ఈరోజు భాగంలో అనుభవాలు:
- అనారోగ్యం నుండి అమ్మను బయటపడేశారు బాబా.
- బాబా కరుణ:
అనారోగ్యం నుండి అమ్మను బయటపడేశారు బాబా.
యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు ఉషానందిని తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను 2009వ సంవత్సరం నుండి బాబా భక్తురాలిని. 2018 అక్టోబరు నెలలో మేము సెలవుల్లో ఇండియా వచ్చాము. ఆ సమయంలో సోడియం, పొటాషియం లోపంవల్ల మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు. ఆమె అతి కష్టం మీద నడవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అక్టోబరు 12న నేను ఒక సెమినార్ కోసం వేరే ఊరు వెళ్ళాను. ఆరోజు ఇంటిలో ఎవరూ లేని సమయంలో అమ్మ రెండుసార్లు మంచం దగ్గర కింద పడిపోయింది. పడిపోయిన ప్రతిసారీ దాదాపు రెండు గంటల పాటు పైకి లేవలేక అలాగే క్రిందనే ఉండిపోయింది. తర్వాత 72 గంటల పాటు తను పూర్తిగా మంచానికే అతుక్కుపోయింది. పరిస్థితి ఎంత దారుణమంటే పడుకునివున్న తను మరోవైపు తిరగాలంటే కూడా మరొక మనిషి సహాయం అవసరమైంది. మా జీవితంలో ఎంతో బాధాకరమైన రోజులవి. అక్టోబరు 15, బాబా సమాధి చెందిన రోజు. ఆరోజు నేను, "బాబా! అమ్మనిలా మంచంపై కష్టపడేలా చేయకండి. తనకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి" అని ప్రార్థించాను. చివరికి అమ్మని ఆ స్థితిలో చూడలేక, "బాబా! కావాలంటే అమ్మని మీ దగ్గరకైనా తీసుకునిపోండి" అని కూడా అనుకున్నాను. తర్వాత ఆమె ఆరోగ్యం గురించి 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సైటులో చూస్తే, "ఒక వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తాడు, దాంతో మంచి జరుగుతుంది" అని వచ్చింది. ఆరోజు రాత్రి 2 గంటల సమయంలో అమ్మ తనంతట తానే నిద్రలో మరోవైపు తిరగటం గమనించాను. దాంతో బాబా దయవలన తను త్వరగా కోలుకుంటుందని కాస్త ఉపశమనంగా అనిపించింది. ఆ సమయమంతా నేను సాయి నామస్మరణ చేస్తూనే ఉన్నాను. నిద్రలో కూడా నా నోట బాబా నామస్మరణ జరగటం నేను గమనించాను. బాబా చెప్పినట్లుగానే అమ్మ సహాయార్థం ఒక నర్సు వచ్చింది. తరువాత బాబా అనుగ్రహంతో ఆమె కాస్త కోలుకుంది. అప్పుడు తనకి కిడ్నీకి, గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించాం. రిపోర్టులన్నీ బాగానే వచ్చాయి. ఆమె నిదానంగా బలాన్ని కూడదీసుకుంటూ నడవడం మొదలుపెడుతున్న సమయంలో హఠాత్తుగా అక్టోబర్ 29న తను మళ్ళీ అనారోగ్యం పాలైంది. అప్పుడు వేరే చోట ఉన్న నేను మళ్లీ తన ఆరోగ్యం గురించి బాబాని అడిగాను. "18 గంటల్లో తను కోలుకుంటుంద"ని వచ్చింది. నేను ఆందోళన చెందుతున్నప్పటికీ బాబాపై పూర్తి నమ్మకంతో ఇంటికి ఫోన్ చేయలేదు. సహనంతో 18 గంటలు పూర్తయ్యేవరకు వేచి చూసాను. 24 గంటల తర్వాత ఇంటికి ఫోన్ చేస్తే, అమ్మ తన కాళ్ళపై తాను నిల్చొని నాతో మాట్లాడింది. ఈ విధంగా మన పూర్వజన్మ కర్మలను బాబా తొలగిస్తున్నారు. "ప్లీజ్ బాబా! అమ్మని, నా బ్రదర్ ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి".

బాబా కరుణ:
మరో సాయిభక్తురాలు ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటున్నారు.
"బాబా! మీ దివ్యపాదాలకు నా ప్రణామములు". నాకొక చంటిబిడ్డ ఉన్నాడు. నేను రోజూ తనకి స్నానం చేయించిన తర్వాత బాబా ఊదీ పెడుతూ ఉంటాను. ఒకరోజు రాత్రి హఠాత్తుగా తనకి చాలా ఎక్కువగా తమ్ములు రావడం మొదలైంది. మరుసటిరోజుకి అది ఇంకా ఎక్కువ అవుతుందేమోనని నాకు భయం వేసి, "బాబా! తనకి నయమయ్యేలా చూడండి, ఈ తుమ్ములు ఆగిపోయి తను హాయిగా ఊపిరి పీల్చుకునేలా చూడండి" అని ప్రార్థించాను. ఆశ్చర్యం! తెల్లవారేసరికి తమ్ములు చాలావరకు తగ్గిపోయాయి. "కోటి ప్రణామాలు బాబా!"