సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 32వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  1. ఒక్క స్మరణకే పెద్ద అవమానం జరగకుండా కాపాడారు శ్రీసాయి
  2. బాబా నా ప్రార్థనలు విని, వెంటనే బదులిచ్చారు

ఒక్క స్మరణకే పెద్ద అవమానం జరగకుండా కాపాడారు శ్రీసాయి

ఒక సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తుడిని. ఇటీవల నాకు జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను పోలీసుశాఖలో ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల నేను పదోన్నతి కోసం ట్రైనింగ్‌లో ఉన్నాను. ట్రైనింగ్ చివరిలో ఉన్న పరీక్షలకోసం కొన్ని పుస్తకాలు ఇచ్చారు. పరీక్ష పూర్తయ్యాక నేను వాటిని తిరిగి వాళ్ళకే అప్పగించాల్సి ఉంది. అయితే పరీక్షలైన తరువాత నేను ఆ పుస్తకాలు నా మంచం మీద పెట్టి భోజనానికి వెళ్లొచ్చాను. అంతలో వాటినుండి ఒక పుస్తకాన్ని ఎవరో తీసుకుని వెళ్లిపోయారు. పుస్తకాలు తిరిగివ్వాల్సిన సమయంలో అలా జరిగేసరికి నాకు టెన్షన్ గా అనిపించింది. అదే పుస్తకం మా ఊరిలో మా ఇంట్లో ఒకటి ఉంది. కానీ నేనున్న చోటుకి మా ఇంటికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ చూస్తే పుస్తకాలు వాళ్ళకి అప్పగించడానికి కేవలం పదినిమిషాలే ఉంది. ఇంటికి వెళ్లి వచ్చేంత టైమ్ లేదు. ఆ పుస్తకం ధర 500 రూపాయలు. ఆ మొత్తాన్ని ఇవ్వడం పెద్ద సమస్య కాదు కానీ, అందరూ నేను అజాగ్రత్త మనిషినని అనుకుంటారు, నలుగురిలో నా పరువు పోతుంది. "ఇప్పుడెలా సాయీ? ఈ సమస్య నుండి బయటపడే మార్గాన్ని చూపించండి" అని మనసులో ఒక్కసారి అనుకున్నాను. అంతే! నా ఫ్రెండ్ ఒకతని దగ్గర పాత పుస్తకం ఒకటి ఉందని తెలిసింది. అతనితో జరిగిన విషయాన్ని చెప్పి, అతని వద్దనుండి ఆ పాత పుస్తకాన్ని తీసుకుని డిపార్ట్‌మెంట్ వాళ్ళకి అందజేసాను. 'సాయీ' అని ఒక్కసారి అనుకున్న మాత్రానికే పెద్ద అవమానం జరగకుండా నన్ను రక్షించారు శ్రీసాయినాథుడు. "థాంక్యూ సో మచ్ బాబా".

బాబా నా ప్రార్థనలు విని, వెంటనే బదులిచ్చారు

యు.ఎస్.ఏ. నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా చెబుతున్నారు:

నేను గత పదేళ్లుగా బాబా భక్తురాలిని. చాలా అనుభవాలను చవిచూశాను. ముందుగా "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

గత ఏడాదిలో ఒకసారి నార్త్ కరోలినాలో తీవ్రమైన తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. దాంతో నా స్నేహితులందరూ ఫోన్ చేసి, పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఇదివరకు అలాంటి తుఫాను వలన చాలా బీభత్సం జరిగింది. విద్యుత్ లేకపోవడం, షాప్స్, గ్యాస్ స్టేషన్లు మూసివేయబడటం జరిగాయి. చాలా సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారు. అందువలన క్యాండిల్స్, బ్రెడ్,  మిల్క్, ముఖ్యంగా నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలని నా స్నేహితులంతా చెప్పారు. వెంటనే నేను, మా అమ్మాయి ఒక షాపుకి వెళ్ళాం. కానీ మేము వెళ్ళిన షాపులో మాకు కావలసినవి ఒక్కటి కూడా దొరకలేదు. కేవలం కొన్ని పండ్లు మాత్రం తీసుకున్నాం. తర్వాత చాలా షాపులకి వెళ్ళాం. తిరగగా, తిరగగా బ్రెడ్డు, పాలు, బిస్కెట్లు దొరికాయి. కానీ నీళ్లు మాత్రం దొరకలేదు. చివరగా మా అమ్మాయి ఫుడ్‌లైన్‌లో ఉన్న షాపుకి తీసుకుని వెళ్ళింది. ఈసారి నేను బాగా అలసిపోయి ఉన్నందువల్ల మా అమ్మాయినే షాపులోకి వెళ్ళమని చెప్పి, నేను కారులోనే కూర్చుని, "బాబా! నేను మిమ్మల్ని మాత్రమే ఏదైనా అడగగలను, ప్రార్థించగలను. ప్లీజ్! ఈ బిడ్డపై దయచూపి సహాయం చేయండి. మీరు మాత్రమే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరు" అని హృదయపూర్వకంగా ప్రార్థించాను. అంతలోనే మా అమ్మాయి నన్ను షాపులోకి రమ్మని పిలిచి, "అమ్మా! ఇక్కడ వాటర్ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తికి రెండు కేసులు మాత్రమే ఇస్తున్నారు. నువ్వు కూడా ఉంటే మనకి మరో రెండు కేసులు వస్తాయి" అని చెప్పింది. బాబా నా ప్రార్థనలు విని, వెంటనే బదులిచ్చారు. "థాంక్యూ సో మచ్ బాబా!". అనంతకోటి బ్రహ్మాండనాయక సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo