ఈరోజు భాగంలో అనుభవాలు:
- శ్రీ పాండురంగనిగా శ్రీసాయి దర్శనం
- ఊదీ మహిమలు
శ్రీ పాండురంగనిగా శ్రీసాయి దర్శనం
ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సుమ. మా నివాసం నెల్లూరు. ముందుగా బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు. బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతుంటే బాబా ఎప్పుడూ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు సాయిమహారాజ్ సన్నిధి బ్లాగులో 'మా ఆర్థిక సమస్యలు బాబా ఎలా తీర్చారో' అనే అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు గతవారంలో బాబా ఇచ్చిన మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను.
2019, ఏప్రిల్ 28వ తేదీన నేను క్వశ్చన్&ఆన్సర్ సైటులో ఒక సమస్య గురించి బాబాని అడిగినప్పుడు, "నీ సమస్య అతిత్వరలో తీరుతుంది. వారంరోజుల్లో పాండురంగస్వామి రూపంలో సాయినాథుడు దర్శనమిస్తారు” అని వచ్చింది. 29వ తేదీ నాడు వాట్సాప్ గ్రూపులో అనుభవాలు చదువుతుండగా ఒక సాయిభక్తురాలు తనకి కూడా క్వశ్చన్&ఆన్సర్ సైటులో పాండురంగస్వామిలా దర్శనమిస్తానని బాబా చెప్పినట్టు వచ్చిందని, తరువాత తను తన ఊరి మందిరంలో జరుగుతున్న ధ్వజస్తంభ ఆరోహణ కార్యక్రమానికి వెళ్లానని, అది పాండురంగస్వామి ఆలయం అని, అక్కడ బాబానే ఆ రూపంలో దర్శనమిచ్చారని వ్రాశారు. పాండురంగస్వామి ఫోటోలను కూడా ఆమె తన అనుభవంతో పాటు పెట్టారు. ముందురోజు సూచించినట్లుగానే బాబా పాండురంగస్వామిలా దర్శనమిచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది.
అదేరోజు శిరిడీలో బాబా సశరీలుగా ఉన్నప్పటి రోజులలో జరిగిన అనుభవాలు చదువుతుండగా, చావడిలో హారతి జరిగే సమయంలో బాలారామ్ ధురంధర్ బాబా ముఖమందు పాండురంగని తేజస్సు చూసిన వర్ణన ఉంది. ఆ అనుభవంలో వారు పంచుకున్న ఫోటోలో సాయిబాబా వెనుకగా పాండురంగస్వామి నిలబడి ఉన్నారు. అలా బాబా, పాండురంగస్వామి కనిపించేసరికి బాబా ఇచ్చిన జవాబు వెంటనే నా మదిలో మెదిలింది. ఆ విధంగా బాబా నన్ను అనుగ్రహించారని చాలా ఆనందించాను.
మరొక నిదర్శనమేమిటంటే, నేను రోజులో ఎక్కువభాగం సాయి టి.వి.నే చూస్తూ ఉంటాను. ఆ వారంరోజుల్లో ఆ ఛానల్ లో ప్రసారమవుతున్న పాటల్లో అనేకసార్లు పాండురంగస్వామిలా సాయిని చూసాను. ఎన్నోరోజులుగా నేను ఆ ఛానల్ చూస్తున్నా కూడా పాండురంగస్వామి రూపాన్ని గమనించడం ఆ వారంలోనే జరిగింది. ఇలా ఆ వారంరోజుల్లో ప్రతిరోజూ ఏదో ఒకవిధంగా పాండురంగని రూపంలో సాయినాథుడిని చూడగలిగాను.
కొన్ని ఊదీ మహిమలు:
ఒకరోజు రాత్రి నాకు భరించలేనంత పంటినొప్పి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళని నిద్రలేపడం ఇష్టంలేక బాబాను ప్రార్థించి, ఊదీని పంటికి రాసాను. ఒక 10 నిమిషాలకి నా నొప్పి చాలావరకు తగ్గిపోయింది. అప్పటివరకు భరించలేనంత నొప్పితో అల్లాడిపోయిన నేను బాబా ఊదీ పెట్టిన కొద్దిసేపట్లోనే హాయిగా నిద్రపోగలిగాను. మరుసటిరోజు నిద్రలేచేసరికి అసలు నొప్పి అన్న మాటే లేదు. బాబా ఊదీ మహిమ నిజంగా చాలా అద్భుతం!
ఇంకొకసారి భుజంనొప్పి ఎక్కువగా ఉండి నేను కాస్త కూడా చెయ్యి పైకి లేపలేకపోయాను. అప్పుడు కూడా బాబా ఊదీని నొప్పి ఉన్న చోటంతా రాశాను. ఆశ్చర్యంగా కొద్దిసేపటికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "అమోఘమైన ఊదీ మహిమ చూపినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎల్లప్పుడూ మీ చల్లని నీడలో మేమంతా హాయిగా ఉండాలి. మీ కృప ఎప్పుడూ మీ భక్తుల మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను". బాబాపై నమ్మకం ఉంచండి. ఆయన మనకి ఏది మంచిదో అది చేస్తారు.

ఊదీ మహిమ
పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు.
నాకు తరచూ మెడ పట్టేసి తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఉదయాన ఆ నొప్పితో నిద్రలేచిన ప్రతిసారీ ఇంటిపని చేసుకోలేకపోయేదాన్ని. కనీసం ఒక వారం వరకూ అలా ఇబ్బందిపడుతూ ఉండేదాన్ని. కొన్నిరోజుల క్రితం కూడా ఆ నొప్పితో నిద్ర లేచాను. 'ఇంక ఏమీ చేయకుండా మంచం మీద పడుకుని ఉండాల'ని చాలా దిగులుపడ్డాను. అలా పడుకుని బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతూ, బాబా ఊదీ యొక్క అద్భుతశక్తిని, ఆయన మహిమను తలుచుకుని, కొంచెం ఊదీ నా మెడపై రాసుకుని, "బాబా! ఈ నొప్పి త్వరగా తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. వారంరోజులకు గాని తగ్గని ఆ నొప్పి కేవలం 2 రోజుల్లో బాబా కృపవలన తగ్గిపోయి నేను నా పనులు చేసుకోగలిగాను. "థాంక్యూ సో మచ్ బాబా!"