ఈ భాగంలో అనుభవం:
- బాబా నా తండ్రిని రక్షించారు
సాయిబంధువు నబా గారు తన అనుభవాల్ని ఇలా తెలియజేస్తున్నారు:
ముందుగా బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. విశ్వమంతటా ఉన్న సాయిభక్తులందరికీ బ్లాగు ద్వారా వెలకట్టలేని కానుకని అందజేస్తున్నారు. బ్లాగు చదివేవారికి ఓం సాయిరాం!!!
నేను ఒరిస్సాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. నా వయస్సు 30 సంవత్సరాలు. ఈమధ్యకాలంలో బాబా మా నాన్నగారిని ఎలా రక్షించారో ఈరోజు మీకు తెలియజేస్తున్నాను.
నా మొదటి అనుభవం:
"సాయిబాబా! మీకు మాట ఇచ్చినట్టుగానే నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటున్నాను. తప్పులు ఏవైనా ఉంటే మన్నించి దయతో నన్ను ఆశీర్వదించండి బాబా!". జీవితమంటే ఎన్నో అనూహ్యమైన సంఘటనల కలయిక. నేను, నా భార్య ఇద్దరం కలకత్తాలో ఉద్యోగం చేస్తున్నాము. కొద్దినెలల క్రితం యు.ఎస్.ఏ వెళ్లేందుకు నా భార్యకు కంపెనీనుండి వీసా వచ్చింది. మేమంతా తన విదేశీ ప్రయాణంకోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో మా నాన్నగారికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. మేమెప్పుడూ ఆరోగ్యసమస్యలని తేలికగా తీసుకోలేదు. అందువలన వెంటనే మా ఫ్యామిలీ డాక్టరుని సంప్రదించాము. ఆయన, "ఇది జలుబు వలన ఏర్పడిన చిన్న అసౌకర్యం. కంగారుపడాల్సిన పని లేద"ని కొన్ని మందులు వ్రాసిచ్చారు.
రోజులు గడుస్తున్నకొద్దీ ఆయన సమస్య పెద్దదయ్యింది. నేను లోలోపల మధనపడి, "బాబా! నాన్న క్షేమంగా ఉండేలా చూడండి" అని ప్రార్థించాను. నా భార్య యు.ఎస్.ఏ కి ప్రయాణమైన మరుసటిరోజే ఆలస్యం చేయకుండా నేను నా తల్లితండ్రుల దగ్గరకు వెళ్లి మెరుగైన చికిత్సకోసం నాన్నని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి పరీక్షలు చేయించాను. నాన్న గుండె బలహీనంగా ఉంది, వెంటనే యాంజియోగ్రాం చేయించాలని చెప్పారు. నాన్న పరిస్థితి చూడలేక, "బాబా! నాన్నని కాపాడండి" అని వేడుకున్నాను. యాంజియోగ్రాం రిపోర్టులో మూడు బ్లాక్స్ ఉన్నట్టు తెలిసింది. ఆ రిపోర్టులు చూసి డాక్టరు కూడా ఆశ్చర్యపోతూ, "మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉందంటే, ఏ క్షణంలోనైనా అతని గుండె ఆగిపోవచ్చు. అలాంటి స్థితిలో కూడా ఆయన ఒక్కరే ఆఫీసుకి వెళ్లిరావడం చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది" అని చెపుతూ, "ఆలస్యం చేయక వెంటనే యాంజియోప్లాస్టీ చేద్దామ"న్నారు. నేను, అమ్మ మాత్రమే అక్కడ ఉన్నాము. ఆ సమయంలో మాకున్న ఒకేఒక ఆశ బాబా మాత్రమే. నాకు లోపల, “దిగులుపడకు, నేను నీతోనే ఉన్నాను. ఏమీ జరగద"ని బాబా ధైర్యం చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంది. ఒకపక్క ఆందోళన చెందుతున్నప్పటికీ మరోపక్క ఎలాగైనా బాబా నాన్నని కాపాడుతారనిపించింది. మొత్తానికి బాబా కృపవలన యాంజియోప్లాస్టీ విజయవంతమయ్యింది. మరికొంత పర్యవేక్షణలో ఉంచడం కోసం ఐసియు లోకి మార్చారు. కొద్దిరోజులకి నాన్న రిపోర్టులు అన్నీ నార్మల్ రావడంతో డిశ్చార్జ్ చేసారు.
నా రెండవ అనుభవం :
కొన్నిరోజుల తరువాత నాన్న 'ఈమధ్య కొన్నిరోజులుగా తన చెవి వెనుకభాగంలో 2/3 వంతు వాచినట్లు' ఫిర్యాదు చేసారు. చూస్తే చాలా పెద్దగా, చర్మం లోపలనుండి ఉన్నట్లుగా ఉంది. మా అందరికీ భయమేసింది. వెంటనే ఆయన డాక్టరు దగ్గరకు వెళ్తే, అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేక క్యాన్సర్ కణాల వలన ఏమైనా వచ్చిందా అని నిర్ధారణ చేసేందుకు ఒక టెస్ట్ వ్రాసారు. అది వినగానే మేమంతా చాలా క్రుంగిపోయాము. వెంటనే నేను బాబా దగ్గరకి వెళ్లి, "బాబా! నాకెందుకిలా జరుగుతోంది? నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. కలలో కూడా ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు. మరి ఎప్పుడూ నాకే ఎందుకిలా? ముందు అమ్మకి, ఇప్పుడు నాన్నకి" అని ప్రార్థించాను. ఆ సమయంలో నేను నా విశ్వాసాన్ని కోల్పోయి చాలా ఆదుర్దాగా ఉన్నాను. విశ్వాసం స్థిరంగా ఉంచుకోవడం నా చేతిలో లేదు. కానీ, నిరంతరం సాయి స్మరణ చేస్తూ, సచ్చరిత్ర పారాయణ చేస్తూ, సాయి వీడియోలు చూస్తూ ఉంటే అంతా సానుకూలంగా ఉంటుంది, అది మాత్రం మన చేతుల్లోనే ఉందని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. నన్ను నమ్మండి. అలా చేయడంవలన కష్టసమయంలో మనలో అపారమయిన శక్తిని నింపి, ఇంకా చెడు ఆలోచనలను తొలగించి సానుకూల దృక్పథంతో ఉండేలా చేస్తాయి. "నాన్న రిపోర్టులు నార్మల్ గా వచ్చి, ఆయన వాపు తగ్గేలా చేస్తే ఆరోజే నా అనుభవాన్ని అందరితో పంచుకుంటాన"ని బాబాకి వాగ్దానం చేశాను. "సాయిబాబా! మీ ఆశీర్వాదంతో ఈరోజే రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చాయి, నాన్న చెవి వాపు కూడా తగ్గుముఖం పట్టింది. మీపై నాలో ఉన్న భావాల్ని మాటల్లో చెప్పడం చాలా కష్టమైన పని బాబా! ప్రతిరోజు మొదలయ్యేది, ముగిసేది నీ నామంతోనే. నేను ఎప్పుడూ ఒంటరినని అనుకోలేదు. నాకు తెలుసు, నీవెప్పుడూ నాతోనే ఉండి నాకు మార్గనిర్దేశం చేస్తున్నావు అని. తెలిసీ తెలియక నేనేమైనా తప్పులు చేసి ఉంటే, నన్ను క్షమించండి. నీవు నేర్పిన శ్రద్ధ, సబూరి అను మంత్రాలని గుర్తుంచుకుని నీవు చూపిన మార్గంలో సదా నడుచుకుంటాను".
అందరికీ నేను చేసే మనవి ఒకటే - కష్టసమయాల్లో ఎప్పుడూ 'సాయి సాయి' అని జపించండి. అన్ని మార్గాలు తెరచుకుంటాయి.
🕉 sai Ram
ReplyDelete'సాయి సాయి'
ReplyDelete'సాయి సాయి'
'సాయి సాయి'
'సాయి సాయి'