ఈరోజు భాగంలో అనుభవం:
- పుట్టినరోజునాడు లభించిన బాబా దర్శనం
చెన్నైనుండి సాయిబంధువు 'శరణ్య సంబంధం' తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు:
నేను చిన్ననాటినుండి సాయిభక్తురాలిని. నేను చెన్నై నివాసిని. నేను తరచుగా మైలాపూరులో ఉన్న బాబా మందిరానికి వెళుతూ ఉండేదాన్ని. ఆ మందిరం అంటే నాకెంతో ఇష్టం. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా నా పుట్టినరోజునాడు అక్కడికి వెళ్లి పేదలకు అన్నదానం గానీ, ఇంకేదైనా కానీ దానం చేస్తూ ఉంటాను. 2009వ సంవత్సరంలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే నిమిత్తం చెన్నైనుండి దూరంగా ఉన్నాను. నా కాలేజీ తిరుచ్చి అవుట్‌స్కర్ట్స్‌లో తిరుచ్చి-తంజావూరు హైవేలో ఉండేది. అక్కడ వాతావరణం చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఏదైనా స్టేషనరీ వస్తువులు కావాలంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌కి వెళ్లాల్సి వుండేది. 2009 జూలై 26న నా పుట్టినరోజు వచ్చింది. కానీ ఆరోజు నేను తిరుచ్చిలో ఉన్నందున మైలాపూర్ బాబా మందిరానికి వెళ్లలేకపోతున్నందుకు చాలా దిగులుగా ఉన్నాను. ఈ సంవత్సరం నేను బాబా దర్శనం పొందలేకపోతున్నాను, నేను చాలా దురదృష్టవంతురాలినని నా స్నేహితులతో చెప్పాను. మధ్యాహ్నానికి చెన్నైనుండి మా అమ్మ, మరికొందరు బంధువులు నన్ను చూడడానికి వచ్చారు. వాళ్లు దగ్గర్లో ఉన్న ఏదైనా మందిరానికి నన్ను తీసుకుని వెళ్తామని అన్నారు. నేను ఇక్కడ అటువంటివి ఏమీ ఉండవని చెప్పాను. కానీ వాళ్లు, "పద, దరిదాపుల్లో ఏదో ఒక మందిరం ఉంటుంది, చూద్దాం" అని బలవంతం చేశారు. సరేనని నేను వాళ్లతోపాటు బయలుదేరాను. దారిలో, "ఇక్కడ దగ్గరలో ఏదైనా మందిరం ఉందా?" అని వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్తుంటే, ఒక వ్యక్తి దగ్గరలో దుర్గాదేవి గుడి ఉందని దారి చూపించాడు. అది కేవలం 15 నిమిషాలు ప్రయాణం చేసేంత దూరంలో ఉంది. అక్కడి వాతావరణం చాలా ఏకాంతంగా ఉంది. "పుట్టినరోజునాడు బాబా దర్శనం చేసుకోలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. మీరు లోపలకు వెళ్లి దర్శించుకుని రండి, నేను కారులోనే వేచి ఉంటాన"ని చెప్పాను. మా అమ్మ దర్శనం చేసుకుని వచ్చి పూలదుకాణం వద్ద ఉన్న చెప్పులు వేసుకోబోతుండగా ఆ పూలమ్మే అతను, "దగ్గరలో ఇంకో గుడి ఉంది, అక్కడికి వెళ్లి రండి" అన్నాడు. మా అమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను కారు దిగి రమ్మంది. నేను సంశయిస్తుంటే, "కనీసం గుడి దగ్గర వరకు రా!" అంది. నేను కాస్త అయిష్టంగానే కారు దిగి అమ్మతోపాటు గుడి వరకు వెళ్ళాను. ప్రవేశద్వారం వద్దనుండి బాబా విగ్రహం చూసి ఆశ్చర్యపోయాను. అది నా సాయిబాబా గుడి. నా కళ్ళనుండి కన్నీళ్లు వచ్చేసాయి, ఆపుకుందామన్నా ఆగట్లేదు. అది ఒక అందమైన అనుభూతి! దానిని నేను పదాలలో వర్ణించలేను. వెంటనే బాబా పాదాలపై వాలిపోయి, "నా పుట్టినరోజు బాబా, నన్ను ఆశీర్వదించండి!" అని వేడుకున్నాను. అక్కడ దగ్గరలోనే శివ, విష్ణు మందిరాలు కూడా ఉన్నాయి. కానీ ఆ పూలమ్మే అతను మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపాడు? ఎందుకు ఈ మందిరం గురించి మాత్రమే చెప్పాడు? అమ్మ "కనీసం మందిరం వరకైనా రా!" అని ఎందుకు నన్ను బలవంతపెట్టింది? వీటన్నిటికీ నేను సమాధానంగా ఏమీ చెప్పలేను. కానీ ఇదంతా ఖచ్చితంగా నా సాయిబాబా లీల. ఆయన అదృశ్యంగా అన్నీ నడుపుతూ ఉంటారు. ఈ అనుభవం జరిగిన తర్వాత నేను తిరుచ్చిలో ఉన్నన్నాళ్ళు ఈ మందిరానికి వెళ్తుండేదాన్ని. వెళ్లినప్పుడల్లా పుట్టినరోజునాడు నాకు బాబా దర్శనం చేయించిన ఆ పూలదుకాణం అతనిపట్ల కృతజ్ఞతాభావంతో అతని వద్ద ఒక కమలం తీసుకుని బాబాకు సమర్పించుకునేదాన్ని. చదువుతున్న మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, సాయిబాబా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. మీరు ఏ స్థితిలో ఉన్నా ఆయన మీకు అండగా ఉంటారు. బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ..
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
మనమందరమూ కూడా బాబా ని ఇలాగే ఎప్పుడూ మనసులో నింపుకుని జీవితం లో ని ప్రతి సన్నివేశం లో నూ సాయిఆనందం పొందుదాము.. జై సాయిరాం
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🌼🥰🌹😊🌺🤗🌸🕉🙏😀❤
ReplyDeleteఓం సాయిరామ్!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me