ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా సహాయం
2. సర్జరీ, కీమోథెరపీ లేకుండా క్యాన్సర్‌ను నయం చేసిన బాబా
బాబా సహాయం
నా పేరు మాధవి. నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను. ఒకరోజు ఆఫీసులో నా వల్ల చిన్న తప్పు జరిగి, దానివల్ల పనిలో కాస్త గందరగోళం అయింది. నా పైఆఫీసర్ పెట్టిన మెయిల్స్ ద్వారా ఆయన ఏ కారణం చేతనో ప్రాజెక్ట్ ప్రొడక్షన్‌కి వెళ్లాల్సొచ్చి బాగా ఒత్తిడికి గురై చాలా టెన్షన్‌గా ఉన్నట్లు నాకనిపించింది. దాంతో ఆ స్థితిలో నా వల్ల తప్పు జరిగినందుకు ఆయన నన్ను ఏమంటారో అని చాలా భయపడ్డాను. బాబా నామస్మరణ చేస్తూ, "బాబా! నాకు, నా పైఆఫీసర్కి ఫోన్ కాల్ పెట్టొద్దు. ఆయన ఉన్న ఒత్తిడిలో నన్ను ఏమైనా అంటే, నేను అదే ఆలోచిస్తూ ఉండిపోతాను. ప్లీజ్ బాబా! నన్ను రక్షించండి" అని బాబాను అడిగాను. బాబా నా ప్రార్థన విన్నారు. ఫోన్ కాల్ ఆయనతో కాకుండా ఎనలిస్ట్ టీమ్‌తో జరిగింది. నేను నా తప్పుకి క్షమాపణ చెప్పడంతో సమస్య పరిష్కారమై అంతా ప్రశాంతంగా సాగింది. "ధన్యవాదాలు బాబా. ఒకవేళ నా పైఆఫీసర్ ఏదైనా అని ఉంటే, సున్నిత మనస్కురాలినైన నేను చాలా బాధపడేదాన్ని. చాలా చాలా ధన్యవాదాలు బాబా".
2025, ఆగస్టు 27, రాత్రి పడుకునేముందు మా 7ఏళ్ళ బాబు
కొంచం అలసటగా అనిపించాడు. తనకి కాస్త జలుబు చేసినట్టు నాకనిపించింది. తను నిద్ర మధ్యలో భయపడుతున్నట్టు నిద్రలేచి, 'ప్లీజ్.. ప్లీజ్' అని అర్థించాడు. తనకి బాగా కలలు వస్తాయి. గతసారి బాగా జ్వరం వచ్చినప్పుడు కూడా ఇలానే కలవరించాడు. వాడికి జ్వరం వస్తే చాలా తీవ్రంగా వస్తుంది. అదీకాక మేము ఇంకో 2 రోజులలో బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసాము. కాబట్టి నాకు భయమేసి బాబుకి బాబా ఊదీ పెట్టి, కాస్త సిరప్ పట్టాను. తర్వాత, "బాబు ప్రశాంతంగా నిద్రపోవాలి, తనకి జ్వరం రాకూడదు బాబా" అని బాబాకి దణ్ణం పెట్టాను. అప్పటివరకు కలత నిద్రపోయిన బాబు బాబా ఊదీ పెట్టినప్పటినుండి చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. నిజంగా ఇది బాబా దయ. ఎందుకంటే, సిరప్ పని చేయడానికి కనీసం ఒక గంట పడుతుంది. "ధన్యవాదాలు బాబా. ఊదీ ఈ కలికాలంలో మీరు మాకు ప్రసాదించిన దివ్య ఔషధం బాబా. కోటికోటి ప్రణామాలు బాబా. మీరు నా జీవితంలోకి రావటం నేను చేసుకున్న అదృష్టం తండ్రీ. ఎప్పుడూ మీరు నాతో ఉండండి. నా చేయి వదలకండి బాబా".
సాయి స్మరణం సంకట హరణం
బాబా శరణం భవభయ హరణం.
