ఈరోజు భాగంలో అనుభవాలు:
- సాయి రాకతో కష్టం అంటే తెలియలేదు
- బాబా నా స్నేహితురాలి సోదరుడిని కాపాడారు
సాయి రాకతో కష్టం అంటే తెలియలేదు
ఆస్ట్రేలియా నుండి సాయిభక్తురాలు రీను తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
మేము దాదాపు 8 సంవత్సరాలు ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత మాకు వర్క్ వీసా వచ్చింది. ఆ వీసా రాకముందు మేము చాలా కష్టకాలాన్ని ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ప్రతిరోజూ రాత్రి, పగలు ఏడుస్తూనే ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు రాత్రి సాయిబాబా కలలో కనిపించి, "నాతో రా! నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాను" అని చెప్పారు. నిజానికి నాకప్పటికి సాయిబాబా గురించి తెలీదు. అలాంటిది ఆయన నా కలలో కనిపించి ఆ అద్భుతమైన మాటలు చెప్పారు. ఆ మాటలు ఇప్పటికీ తాజాగా నా మనసులో మారుమ్రోగుతూనే ఉంటాయి. ఆ క్షణం నుండి బాబా మా జీవితాల్లో నిండిపోయారు. ఆరోజు తర్వాత మళ్లీ మాకు కష్టమంటూ తెలియలేదు. బాబా కలలో కనిపించిన ఆ తేదీ 2014 మార్చి 28, నా మనసులో స్థిరంగా నిలిచిపోయింది.
వర్క్ వీసా వచ్చిన మూడేళ్ల తర్వాత మేము ఆస్ట్రేలియాలో స్థిరనివాసం కోసం దరఖాస్తు చేసుకున్నాం. అయితే అదే సమయంలో అందుకు సంబంధించిన నియమ నిబంధనలు ఆస్ట్రేలియా గవర్నమెంటు మార్పు చేసినందువలన మా కోరిక నెరవేరడం కష్టతరమైంది. అయితే మాకు అండగా బాబా ఉన్నారు. గవర్నమెంట్ హఠాత్తుగా ఆ నిబంధనలు అమలు కావడానికి ఇంకో నెల గడువు పెంచింది. దాంతో బాబా కృపవలన మా స్థిరనివాసానికి సంబంధించిన వీసా లభించింది.
ఒకప్పుడు నేనెంతగా ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకలేదు. ఆ సమయంలో కూడా బాబా కృప చూపించారు. ఆయన అనుగ్రహం వల్ల నాకు మావారి ఫ్యాక్టరీలోనే ఉద్యోగం వచ్చింది. ఇద్దరం కలిసి హ్యాపీగా ఒకే చోట వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఇద్దరికీ నైట్ షిఫ్ట్స్ కావడంతో మా పాప ఒక్కదాన్నే ఇంట్లో వదిలిపెట్టడం పెద్ద సమస్య అయింది. దానికి కూడా బాబా పరిష్కారం చూపించారు. ఎలా అంటే, మా ఫ్రెండు సరైన ఉద్యోగం దొరకని కారణంగా చాలా ఇబ్బందిపడుతుండటంతో తను మా ఇంట్లో ఉండి, మా పాపని చూసుకోవడానికి అంగీకరించింది. మేము తనకి ఆర్థికంగా సాయం చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఏదో ఒక రూపంలో బాబా సహాయం మాకు లభిస్తూ ఉండేది. బాబా యందు పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండండి, మీ ప్రార్థనలు తప్పక ఫలిస్తాయి.
బాబా నా స్నేహితురాలి సోదరుడిని కాపాడారు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
ఒకసారి నా స్నేహితురాలి సోదరుడు మేడపైన ఏదో శుభ్రపరుస్తూ 17 అడుగుల మీదనుంచి క్రిందకి పడిపోయాడు. తలలోనుండి వచ్చిన రక్తం కారణంగా తన కళ్ళు మొత్తం మూసుకుని పోయాయి. వెంటనే నా స్నేహితురాలు నా దగ్గరికి వచ్చి ఖర్చుల కోసం ఒక 5000 రూపాయలు అడిగి తీసుకుని తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. డాక్టర్స్, "బ్రెయిన్‌లో బ్లడ్ బ్లాక్ అయింది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల"ని చెప్పారు. నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి ఆ వివరాలు చెప్తూ చాలా ఏడ్చింది. తను పడుతున్న బాధకి నేను కూడా చలించిపోయాను. నేను బాధతో కంటిన్యూగా బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. మరుసటిరోజు, 'తను కోలుకుంటాడా, లేదా' అని బాబా ముందు రెండు చీటీలు వేసాను. అందులో 'కోలుకుంటాడ'ని వచ్చింది. దాంతో బాబా కృప వలన తను ఖచ్చితంగా కోలుకుంటాడని నాకు కొండంత ధైర్యం వచ్చింది.
తరువాత డాక్టర్స్ ఆపరేషన్ కి 7 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. అంత పెద్ద మొత్తం ఎక్కడనుండి తేవాలో అర్థంకాక మేము చాలా టెన్షన్ పడ్డాం. అప్పడు నేను, "బాబా! కాస్త ఎమౌంట్ తగ్గేలా చూడండి" అని ప్రార్థించాను. తరువాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్ లో చూస్తే, "అతడు 7 రోజుల్లో కోలుకుంటాడు. అందరికీ ఆనందం కలుగుతుంది" అని రావడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా ఎంత గొప్ప అద్భుతం చేశారో తెలుసా? 7 లక్షలు అన్నది కేవలం రెండు లక్షలకే ఆపరేషన్ జరిగిపోయింది. బాబా నా ప్రార్థనలు విన్నారని నేనెంతగానో ఆనందించాను. తను త్వరగా కోలుకోవాలని నేను రోజూ "సాయిరామ్, సాయిశ్యామ్" స్మరిస్తూ ఉండేదాన్ని. అద్భుతం! బాబా చెప్పినట్లుగానే 7 రోజుల్లో తను కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. బాబా లీలలకు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. "థాంక్యూ సో మచ్ బాబా!" నేను సాయిభక్తులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బాబా నుండి ప్రతికూలమైన సమాధానం వచ్చినప్పటికీ, బాబా చేయి ఎప్పటికీ విడిచిపెట్టకండి. ఏం జరిగినా బాబాను పూర్తి విశ్వాసంతో నమ్మండి. అంతా మంచి జరుగుతుంది.