సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2026వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆటంకం లేకుండా స్వామి దర్శనం చేయించిన బాబా
2. శ్రీసాయి ఆశీస్సులు
3. సాయినాథుడు పిలిస్తే పలికే దైవం


శ్రీసాయి ఆశీస్సులు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నేను ఒక సాయి భక్తురాలిని. మా ఇంట్లో మా మావయ్యగారు తన తల్లి ఆబ్దికం కోసం బంధువులందర్నీ ఆహ్వానించారు. నాకేమో అది నెలసరి సమయమైంది. నెలసరి ఆగడానికి మాత్రలు వేసుకుందామంటే, వినాయకచవితికి ఆటంకమవుతుంది. అందువల్ల నాకు ఏం చేయాలో అర్థంకాక బాబాకి దణ్ణం పెట్టుకొని మాత్రలు వేసుకున్నాను. కానీ అవి నాకు సరిగ్గా పని చేయలేదు. నెలసరి వచ్చినట్టు అనిపించింది. నేను చాలా టెన్షన్ పడి మళ్ళీ బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! ఇటు ఆబ్దికానికి, అటు వినాయకచవితికి నెలసరి ఆటంకం లేకుండా చూడండి. మీకు 11 రూపాయలు దక్షిణ సమ్పరించుకుంటాను" అని గట్టిగా ప్రార్థించి ఆ రెండు రోజులు బాబా ఊదీ నోట్లో కొంచెం వేసుకొని, కడుపుకి కొంచెం రాసుకున్నాను. బాబా దయవలన ఆబ్దికం కార్యక్రమం అయిపోయాక ఆ రోజు రాత్రి నెలసరి వచ్చింది. వినాయకచవితికి ఆరురోజులు అయింది. అలా నా సాయితండ్రి నెలసరి ఇటు ఆబ్దికానికి, అటు వినాయకచవితి ఆటంకం లేకుండా చేసారు. "బాబా! మీ మేలు జన్మజన్మలకు మర్చిపోలేను తండ్రీ. నా మీద, నా కుటుంబం మీద మీ దయ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను".

ఇకపోతే, వినాయకచవితి రోజున నా పుట్టినరోజు. నేను బాబాని, "నన్ను మీ భక్తురాలిగా మీరు ఒప్పుకుంటే, ఆరోజు ఉదయం కాకడహారతి తర్వాత ఆకుపచ్చ రంగు వస్త్రాల్లో, బంగారు రేకుల పువ్వు ధరించి కనిపించండి సాయి" అని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే వినాయకచవితినాడు సాయి దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించారు. "సాయీ! ఎప్పుడూ నన్ను ఇలాగే ఆశీర్వదించండి. అలాగే నాకు ఎప్పుడూ మీ పాదాల యందు స్థిరమైన నమ్మకం, శ్రద్ధ ఉండేలా అనుగ్రహించండి".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo