ఈ భాగంలో అనుభవాలు:
1. బాబాకు తమ భక్తులపై ఎంతో ప్రేమ
2. తమ గుడిని చూపించడమే కాకుండా ఆరతి కూడా ఇప్పించుకున్న బాబా
బాబాకు తమ భక్తులపై ఎంతో ప్రేమ
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు విజయలక్ష్మి. బాబా నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. ఒకసారి నేను, మావారు, మా ఇద్దరు పిల్లలు బైక్‌పై హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ పక్కనున్న మాక్స్ షాపింగ్ మాల్కి వెళుతుంటే సండే మార్కెట్ వద్ద మా బైక్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. అది చాలా రద్దీ ప్రదేశం. వెనకనున్న చాలా వాహనాలు ఒకటే హార్న్‌ల మోత మోగిస్తుంటే నాకు కంగారుగా అనిపించి, "బాబా! ఇప్పుడు ఈ బైక్ స్టార్ట్ అయ్యేలా లేదు. మాకు ఏ దారి కనపడటం లేదు. దయతో బైక్ స్టార్ట్ అయ్యేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. వెంటనే బైక్ స్టార్ట్ అయింది. బాబా ఎంత అద్భుతం చేసారో చూసారా!
ఒకసారి మావారు చాలా పెద్ద ఆరోగ్య సమస్య వల్ల ఒక వారం రోజులు హాస్పిటల్, ఐసీయూలో ఉన్నారు. ఆయన డిశ్చార్జ్ అయ్యాక నేను కూడా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నాకు చాలా భయమేసి, "బాబా! ఏంటి మాకు ఇలా అవుతుంది. మమ్మల్ని కాపాడండి. మా పిల్లలు ఆనాధలు కాకుండా చూడండి" అని ఏడ్చాను. అప్పుడు నాకు, "ఎందుకు ఏడుస్తావు? నీకు నేను ఉన్నాను" అని బాబా సందేశం వచ్చింది. అలా నేను ఎప్పుడు ఏడ్చినా దయగల నా తండ్రి ఆ సందేశం నాకు చూపిస్తారు. దాంతో నాకు చాలా ధైర్యంగా ఉంటుంది.
నేను కోలుకొని హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన కొన్నిరోజులకి మావారికి మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చాయి. బ్లడ్ లో క్లాట్స్ ఏర్పడి అవి బ్రెయిన్‌కి రక్త సరఫరా అయ్యే చోట అడ్డంపడి మావారికి ఒక కంటిచూపు పోయింది. దానికి డాక్టరు ఇచ్చిన మందు వాడటం వల్ల మావారికి నిద్రపట్టేది కాదు. ఆయన రాత్రీపగలూ నిద్రలేక, కన్ను కనిపించక చాలా ఒత్తిడి అనుభవించారు. నేను బాబాకి, "ఆయన ఆరోగ్యం బాగుండాల"ని చెప్పుకొని సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి రోజూ మావారికి ఊదీ నీళ్లు ఇస్తుండేదాన్ని. అయినా ఆయనకి నిద్రపట్టేది కాదు. ఇలా ఉండగా సచ్చరిత్రలో 'బాంద్రా నివాసి కాయస్థ ప్రభు జాతికి చెందిన ఒక పెద్దమనిషి నిద్రించుటకు నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రంగా తిట్టేవాడని, అది అతని నిద్రను భంగపరిచేదని, ప్రతిరోజూ అట్లు జరుగుతుండటం వల్ల అతను చాలాకాలం నిద్రపట్టక బాధపడ్డాడని, అతనికి ఏమి చేయడానికి తోచలేదని, ఒకనాడు అతను తన బాధ గురించి ఒక బాబా భక్తునితో చెప్పగా, "బాబా ఊదీ అతని బాధను తప్పనిసరిగా తీర్చున"ని ఆ భక్తుడు చెప్పి, కొంత ఊదీ ఇచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచం నుదుటకి రాసుకొని, మిగతా పొట్లం తలదిండు కింద పెట్టుకోమని సలహా ఇచ్చేనని, ఆవిధంగా చేయడంతో ఆ పెద్దమనిషికి సంతోషము, ఆశ్చర్యము కలుగునట్లు మంచిగా నిద్రపట్టిందని' చదివిన నేను, "బాబా! నాకు ఇంకా మిగిలింది ఇది ఒకటే. ఈ చివరి ప్రయత్నం కూడా ఫలితం ఇవ్వకపోతే మీ దయ మీపై లేనట్టే!" అని బాబాతో చెప్పుకొని ఊదీ నీళ్ళు మావారి చేత తాగించి. కొంచెం ఊదీ పొట్లం కట్టి ఇచ్చి, "దీనిని తలగడ కింద పెట్టుకోమ"ని చెప్పాను. ఆయన అలానే చేసారు. మర్నాడు ఉదయం మావారు నిద్రలేవగానే, తనకి చాలా బాగా నిద్రపట్టిందని చెప్పారు. నాకు బాబా మాపై చూపిన ప్రేమకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఒక్కోసారి మనం బాబాని 'మాపై మీకు దయ లేదు' అంటాముగాని బాబా ఎప్పుడూ మన పక్కనే ఉంటారు. ఆయన మనం అనుభవించే ప్రారబ్ధ కర్మలను నుండి మనలను విముక్తులను చేయాలని ఆరాటపడుతుంటారు. బాబాకి తన భక్తులపై ఎంతో ప్రేమ ఉంటుంది. "ధన్యవాదాలు బాబా. నేను మీ బిడ్డగా ఉన్నందుకు, మీరు నన్ను మీ బిడ్డగా ఎన్నుకున్నందుకు జన్మజన్మలకు నేను నీకు ఋణపడి ఉంటాను బాబా". నా ఈ అనుభవాలను ఎంతో ఓపికగా చదివిన ప్రతి ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరిపైనా బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.
తమ గుడిని చూపించడమే కాకుండా ఆరతి కూడా ఇప్పించుకున్న బాబా
సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు శ్వేత. మేము 4 నెలల క్రితం ఇల్లు మారాము. కొత్త చోట అంతా సర్దుబాటు అయ్యాక నేను దగ్గరలో బాబా గుడి ఉందేమోనని వెతకడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో ఒక ఆదివారం సాయంత్రం మా కుటుంబంలోని అందరం కలిసి బయటికి వెళ్తున్నప్పుడు నేను మా భర్తతో, "ఏదైనా బాబా గుడికి వెళదాం" అని అన్నాను. తను, "దారిలో చుద్దాం" అని చూసుకుంటూ వెళ్తుంటే, ఒక గుడి కనిపించింది. ఆనందంగా దర్శనం చేసుకుందామని గుడి లోపలకి వెళ్ళాము. అప్పుడు సాయంత్రం ఆరతి అవుతుంది. అక్కడున్న పంతులుగారు మమ్మల్ని బాబాకి ఆరతి ఇవ్వమన్నారు. నేను దర్శనమైతే చాలు అనుకుంటే, బాబా మాచేత తమకి ఆరతి ఇప్పించుకున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కాసేపు సేవ చేసుకొని వచ్చేసాము. అప్పటినుంచి నేను సంతోషంగా ఆ గుడికి వెళ్ళడం మొదలుపెట్టాను. "థాంక్యూ వెరీ మచ్ సాయీ! మేము ఎక్కడికి వెళ్ళినా మాతో ఉండండి. అందరూ బాగుండేలా ఆశీర్వదించండి".
Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram 1Sai leela is very nice.My self also suffering with out sleep.i also follow Udi magic mantra.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba ra baba. Meenakshi ki pelli kudirinchu 🥲🙏
ReplyDeleteOmsrisaiarogyaskemadayanamah
ReplyDelete