సర్జరీ, కీమోథెరపీ లేకుండా క్యాన్సర్‌ను నయం చేసిన బాబా
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2025, మే 1న మా వారికి మూత్రంలో రక్తం వస్తే, ఒక యూరాలజిస్ట్ దగ్గరకి వెళ్లాము. అతను స్కాన్ చేసి, "లోపల చిన్న గడ్డ ఉంది. చిన్న సర్జరీ చేసి దాన్ని తొలగించాలి" అన్నారు. అలాగే మే 2న సర్జరీ చేసి గడ్డని తీశారు. దాన్ని బయాప్సీకి పంపితే, రిపోర్టులో బ్లాడర్ క్యాన్సర్ అని వచ్చింది. అది తెలిసి నేను ప్రతిరోజూ "ఎందుకింత పరీక్ష పెట్టావు బాబా?" అని బాబాని అడుగుతుండేదాన్ని. ఎంతోమంది ఆంకాలజిస్ట్‌లను కలిస్తే, అందరూ బ్లాడర్ తీసేసి యూరిన్ బ్యాగ్ వేయాలి అన్నారు. మాకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాలేదు. బ్లాడర్ తొలగించే సర్జరీకి వెళ్లాలా, వద్దా అని చీటీలు వేసి బాబాని అడిగే ధైర్యం కూడా లేక ఒక బాబా భక్తురాలిని అడిగితే, ఆమె చీటీలు వేసి బాబాని అడిగారు. బాబా వద్దని చెప్పారు. అలాగే ఇంకో భక్తునితో కూడా చీటీలు వేయిస్తే, అప్పుడూ బాబా వద్దన్నారు. ఇంకా బాబా మీద భారమేసి, ఆయన సూచించిన హెర్బల్ మందు మావారికి ఇస్తూ, "బాబా! మీరే ఈ బాధ నుండి రక్షించాలి" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా మూడు నెలలు గడిచాక టెస్ట్ చేయిస్తే, స్కానింగ్‌లో బ్లాడర్ నార్మల్ అని వచ్చింది. ఆ రిపోర్ట్ డాక్టరుకి చూపిస్తే, "సర్జరీ, కీమోథెరపీ ఏదీ చేయించకుండా ఎలా తగ్గుతుంది. ఈ రిపోర్ట్ నిజాం కాదు" అన్నారు డాక్టరు. కానీ నా బాబా ఆ గడ్డని తన చేతితో తీసేశారని, ఆయన్ను శ్రద్ధ, సబూరిలతో ఎంతగానో నమ్మితే ఎంతటి కష్టానైనా తొలగిస్తారని వాళ్ళకి ఏం తెలుసు? సరే, మళ్ళీ పెట్ స్కాన్ చేయిస్తే, అప్పుడు కూడా నార్మల్ వచ్చింది. బాబా నా కుటుంబం మీద ఎంతో దయ చూపించారు. నేను ఆయనకి ఎంతో ఋణపడిపోయాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా ఇదే దయను నా కుటుంబం మీద ఎల్లప్పుడూ చూపించండి. సదా మీ నామాన్ని పలికేలా నాకు మరింత శ్రద్ధ, సబూరీలు ఇవ్వండి తండ్రీ".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
Om sri sairam 🙏🙏
ReplyDeleteఅద్భుతం సాయి.. మా నాన్న గారు నరాల జబ్బు తో బాధ పడుతున్నారు. బాబా ఆయన ఆందోళన చెందుతున్నారు. దయ గల సాయి తండ్రి దయ చేసి ఆ బాధ నించి ఉపశమనం ఇవ్వు బాబా. దానికి చికిత్స లేదు అంటున్నారు. మీ దయ ఉంటే అన్నీ సాధ్యం బాబా. కాపాడు బాబా సాయి బాబా. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl Kalyan ki children ivvandi sai
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba baba baba 🙏
ReplyDeleteAdbhutam deva nee leelalu.. asadhyanni susadhyam chese samartha saduguru, o sainatha 🙏Meenakshi ki Pelli kudirinchu please 🙏 veelainantha twaraga.. vayasu meeruthondi 🥲
ReplyDeleteఓంసాయిరాం, ఆరోగ్యాక్షేమదయానమః
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram wonderful Sai udi and Shraddha and Saburi did cancer cure.That is Sai power.i feel happy while reading this Sai Leela.
ReplyDelete