ఈరోజు భాగంలో అనుభవాలు:
- బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం
- సర్జరీ అవసరం లేకుండా బాబా కాపాడారు
బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం
బెంగళూరునుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు:
నేను 2012 నుండి సాయిబాబా భక్తురాలిని. సాయిభక్తుల అనుభవాలు చదవడంతో నా రోజు ముగుస్తుంది. ఆ అనుభవాల ద్వారా నా భక్తి, విశ్వాసాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి. ఇక నా అనుభవానికి వస్తే ...
నేను 2016, అక్టోబరులో కొన్ని కారణాల వలన నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. తర్వాత చాలా కంపెనీలలో ఉద్యోగం కోసం ప్రయత్నించాను. అయితే ఏ కంపెనీ నుండి ఇంటర్వ్యూకి పిలుపు రాలేదు. దాంతో నేను చాలా నిరాశ చెందాను. నేనెప్పుడు 'క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్' లో సాయిబాబాను అడిగినా, "నీ కోరిక నెరవేరుతుంది" అని వచ్చేది. ఖాళీగా సమయాన్ని వృధా చేసుకోకుండా నేను నా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సర్టిఫికేషన్ కోర్సులో చేరాను. బాబా కృపవలన అందులో ఉత్తీర్ణురాలినై మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ సమయంలో సాయి దివ్యపూజ చేస్తూ, సాయి సచ్చరిత్ర కూడా పారాయణ చేశాను. తర్వాత కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. నేను విజయవంతంగా అన్ని రౌండ్స్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం మాత్రం రాలేదు. ఆ పరిస్థితి నన్ను ఇంకా క్రుంగదీసింది. కానీ నేను బాబాపట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు.
తర్వాత ఒకరోజు నాకొక కల వచ్చింది. కలలో నేను ఒక చీకటి ప్రదేశంలోకి నెట్టివేయబడ్డాను. నేను కొంచెం ముందుకి నడవగా ఒక కాంతి కనిపించింది. అప్పుడు నాకర్థమైంది, 'అది ఒక గుహ' అని. అక్కడ శివపార్వతులు కూర్చుని ఉండటం చూశాను. తర్వాత నేను వారిని బిల్వపత్రాలతో పూజిస్తూ ఉన్నాను. అంతటితో నాకు మెలకువ వచ్చింది. నాకది శుభసంకేతంగా అనిపించి, ఉదయాన నేను శివాలయానికి బయలుదేరాను. దారిలో బిల్వపత్రాలు దొరుకుతాయో లేదోనని అనుకుంటూనే ఆలయాన్ని చేరుకున్నాను. అక్కడ ఒక స్త్రీ బిల్వపత్రాలను పెట్టుకుని కూర్చుని ఉంది. నేను ఆ బిల్వపత్రాలను తీసుకుని శివుని దర్శనం చేసుకున్నాను. తర్వాత నేను సాయి మందిరానికి వెళ్లాను. అక్కడ ఒక బాలుడు పరుగున వచ్చి నా చేతిలో 'నవ గురువార వ్రతం' పుస్తకం పెట్టి, వెంటనే వెళ్లిపోయాడు. సాయి నవగురువార వ్రతం చేయమని సూచిస్తున్నట్లుగా నాకనిపించి, మరుసటివారం నుండి వ్రతాన్ని ప్రారంభించాను. వెంటనే బాబా స్వప్న దర్శనమిచ్చారు. మళ్లీ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్ లో నా ఉద్యోగం గురించి బాబాను అడిగితే, "నీ కోరిక కృష్ణ జయంతి(కృష్ణాష్టమి) నాడు నెరవేరుతుంది" అని వచ్చింది. మరుసటిరోజే ఒక పెద్ద ఎమ్.ఎన్.సి. కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అన్ని రౌండ్లలో బాబా నాకు తోడుగా ఉండి, అన్ని ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పించారు. తర్వాత బాబా చెప్పినట్లుగానే కృష్ణజయంతి నాడు నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. 2018, సెప్టెంబరులో నేను ఉద్యోగంలో జాయినయ్యాను. సుమారు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత బాబా ఆశీస్సులతో నాకా ఉద్యోగం వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా! ఎప్పుడూ ఇలాగే నాకు తోడుగా ఉండి సరైన మార్గంలో నన్ను నడిపించండి".

సర్జరీ అవసరం లేకుండా బాబా కాపాడారు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలి అనుభవం:
గత ఆరేళ్లుగా నేను బాబా భక్తురాలిని. నేను మైసూరుకు చెందిన దానిని అయినప్పటికీ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నాను. నేను చిన్నప్పటినుంచి సైనస్ సమస్యతో బాధపడుతున్నాను. కాలం గడిచేకొద్దీ అది నాకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఉదయం విపరీతమైన తుమ్ములతో చాలా కష్టంగా ఉండేది. చివరికది ఆస్తమాగా కూడా పరిణమించింది. డాక్టరుని సంప్రదిస్తే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, చేసినా 100% నయమవుతుందని చెప్పలేమని అన్నారు. ఇక నేను ఆందోళనగా బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు భయపడుతూనే మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లాను. ఆయన నా ముక్కు పరిశీలించి, "ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉంది. సర్జరీ తప్పనిసరేమీ కాదు" అని చెప్పారు. ఒక్కరోజులో అంత మార్పుకి నేను ఆశ్చర్యపోయాను. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. "బాబా! థాంక్యూ సో మచ్ బాబా! ఈ సమస్యనుండి పూర్తిగా నన్ను మీరే బయటపడేస్తారని నా విశ్వాసం".