ఈరోజు భాగంలో అనుభవం:
- ఉష అనే పిచ్చుకను (భక్తురాలిని) సాయి తన దరికి చేర్చుకున్న వైనం
సాయిభక్తురాలు శ్రీమతి ఉష తమ అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
తోటి సాయిభక్తులందరికీ సాయిరాం!
నా పేరు ఉష. నేను బెంగుళూరులో ఒక బహుళ జాతీయ సంస్థ (మల్టీ నేషనల్ కంపెనీ)లో ఉద్యోగం చేస్తున్నాను. 2016వ సంవత్సరంలో బాబా నాకు ప్రసాదించిన మూడు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.
మొదటి అనుభవం: 2016లో బాబా నన్ను తన దరికి చేర్చుకున్న వైనం..
నేను జన్మతః హిందువునే అయినా, నా విద్యాభ్యాసమంతా క్రిస్టియన్ విద్యాసంస్థలలో జరగడంవలన, నా స్నేహితులలో ఎక్కువమంది క్రిస్టియన్సే ఉండేవారు. నేను హిందూమందిరాల కంటే చర్చిలకే ఎక్కువగా వెళుతుండేదాన్ని. మా ఇంట్లో ఎవ్వరూ బాబా భక్తులు కారు. నాకు వివాహమైన తరువాత, మా మామగారు హిందువు, మా అత్తగారు క్రిస్టియన్ అవటంతో నేను, మావారు ఇద్దరం హిందూ దేవాలయాలకు, చర్చిలకు రెండింటికీ వెళుతుండేవాళ్ళం. మా రెండు కుటుంబాల మధ్య మతపరమైన చిన్న చిన్న వైరుధ్యాలున్నా మేము రెండు మతాల పండుగలు జరుపుకుంటున్నాము. ఒకరినొకరం అర్థం చేసుకొని మా జీవితాలను ఆనందంగా గడుపుతున్నాము.
ఒకసారి నేను ఆఫీసులో నా సహోద్యోగినిని కలవటానికి ఆమె సీటు దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆమె పనిచేసే టేబిల్ పై చిన్న బాబా విగ్రహం ఉండటం గమనించాను. ఆమె బాబాను ఒక గొప్ప మహిమగల దేవునిగా నాకు పరిచయం చేసింది. నా మనసులో “నిజమేనా?!” అని అనుకున్నాను, కానీ నేను ఆమెతో మాత్రం ఏమీ చెప్పలేదు. అదేసమయంలో, మావారు కూడా అప్పుడప్పుడు బాబా మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇది జరిగిన సుమారు రెండు సంవత్సరాల తరువాత 2016 సంవత్సరంలో నేను, నాతో పాటు కంపెనీ వెహికల్‌లో వచ్చే ఒక కొలీగ్ ఇద్దరం మంచి స్నేహితులమయ్యాము. తను చిన్నప్పటినుండి బాబాకు మంచి భక్తురాలు. ఆమె ప్రతిరోజూ ఆఫీసులో కలిసినప్పుడు బాబా గురించి చెపుతూ ఉండేది. బాబాపై ఆమెకున్న భక్తి నన్ను బాగా ప్రభావితం చేసింది.
అప్పట్లో నాకున్న సమస్యలనుంచి నన్ను బయటపడవేస్తారనే ఉద్దేశ్యంతో, 23-03-2016 తేదీ, బుధవారం రోజున నేను కూడా బాబాను పూజించాలని నిశ్చయించుకున్నాను. కానీ నా దగ్గర బాబా ఫోటో కానీ, విగ్రహం కానీ లేకపోవటంతో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజగదిలో వున్న చిన్న బాబా ఫోటోను తస్కరించాను. ఆ ప్రక్కరోజు ఆ బాబా ఫోటోను మా పూజగదిలో ఉంచి సంతోషంగా పూజించుకున్నాను. అలా బాబా నన్ను తమ పాదాల చెంతకు చేర్చుకున్నారు. ఇప్పుడు నా జీవితంలోని ప్రతిక్షణమూ బాబా అనుగ్రహంతో నిండిపోయింది. నా సద్గురువైన బాబా అడుగడుగునా నన్ను చేయిపట్టి నడిపిస్తున్నారు. "బాబా! మీకు నా కృతజ్ఞతలు."
రెండవ అనుభవం: వ్యక్తిగత ఋణం మంజూరైన వైనం..
మావారు చేసిన అప్పులు తీర్చటానికి నేను వ్యక్తిగత ఋణం తీసుకుందామని ఎన్ని బ్యాంకులను సంప్రదించినా, నా క్రెడిట్ స్కోరు 0 ఉండటంతో, నేను పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నీ తిరస్కరించబడ్డాయి. కానీ కేవలం బాబా అనుగ్రహంతో మే 2016లో నాకు ఋణం మంజూరయ్యింది.
మూడవ అనుభవం: క్రొత్త కారు అనుగ్రహించడం..
నేను, మా నాన్నగారు సుజుకీ విటారా బ్రెజా కారు కొనటానికి బుకింగ్ చేసుకున్నాము. కారు డెలివరీ రావటానికి 3 నుంచి 5 నెలల సమయం పడుతుంది. నేను అంతకుముందే వ్యక్తిగత ఋణం తీసుకొని ఉండటంవల్ల, జాతీయ బ్యాంకుల నుండి మళ్లీ కారు లోన్ రావటం చాలా కష్టమని షోరూం ఫైనాన్స్ వాళ్ళు చెప్పారు. నా వ్యక్తిగత ఋణం నెలసరి వాయిదా కనబడేలా నా బ్యాంకు స్టేట్‌మెంట్ కాపీ ఇవ్వమని వాళ్లు నన్ను అడిగారు. నేను వ్యక్తిగత ఋణం తీసుకున్నట్లు మా నాన్నగారికి తెలీదు. అందువలన నేను ఇప్పుడు బ్యాంకు స్టేట్‌మెంట్ ఇస్తే, అది నాన్నగారు చూసి నేను ఋణం తీసుకున్న విషయం బయటపడుతుందని నేను భయపడుతూ బ్యాంకు స్టేట్‌మెంట్ ఇవ్వటానికి సుముఖత చూపించలేదు. నేను మనసులో బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. ఎంతో ఆశ్చర్యంగా, ఎంత ప్రయత్నించినా బ్యాంకు స్టేట్‌మెంట్ ప్రింట్ రాలేదు. బాబా నా ప్రార్థనలు విని ఆ క్లిష్టసమయం నుండి నన్ను గట్టెక్కించారు. తరువాత మేము షోరూం ఫైనాన్స్ ద్వారా కాకుండా బయట వ్యక్తి ద్వారా కారు లోన్ కు అప్లై చేశాము. కానీ బయట వ్యక్తి ద్వారా కావటం వలన, సరైన కో-ఆర్డినేషన్ లేకపోవటం వలన, అంతకుముందు తీసుకున్న వ్యక్తిగత ఋణం మూలంగా నా కారు లోన్ మంజూరు అవుతుందో లేదోనని ఆందోళన చెందాను. కానీ బాబా అనుగ్రహంతో అన్నీ సజావుగా జరిగి, నా కారు లోన్ మంజూరు అయ్యి, మేము బుక్ చేసుకున్న కారు గురువారం రోజున డెలివరీ చేయబడింది. నా దైవమైన బాబా ఆనుగ్రహానికి నా కృతజ్ఞతలు. బాబా! ఇలాగే మమ్మల్నందరినీ మా జీవితమంతా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ....
మీ
ఉష.

Om Sai ram bless our Amma with health and course.please remove her anxiety and fear . give her complete life to live happy.om Sai ram baba
ReplyDelete