇంజనీర్ లోన్ ప్రక్రియ అంతా పూర్తి చేసి మా అమ్మాయికి చాలా సహాయం చేసారు. చాలా అడ్డంకులు వచ్చాయి కానీ, బాబా అవి అన్ని తొలగించారు. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఇలాగే కాపాడుతూ ఉండండి బాబా. నాకు, నా కుటుంబానికి, పిల్లలకి తోడుగా ఉండండి. తోటి భక్తులని కూడా చల్లగా చూడు బాబా".
నమ్మినవాళ్ళని ఎల్లవేళలా చాలా చక్కగా చూసుకుంటారు బాబా
సాయి పాదపద్మములకు నా నమస్కారాలు. నా పేరు అమరనాథ్. మా అబ్బాయి సాయికార్తికేయ. యూస్ఏలోని మిస్సోరి యూనివర్సిటీలో ఎమ్ఎస్ చేసాడు. వాడు ఉద్యోగం చేస్తే, నాకు ఆర్థిక వెసులుబాటు దొరుకుతుందని నా ఆశ. కానీ మొదట్నుంచి వాడికి పిహెచ్డి చేయాలని కోరిక. అందువల్ల నా ఆర్థిక స్థితి అంతమంచిగా లేకున్నా వాడి ఇష్టాన్ని కాదనలేక వాడిని ప్రోత్సహించాను. బాబా దయతో రోచెస్టర్ యూనివర్సిటీలో స్టైఫండ్‌తో పిహెచ్డి సీటు వచ్చింది. మొదటి సంవత్సరం చక్కగా నడించింది. అప్పుడు దేశాధ్యక్షుడిగా ట్రంఫ్ వచ్చి స్టైఫండ్ తీసేసాడు. దాంతో నెలకు వచ్చే రెండున్నర లక్షల స్టైఫండ్ ఆగిపోయింది. ఉద్యోగానికి వెళ్లే వీలులేదు, తప్పనిసరిగా పిహెచ్డి చేయాలి. మాకు ఏం చేయాలో తెలియలేదు. మా కుటుంబానికి బాబా అంటే గట్టి నమ్మకం, 'ఆయన ఒక దారి చూపుతారని'. అందుచేత మళ్ళీ ఆయన్నే ఆశ్రయించాము. బాబా దయవల్ల మా అబ్బాయి అదివరకు ఎమ్ఎస్ చేసిన యూనివర్సిటీలోనే మళ్ళీ పిహెచ్డి సీటు వచ్చింది. కానీ స్టైఫండ్ నిశ్చయం కాలేదు. మా అబ్బాయి చాలా టెన్షన్ పడ్డాడు. రెండు నెలలు బాగా ఇబ్బంది పడ్డాడు. రోజూ యూనివర్సిటీకి వెళ్లి ప్రొఫసర్లని కలిసి వచ్చేవాడు. చివరికి బాబా దయవలన వినాయకుని ఆశీస్సులతో వినాయకచవితి రోజున యూనివర్సిటీవాళ్ళు రెండు వేల డాలర్లతో టీచింగ్ ప్రొఫెసర్‌గా మా వాడికి అవకాశం ఇచ్చారు. దాంతో మేము ఈసారి వినాయకచవితి చాలా ఆనందంగా చేసుకున్నాము. బాబా నమ్మినవాళ్ళని ఎల్లవేళలా చాలా చక్కగా చూసుకుంటారు అనడానికి మా జీవితం ఒక ఉదాహరణ. "ధన్యవాదాలు బాబా".
అడిగినంతనే అనుగ్రహించిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. నేను కొద్దిరోజుల నుండి ఈ బ్లాగులో వస్తున్న సాయి లీలలు చదువుతున్నాను. అలాంటి ఒక అనుభవం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నాకు 3 సంవత్సరాల పాప వుంది. 2025, సెప్టెంబర్ 10న తనకి విరోచనలై మంట పెడుతుందని గోల చేసింది. నేను తనతో, "బాబాని అడుగు తగ్గిస్తారు" అని చెప్పాను. తను నేను చెప్పినట్లే బాబాని అడిగింది. నేను కూడా బాబాని, "తనకి బాధ, మంట తగ్గి నిద్రపోయేలా చూడండి" అని ప్రార్థించాను. అంతే! 5 నుండి 7 నిమిషాల లోపు పాప నిద్రపోయింది. అయినా కూడా నాకేంటో గాబరాగా అనిపించి ఫేస్బుక్ ఓపెన్ చేసి ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' ఫేస్బుక్ పేజీలో సాయి లీలలు చూస్తే, అందులో మొదటి లీలే నాకొచ్చిన సమస్య వంటిది. దాంతో నాకు, 'బాబా ఏం భయం లేదు, నేను ఉన్నాను' అని అభయమిస్తున్నట్లు అనిపించింది. "నాతో ఎల్లప్పుడూ ఉండి నన్ను, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు ధన్యవాదాలు బాబా".
ఓం సాయిరామ్
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDelete