సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 39వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  1. బాబా ఎంతటి కరుణామూర్తి!
  2. బాబాయందు విశ్వాసముంటే ఆయనెప్పుడూ మనకు తోడుగా ఉంటారు.

బాబా ఎంతటి కరుణామూర్తి!

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

ఓం సాయిరామ్. నేను 10 సంవత్సరాల క్రితం బాబా వైపుకు లాగబడిన చాలా చిన్న భక్తురాలిని. బాబా నాకు తల్లి, తండ్రి, గురువు, సర్వం. చిన్నపిల్లలు తమ తల్లితో ఆటలాడుకున్నట్లుగా చాలాసార్లు చిన్న చిన్న విషయాలకు నేను బాబాతో పోట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రేమ తల్లిప్రేమకంటే ఎంతో ఉన్నతమైనది.

ఒక రాత్రివేళ హఠాత్తుగా మా అబ్బాయికి తీవ్రమైన దగ్గు, దాంతోపాటు జ్వరం కూడా వచ్చింది. ప్రతి 5 నిమిషాలకు విపరీతంగా దగ్గుతూ ఉన్నాడు. నేను బాబాను ప్రార్థించి, ఊదీతో పాటు మందు కూడా ఇచ్చాను. అయినా దగ్గువలన తను రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఉదయం కూడా తన పరిస్థితి అలానే ఉంది. నేను తన కంఠానికి ఊదీ రాసి, "బాబా! మీ బిడ్డ విషయంలో జాగ్రత్త తీసుకోండి. దయచేసి మధ్యాహ్నానికల్లా తనకు నయంచేసి మీ ఉనికిని తెలియజేయండి" అని హృదయపూర్వకంగా ప్రార్థించాను. తరువాత ఏం జరిగిందో చెప్పనా? మన ప్రియమైన బాబా ఎంతటి కరుణామూర్తి! ఆయన తన బిడ్డ విషయంలో అద్భుతాన్ని చూపించారు. మధ్యాహ్నానికి నా బిడ్డ దగ్గు పూర్తిగా తగ్గిపోయి హాయిగా నిద్రపోయాడు. మనం బాబాను పూర్తిగా ఎప్పటికీ అర్థం చేసుకోలేమేమో! "థాంక్యూ సో మచ్ బాబా! దయచేసి మీ బిడ్డలందరిపై మీ ఆశీస్సులు కురిపించండి". 

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబాయందు విశ్వాసముంటే ఆయనెప్పుడూ మనకు తోడుగా ఉంటారు.

యూకే నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బాబా ఎంతో కరుణామూర్తి, ప్రతి కష్టంలోనూ ఆయన నాకు తోడుగా నిలిచారు. పరిస్థితులు చేయిదాటిపోతున్న ప్రతిసారీ ఆయన పరిష్కారం చూపించి నాకు సహాయం చేసారు. నేనిప్పుడు చెప్పబోయే అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు ప్రమాణం చేశాను. ఈ అనుభవంవలన తోటి భక్తుల విశ్వాసం దృఢమవుతుందని నా నమ్మకం.

బాబా కృపవలన ఇటీవల నేనొక పాపకు జన్మనిచ్చాను. కాన్పు తర్వాత మొదటి కొద్దిరోజులు చాలా కష్టంగా నడిచాయి. అప్పుడు నాకు సహాయంగా మా అత్తమామలు వచ్చి మాతోపాటు ఉండటంతో ఇంట్లో పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. అలాంటి సమయంలో మా కజిన్స్ యూకే వచ్చారు. వాళ్ళు మా ఇంట్లో కొన్నిరోజులు ఉండాలని ఆశించారు. నేనున్న పరిస్థితిలో అతిథులను చూసుకోవడం కష్టమైన పని. పైగా నా అత్తమామలు అందుకు సహకరించరు, ఎందుకంటే ఇంటిపనులన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. అతిథులను కూడా చూసుకోవడానికి వాళ్ళు విసుక్కుంటారు. అలాగని నేను కజిన్స్‌తో కూడా నేరుగా వద్దని(నో) చెప్పలేక, రమ్మని మాటవరసకు చెప్పాను. తరువాత నాలో నేను చాలా ఆందోళనపడి, "బాబా! ప్లీజ్, ఏదో ఒక మిరాకిల్ చేసి నన్ను ఈ సమస్యనుండి కాపాడండి" అని ప్రార్థించాను. ఎందుకంటే నేను చెప్పలేకపోయిన 'నో' ని వాళ్ళంతట వాళ్లే చెప్పేలా ఆయనే చేయగలరు. సహాయం చేయమని బాబాను ప్రార్థిస్తూ రెండురోజులు టెన్షన్ గా గడిపాను. తరువాత బాబా అద్భుతం చూపారు. మా కజిన్ ఫోన్ చేసి తాము రావట్లేదని చెప్పారు. దానితో నేను ఊపిరి పీల్చుకున్నాను. అలా బాబా నన్ను కాపాడారు. ఇది చిన్న సమస్య అనిపించవచ్చు గానీ, నేనున్న పరిస్థితికి ఆ సమస్య పెద్దదిగానే కనిపించింది. బాబాయందు విశ్వాసముంటే ఆయనెప్పుడూ మనకు తోడుగా ఉంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo