సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 35వ భాగం....


ఈ భాగంలో అనుభవం: 
  • ఆలస్యమైనా బాబా సహాయం సరైన సమయంలో తప్పక అందుతుంది.

ఒక అజ్ఞాత సాయిభక్తుని అనుభవం:

ఓం సాయిరామ్! నేను బాబాకి అంకితభక్తుణ్ణి. నాకు ఏ కష్టం కలిగినా భక్తుల అనుభవాలు చదవడంతో, 'బాబా ఉన్నారు, ఆయనే చూసుకుంటారు' అని ఆ కష్టాన్ని మర్చిపోతాను. ఏది జరిగినా అది భగవంతుని ఇష్టప్రకారమే జరుగుతుందని నా నమ్మకం. కష్టం ఎదురైనప్పుడు ముందు, "నా కుటుంబానికి ఎందుకంత కష్టం భగవంతుడు ఇచ్చాడ"ని బాధపడినా, ఆ తర్వాత ఏం జరిగినా దాని వెనుక ఏదో కారణం ఉంటుందని అనుకుంటాను. ఇటీవల ఉద్యోగవిషయంగా నేను చాలా మానసిక క్షోభను ఎదుర్కొన్నాను. నేను ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా ఇంటర్వ్యూకి పిలుపు వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా నా క్వాలిఫికేషన్స్ అవసరానికి మించి ఉన్నాయనో లేకపోతే తక్కువగా ఉన్నాయనో చెప్తూ ఉండేవారు. ఇలా ఒకసారి కాదు, ప్రతిసారీ జరుగుతూ ఉండేసరికి ఏమీ అర్థంకాక నాకు పిచ్చెక్కుతుండేది.

అలా ఉండగా ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేసి, "తనకు తెలిసిన వాళ్ల ద్వారా ప్రయత్నిస్తాన"ని నా ప్రొఫైల్ అడిగారు. ఎప్పటిలాగే నేను చాలా ఆశగా ఇంటర్వ్యూ కాల్ కోసం ఎదురుచూశాను. కొన్నిరోజులకి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. దానితో పాటు మరికొన్ని కాల్స్ కూడా వచ్చాయి. నేను ఆ ఇంటర్వ్యూలను చాలా బాగా ఫేస్ చేశాను. అందులో ఒకటైతే అద్భుతంగా చేశాను. ఈసారి ఎలాగైనా జాబ్ వస్తుందని ఉత్సాహంగా ఎదురుచూశాను. రోజులు గడుస్తున్నా వాళ్ళనుండి కాల్ రాకపోయేసరికి మనస్సులో పలురకాల ఆలోచనలతో చాలా మథనపడ్డాను. చివరికి వాళ్ళు ఫోన్ చేసి, "ఆ పొజిషన్‌కి సరిగా సరిపోయే వ్యక్తి దొరకడంతో అతనికి ఇచ్చేశామ"ని చెప్పారు. నేను అంత బాగా చేసినప్పటికీ అవకాశాన్ని కోల్పోయాను. ప్రతిసారీ అలాగే జరుగుతుండటంతో చాలా బాధపడ్డాను. కానీ ఎంత బాధలో ఉన్నా బాబాని తలుచుకుంటూ, ఆయన లీలలు చదువుతూ ఉండేవాడిని. ఒకవారం తర్వాత అదే కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి, "మీ ప్రొఫైల్ చాలా బాగుంది. మేం వేరే పొజిషన్‌కి తీసుకోవాలనుకుంటున్నాము, రేపు ఒకసారి ఇంటర్వ్యూకి రండి" అని చెప్పారు. ఆ మాట వింటున్న నాకు చాలా ఆనందంగా అనిపించి, ఒక్కరోజే ఉండటంతో వెంటనే ఇంటర్వ్యూకి ప్రిపేరవడం మొదలుపెట్టాను. "బాబా! ఈ ఇంటర్వ్యూ సక్రమంగా జరిగేలా ఆశీర్వదించండి" అని ప్రార్థించి ఇంటర్వ్యూకి వెళ్ళాను. బాబా కృపవలన అంతా సజావుగా సాగింది. ఎలా అయినా నాకా ఉద్యోగం వస్తుందని పూర్తి నమ్మకంతో ఇంటికి వచ్చేసాను. రెండురోజుల తర్వాత ఆ కంపెనీనుండి వేరే అతను ఫోన్ చేసి, 'మిమ్మల్ని తీసుకోవడంలేద'ని చెప్పారు. ఆ మాట వింటూనే నా గుండె పగిలిపోయింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాను. బాబా పాదాలపై పడి, "బాబా! నాకెందుకిలా జరుగుతోంది? ఒకవేళ నాకు ఆ ఉద్యోగం సరైనది కాదన్నదే మీ అభిప్రాయమయితే, అలాగే స్వీకరిస్తాను. దయచేసి నాకు ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి" అని ప్రార్థించాను. తరువాత మనసారా సాయిని పూజించి, సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేస్తాననుకున్నాను. అనుకున్నట్లుగానే మరుసటిరోజునుండి పూజ చేసి పారాయణ మొదలుపెట్టాను. మరుసటిరోజే నన్ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఫోన్ చేసి, "ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. నాకు ఆరోగ్యం బాగోలేక నేను ఆఫీసుకు రావట్లేదు. మీరు ఆ పొజిషన్‌కి ఎంపిక అయ్యారు. మూడురోజుల్లో వచ్చి జాయినవ్వండి" అని చెప్పారు. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. ఆనందభాష్పాలతో బాబా పాదాలపై వాలిపోయాను. అద్భుతమైన  మిరాకిల్‌ని ఆరోజు చవిచూశాను. ఆ అద్భుతమైన మిరాకిల్‌ని ఎప్పుడు తలచుకున్నా ఆనందంతో మనసు నిండిపోతుంది.  తర్వాత నా పూజ పూర్తి చేసి, గుడిలో ప్రసాదం పంచాను. ఈ ఉద్యోగం కేవలం బాబా అనుగ్రహంవల్లనే సాధ్యమైంది. "థాంక్యూ సో మచ్ బాబా!"

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo