1. పిలిస్తే పలికే గొప్ప దేవుడు సాయిబాబా
2. బాబా కృప
పిలిస్తే పలికే గొప్ప దేవుడు సాయిబాబా
సాయినాథ్ మహారాజ్ భక్తులకు నమస్కారం. నా పేరు మోహన్. మా ఊరు ధర్మవరం. నేను 1996 నుండి సాయిబాబా భక్తుడిని. ఇప్పటివరకు బాబా నన్ను ఎన్నోసార్లు ఎన్నో కఠిన పరిస్థితుల నుండి కాపాడారు. వాటిలో నుండి ముందుగా నా మొట్టమొదటి అనుభవంతోపాటు ఇటీవల జరిగిన అనుభవం ఈరోజు మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు 1996వ సంవత్సరం వరకు బాబా గురించి తెలియదు. ఆ సంవత్సరం నేను మొట్టమొదటిసారి బాబా గుడికి వెళ్ళినప్పుడు, "స్వామీ! మీరు నిజంగా భక్తులను కాపాడేవారైతే, నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను. ఆ సబ్జెక్ట్ నాకు చాలా కష్టంగా ఉంది. దయచేసి ఆ సబ్జెక్ట్ పాసయ్యేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. ఆ తర్వాత నేను మళ్ళీ గుడికి వెళ్ళలేదు. మూడు నెలల తర్వాత పరీక్ష ఫలితాలు వచ్చాయి. నేను ఎంతో కష్టంగా భావిస్తున్న ఆ సబ్జెక్ట్‌లో నాకు 71 మార్కులు వచ్చాయి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకే ఒక్కసారి మొక్కినందుకే ఆయన నా కష్టాన్ని దాటించాడు. ఇంకా ఆరోజు నుంచి ఈరోజు వరకు నేను ఆయనను మరువలేదు. నా ప్రాణం ఉన్నంతవరకు కూడా మరువను.
2025, ఆగస్టు 26వ తేదీలోగా నాకు 13 లక్షల రూపాయలు అవసరం అయ్యాయి. అది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆ డబ్బు సమకూర్చలేకపోతే మాట పోతుంది. నాకు తెలిసిన చాలామందిని డబ్బులు అడిగాను. కానీ ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆగస్టు 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు చాలా టెన్షన్ పడ్డాను. 21వ తేదీన 'సాయి సచ్చరిత్ర' చదవడం ప్రారంభించి, "26వ తేదీలోగా డబ్బులు సర్దుబాటు ఐతే, మీ అనుగ్రహాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. ఇక ఏం జరిగిందో చూడండి. చివరి ప్రయత్నంగా మాకు తెలిసిన ఒకరిని 5 లక్షల రూపాయలు అడిగాను. అతను చూస్తానని, మర్నాడు ఫోన్ చేసి, "డబ్బులు ఉన్నాయి" అని అన్నాడు. ఇంకో స్నేహితుడు 1 లక్ష ఇస్తాన్నాడు. నాకు ఇంకా 7 లక్షలు అవసరం. అసలు అద్భుతం ఇప్పుడు జరిగింది. 25వ తేదీ సాయంత్రం బ్యాంకు మేనేజర్ నాకు ఫోన్ చేసి, "మీ పర్సనల్ లోన్ తీరిపోతుంది. మళ్ళీ లోన్ ఇస్తాము, తీసుకోండి" అని అన్నారు. మర్నాడు 26వ తేదీ మధ్యాహ్నం నేను బ్యాంకుకి వెళ్లి, "10 లేదా 15 లక్షలు ఐతేనే తీసుకుంటాను" అన్నాను. అతను నాకున్న లోన్‌లన్నీ చెక్ చేసి, మీకు 7 లక్షలు మాత్రమే ఇవ్వగలం" అని అన్నాడు. అప్పటికే నాకు సాయి బాబా లీల అర్థం అయింది. ఎటువంటి రుసుములు