సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 48వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. నవ గురువార వ్రతం - బాబా కురిపించిన ప్రేమ వర్షం
  2. బాబా చేసిన సహాయం

నవ గురువార వ్రతం - బాబా కురిపించిన ప్రేమ వర్షం

పేరు వెల్లడించని ఒక  సాయిబంధువు  తన అనుభవాన్ని ఇలా తెలియచేస్తున్నారు:

నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం ప్రతిసంవత్సరం నేను చేసే 'సాయి నవ గురువార వ్రతా'నికి సంబంధించినది. 2017వ సంవత్సరంలో బాబా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మరపురాని అనుభవాన్నిచ్చారు. ఎంతో ప్రేమతో నేను వ్రతాన్ని మొదలుపెట్టాను. బాబా కూడా అంతే ప్రేమగా బిడ్డ  కావాలన్న నా పెద్ద కోరికను నెరవేర్చారు. 2017, జూలై 27న నాకు పాప పుట్టింది. ఆరోజు గురువారం కావడంతో నా సంతోషానికి అవధులు లేవు. పైగా తను పుట్టినతేదీలోని సంఖ్యలను కలిపితే 2+7=9 అవుతుంది.  9 అంకె నవవిధభక్తికి చిహ్నం. ఇలా మా పాపకు సంబంధించిన ప్రతిదీ సాయి ఆశీర్వాదమే. నా ప్రార్థనలను మన్నించి, ప్రెగ్నెన్సీ కాలమంతా సజావుగా సాగేలా చేసినందుకు నేను బాబాకి సదా కృతజ్ఞురాలినై ఉంటాను.

అయితే పాప పుట్టిన తరువాత నా భర్త ఒక్కరి జీతంతో ఇంటి ఖర్చులు, మావారిపై ఉన్న ఇతర బాధ్యతలు తీరడం చాలా కష్టతరమైంది. పైగా మా ఇంటిపై లోన్ తీసుకుని ఉన్నందువల్ల మరొక మార్గంలేక పాప రెండోనెలలో ఉండగానే నేను ఉద్యోగంలో చేరవలసివచ్చింది. కానీ పాపను వదిలి వెళ్లడం నాకు చాలా కష్టంగా ఉండేది. ప్రతిరోజూ నా భర్త నన్ను ఆఫీస్ దగ్గర వదిలి వెళ్లేవారు. ఆ సమయంలో నేను కన్నీటితో, "బాబా! మీ ప్రసాదమైన పాపతో ఎక్కువ సమయం గడపాలని నాకుంది. కానీ ఉద్యోగం చేయకుండా ఉండలేని పరిస్థితి. ఇటువంటి స్థితిలో మనసుపెట్టి ఎలా పని చేయగలను?" అని అనుకునేదాన్ని. ఇదే ప్రశ్నని 'ప్రశ్నలు మరియు సమాధానాలు  సైట్' లో బాబాని అడిగితే, "అంతా మంచే జరుగుతుంది" అని సమాధానం వచ్చింది. ఇక అక్కడితో ఆ విషయం బాబాకి వదిలేసి నేను నా పనిలో నిమగ్నమయ్యాను. తరువాత 2018, ఫిబ్రవరి నెల చివరివారంలో నేను "నవ గురువార వ్రతం" మొదలుపెట్టాను. సరిగ్గా ఒక వారంరోజులకి మా ఆఫీస్ యాజమాన్యం వారు ఒక సమావేశం ఏర్పాటుచేసి, వారానికి రెండురోజులపాటు ఇంటినుండి వర్క్ చేసుకునే సదుపాయాన్ని నాకు కల్పించారు. ఇది ఖచ్చితంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం. ఎందుకంటే మా ఆఫీసులో అంతకుముందెప్పుడూ ఎవరికీ ఇంటినుండి వర్క్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. కేవలం నాకు మాత్రమే ఆ వెసులుబాటు కల్పించారు. అది కూడా నేను వాళ్ళను ఏమీ అడగకుండానే! ఇదంతా బాబా వాళ్ళకిచ్చిన ప్రేరణే! బాబా నా మీద అంత ప్రేమ వర్షాన్ని కురిపించారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

బాబా చేసిన సహాయం

మరో సాయిభక్తురాలి అనుభవం.

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను బాబాకు చాలా చిన్న భక్తురాలిని. నేను పనిచేస్తున్న ఆఫీసు మా ఇంటినుండి చాలా దూరంలో ఉండటం వలన అక్కడికి వెళ్లి రావడానికి దాదాపు మూడు, నాలుగు గంటలు పడుతుంది. అంతదూరం ప్రయాణం చేయడం వలన నేను చాలా అలసిపోతూవుండేదాన్ని. ఆఫీసు వాళ్లు ల్యాప్‌టాప్ ఏర్పాటు చేస్తే ఇంటినుండే వర్క్ చేసుకోవచ్చని అనుకున్నాను. అందుకోసం చాలా ప్రయత్నించాను కూడా. అయితే ఆఫీసు వాళ్ళు,  "ఇప్పట్లో ల్యాప్‌టాప్ ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఎందుకంటే, మీ పేరు మూడువేలమంది తర్వాత ఉంది. చాలా సమయం పడుతుంది" అని చెప్పారు. దాంతో నేను చాలా నిరాశపడి, "బాబా! నాకు కనుక ల్యాప్‌టాప్ వస్తే నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. తరువాత బాబా కృప వలన కేవలం నాలుగు నెలలలో ల్యాప్‌టాప్ నా చేతికి వచ్చింది. నిజానికి అంత త్వరగా రావడం అసాధ్యమైన విషయం. ఇది బాబా వలన మాత్రమే సాధ్యమైంది. "థాంక్యూ సో మచ్ బాబా!"

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo