ఈరోజు భాగంలో అనుభవాలు:
- ఉజ్జయినిలో బాబా మాపై చూపిన అనుగ్రహం
- అద్దంలో బాబా దర్శనం
ఉజ్జయినిలో బాబా మాపై చూపిన అనుగ్రహం
సాయిబంధువు కృష్ణవేణి గారు తన రీసెంట్ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
సాయిబంధువులందరికీ సాయిరాం! బాబా అనుగ్రహం వలన మా ఇంట్లో అందరం ఆయన భక్తులం. జీవితంలో ఎన్నోసార్లు ఆయన ప్రేమతో మమ్మల్ని కాపాడారు. కొన్నిసార్లు కఠినంగా పరీక్షించినా మళ్ళీ నిలదొక్కుకునేలా కూడా అనుగ్రహించారు. ఆయన వెన్నకన్నా మృదువుగా ఉంటారు, ఒక్కోసారి వజ్రంకన్నా కఠినంగా ఉంటారు. ఎలా ఉన్నా, వారే మన ఆశ, శ్వాస.
సాయిబంధువులందరికీ సాయిరాం! బాబా అనుగ్రహం వలన మా ఇంట్లో అందరం ఆయన భక్తులం. జీవితంలో ఎన్నోసార్లు ఆయన ప్రేమతో మమ్మల్ని కాపాడారు. కొన్నిసార్లు కఠినంగా పరీక్షించినా మళ్ళీ నిలదొక్కుకునేలా కూడా అనుగ్రహించారు. ఆయన వెన్నకన్నా మృదువుగా ఉంటారు, ఒక్కోసారి వజ్రంకన్నా కఠినంగా ఉంటారు. ఎలా ఉన్నా, వారే మన ఆశ, శ్వాస.
ఇటీవల బాబా మాకు చూపిన ఒక లీలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2019, మార్చి 23వ తేదీన నేను, మావారు, మా ఇద్దరు పిల్లలు కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం మరియు మమలేశ్వరం జ్యోతిర్లింగ యాత్రకు వెళ్ళాము. 23వ తేదీ శనివారం సాయంత్రం ఉజ్జయిని చేరుకుని హోటల్లో ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్ళాము. మేము క్యూలైన్లో ఉండగా తెలిసిన విషయమేమిటంటే, "శని, ఆదివారాలు మామూలుగానే సెలవుదినాలు కాగా, సోమవారంనాడు రంగ్ పంచమి(నార్త్‌లో ఆరోజు హోళీ జరుపుకుంటారు) రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఆ కారణంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నందున స్వామిని స్పర్శిస్తూ అభిషేకించే వీలులేదని, కాబట్టి స్వామిని దూరంనుంచే దర్శించుకోవాలి" అని. ఇది విన్నాక మా అందరికీ బాధగా అనిపించింది. అప్పుడు నేను నా మనసులో, "బాబా! మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో తెలీదు. శివయ్యకు అభిషేకం చేసుకోవాల్సిందే. ఇంతదూరం వచ్చి అభిషేకం చేయకుండా వెళ్తే ఎంత బాధాకరం! ఐనా మీరుండగా మాకేంటి? గర్భగుడిలో దర్శనం, అభిషేకం మీరు ఇప్పించాల్సిందే" అని బాబాని ప్రార్థించి, "శివయ్యా! అభిషేకం చేయకుండా మేము వెళ్ళేదే లేదు" అని శివయ్యని ప్రార్థించుకున్నాను. ఇంకా, బ్లాగులోని అనుభవాలలో కొంతమంది భక్తులు, "మాకు ఇలా జరిగితే మా అనుభవాలు బ్లాగులో పంచుకుంటాం" అని అనుకుంటే వాళ్ళ కోరికలు బాబా తీరుస్తున్నారు. ఆ విషయం గుర్తుకొచ్చి, "బాబా! మేమిప్పుడు అభిషేకం చేసుకునేలా అనుగ్రహించండి. నేను కూడా నా అనుభవాన్ని బ్లాగులో షేర్ చేసుకుంటాను" అని అనుకున్నాను. ఇంతలో మావారు అక్కడ ఉన్న పూజారిని సంప్రదిస్తే వారు, "అభిషేకానికి ప్రత్యేక టికెట్ ఉంటుంది. అయితే గర్భగుడి లోపలికి ప్రవేశించాలంటే తప్పనిసరిగా పురుషులు ధోవతి, స్త్రీలు చీర ధరించాల్సిందే, లేకపోతే ప్రవేశం నిషేధం" అని చెప్పారు. అక్కడ మొదలైంది మాకు చిక్కు. సాధారణంగా ప్రతి యాత్రలో తప్పనిసరిగా ఇవన్నీ సర్దుకునే మేము ఈసారి అవి తీసుకెళ్ళలేదు. అయితే బాబా కృపవలన ఈ సమస్యకి పరిష్కారం కూడా పూజారులే చూపారు. ఇక మేము శివయ్యను స్పర్శిస్తూ అభిషేకించి తృప్తిగా పూజ చేసుకున్నాము. మా శిరస్సును స్వామి పానవట్టానికి తాకించే అదృష్టం కూడా మాకు ప్రసాదించారు మన సాయీశ్వరుడు. నాకైతే 'జన్మ ధన్యమైంది' అని అనిపించింది. అది మా జీవితంలో మరిచిపోలేని అనుభవం. మరుసటిరోజు పంచామృతాభిషేకం చేసుకోవాలన్న కోరికతో ఎంత ఖర్చవుతుందో వివరాలు తెలుసుకుని, అలా కూడా శివయ్యను అభిషేకించుకున్నాము. అసలు జరగదు అనుకున్నది బాబా అనుగ్రహంవలన రెండుసార్లు సాధ్యమైంది. "థాంక్యూ బాబా! ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే మీ సేవలో తరింపజేయండి". మరోసారి ఓంకారేశ్వర, మమలేశ్వర యాత్రకు సంబంధించిన అనుభవాలను పంచుకుంటాను.
అద్దంలో
బాబా దర్శనం
నాపేరు సాయిసురేష్. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అద్భుత అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
సాధారణంగా నేనెప్పుడూ హెయిర్ కట్ చేయించుకోవడానికి సెలూన్ కి రాత్రి 8 గంటల సమయంలో వెళ్తుంటాను. ఆ సమయంలో అయితే ఎవరూ ఉండరు, వేచి ఉండనవసరం లేకుండా త్వరగా అయిపోతుందని నా ఉద్దేశ్యం. అయితే 2019, ఫిబ్రవరి 27న సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటినుంచి వెళ్తూ, "సెలూన్లో ఎవరూ ఉండకపోతే బాగుంటుంది బాబా, ఉంటే అక్కడ సమయం వృధా అయిపోతుంది" అనుకుంటూ సెలూన్ కి చేరుకున్నాను. అక్కడ చూస్తే, ఇద్దరికి హెయిర్ కట్ అవుతుండగా, ముగ్గురు వేచి ఉన్నారు. సరే ఎలాగూ వచ్చాను కదా, సమయం వృధా చేసుకోవడం ఎందుకు, కూర్చుని బాబా నామస్మరణ చేసుకుందామనుకున్నాను. కూర్చుని రెండు, మూడు సార్లు బాబా నామం అనుకుని ఎదురుగా ఉన్న అద్దంలో చూస్తే, బాబా దర్శనమిచ్చారు. అద్దంలో కనిపిస్తున్న ఒక బాక్సుపైన ఆర్ట్ డిజైనులా బాబా ముఖం కనిపిస్తుంది. బాబా ఉన్నారని సంతోషంగా అనిపించి, ఇవతల ఉన్న బాక్స్ వైపు నేరుగా చూసాను. ఆశ్చర్యం! దానిమీద బాబా కనపడటం లేదు. ఇదేమిటని మళ్ళీ అద్దంలో చూస్తే బాబా కనపడుతున్నారు. మళ్ళీ బాక్స్ పై చూసాను, బాబా లేరు. అద్దంలో మాత్రమే బాబా దర్శనమిస్తున్నారు. ఆశ్చర్యానందాలతో బాబాని చూస్తూ బాబా స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను.
🕉 sai Ram
ReplyDelete