లేకుండా 15 నిమిషాల్లోనే నా బ్యాంకు ఖాతాలో 7 లక్షలు వేశారు. అలా నాకు కావాల్సిన 13 లక్షలు 26వ సాయంత్రానికి అందాయి. మనం బాబా మీద భారమేస్తే, ఆయన మనకు ఎంత కావాలన్నా ఇస్తారు. పిలిస్తే ఇంత తొందరగా పలికే దేవుడు నాకు తెలిసి ఇంకెవ్వరూ లేరు. శిరిడీ సాయినాథ్ మహారాజ్ ఒక్కరికే అది సాధ్యం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
నేను ఈ బ్లాగులో వచ్చే చిన్న చిన్న విషయాలకు సంబంధించిన భక్తుల అనుభవాలు చూసి ఆశ్చర్యపోయేవాడిని. కానీ అలాంటి అనుభవమే నాకు 2025, సెప్టెంబర్ 13న జరిగింది. ఆరోజు సాయంత్రం 6 గంటలప్పుడు నేను శిరిడీ లైవ్ చూస్తూ, "బాబా! నాకిష్టం ఐన బ్లూ డ్రెస్ హారతికి వేసుకోండి" అని అనుకున్నాను. ఆ తర్వాత హారతి సమయంలో నేను బాబాని చూసి ఆశ్చర్యపోయాను. బాబా నేను కోరుకున్న బ్లూ డ్రెస్ ధరించారు. ఆ రాత్రి శేజరాతికి కూడా బాబా బ్లూ డ్రెస్ ధరించారు. ఈ అనుభవం కలిగిన తర్వాత ఈ బ్లాగులో భక్తులు రాస్తున్న చిన్న చిన్న అనుభవాల విషయంలో నాకు సదాభిప్రాయం వచ్చింది. నిజంగా భక్తులు ఎలాంటి కోరిక కోరినా అది చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా బాబా తీరుస్తారు. ఆయన అనుగ్రహం ఉంటే ఎలాంటి కోరికైనా తీరుతుంది. "ధన్యవాదాలు బాబా".
బాబా కృప
నా పేరు జగదీశ్వర్. 2025, ఆగస్టు నెలాఖరులో తీవ్రమైన జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు మొదలై నీరసంతోపా టు జ్వరం కూడా వచ్చేలా అనిపించింది నాకు. దాంతో డెంగ్యూ, వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో జ్వరం వస్తుందేమోనని భయమేసి, "బాబా! జ్వరం రాకుండా చూడండి" అని వేడుకొని ఊదీ పెట్టుకున్నాను. ఎటువంటి టాబ్లెట్లు వేసుకోలేదు. బాబా దయవలన ఒక వారం వరకు జలుబు ఉన్న కూడా జ్వరం మాత్రం రాలేదు.
ఒకరోజు మా ఆవిడ ఇంట్లోకి క్రిములు వస్తున్నాయని పెస్టిసైడ్ స్ప్రే చేసింది. అది కాస్త పూజ గదిలోకి వెళ్లడంతో ఆ స్ప్రే బల్లికి తగిలి అది కదలకుండా ఉండిపోయింది. నాకు ఆ బల్లి చనిపోతుందేమోనని బాధేసింది. మర్నాడు ఉదయం నేను రోజూ నైవేద్యంతోపాటు ఒక రాగి పాత్రలో ఉంచే జలం కొద్దిగా ఆ బల్లి మీద వేసి, "ఆ బల్లికి ఏమీ కాకూడద"ని బాబాని వేడుకున్నాను. అలా రెండు రోజులు చేసాక బాబా కరుణ వల్ల ఆ బల్లికి ఏమీ కాలేదు. ఇంటిలో నుండి బయటకి వెళ్ళిపోయింది. "ధన్యవాదాలు బాబా".
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl
ReplyDeleteBaba ra baba . Vachi Meenakshi ki v. pelli kudirinchu
ReplyDeleteOmsaisrisaijayajayasai🙏🌹🙏🌹🙏
ReplyDelete🙏🙏🙏
ReplyDeleteBaba sai charanam sarvadaa sharanam sharanam🙏🙏
ReplyDelete