పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
నేను గత పది సంవత్సరాలనుండి సాయిబాబా భక్తురాలిని. నా జీవితంలో చాలా సాయి లీలలు చూశాను. నేనిప్పుడు మీతో ఈమధ్య జరిగిన రెండు అనుభవాల్ని పంచుకుంటాను.
మొదటి అనుభవం:
మా 7 నెలల పాప పడుకోవడానికి ఎప్పుడూ ఇబ్బందిపడదు. సాధారణంగా తనకు ఏదైనా నొప్పి కలిగితేగానీ ఏడవదు. అలాంటి పాప ఒకరోజు రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఏడవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఇంట్లో పెద్దవాళ్లకి కష్టంగా ఉంటుందని చాలా ఆందోళనపడ్డాను. కానీ నేను ఎంతగా ప్రయత్నించినా తనని ఊరుకోబెట్టలేకపోయాను. ఆ అర్థరాత్రివేళ ఎవరినీ సహాయం కోసం పిలవలేని పరిస్థితి. ఇక ఆ నిస్సహాయస్థితిలో, "బాబా! నా బిడ్డ ఏడవటం ఆపి, తను ప్రశాంతంగా నిద్రపోయేలా చేయండి" అని ప్రార్థించాను. బాబా కృపవలన 30 నిమిషాల్లో తను ప్రశాంతంగా నిద్రపోయింది. అప్పటినుండి తను నిద్రపోయే విషయంలో కొంత ఇబ్బందిపడుతోంది. "బాబా! మీరే తను ప్రశాంతంగా నిద్రపోయేలా అనుగ్రహించండి".
రెండవ అనుభవం:
నేను మా పాప పుట్టకముందు ఉద్యోగం చేసేదాన్ని. నా ప్రెగ్నెన్సీ సమయంలో చికిత్సలకు, డెలివరీకి అవసరమైన డబ్బులకి మావారి ఇన్సూరెన్సు ఉపయోగిస్తూ ఉండేవాళ్లం. అయితే అకస్మాత్తుగా 8 నెలల తర్వాత ఏవో కారణాలచేత కంపెనీ వాళ్ళు అప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని తిరస్కరించారు. దాంతో మొత్తం ఎమౌంట్ మేము ఒక్కసారిగా కట్టాల్సి వచ్చింది. ఇక తప్పనిసరి పరిస్థితై ఆ ఎమౌంట్ కట్టడానికి నేను నా పాత ఇన్సూరెన్స్ ఉపయోగించాలని అనుకున్నాను. అయితే పెద్దసమస్య వచ్చి పడింది. నేను ఆ ఇన్సూరెన్స్ పేరు, దానికి సంబంధించిన మెంబర్ ఐడి మర్చిపోయాను. గుర్తు చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ గుర్తురాలేదు. మరీ పెద్ద మొత్తం కావడంతో అది తప్ప వేరే దారి కూడా కనిపించలేదు. ఇక, "సాయిబాబా! దయ చూపండి. నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరికితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. ఆ సమయంలో అనుకోకుండా మహాపారాయణలో ఉన్న ఒక భక్తుని అనుభవం నా కంటపడింది. ఆరోజే అప్లోడ్ చేయబడిన ఆ అనుభవంలో ఆ భక్తుడు/భక్తురాలు ఏదో పోగొట్టుకొన్న సమయంలో తను సాయిబాబా సూచనతో స్తవనమంజరి పారాయణ చేయగా ఆ వస్తువు దొరికిందని చెప్పబడివుంది. అది చదువుతూనే నా శరీరం రోమాంచితం అయింది. అది బాబా సూచనగా భావించి నేను కూడా స్తవనమంజరి పారాయణ చేశాను కానీ, ఫలితం కనిపించలేదు. నేను చాలా నిరాశకు గురై, "దేవా! నేను నీ బిడ్డని కానా? ఎందుకు నా పట్ల పక్షపాతం చూపిస్తున్నావు? నా భక్తి స్వచ్ఛమైనది కాదా?" అని బాబాతో పోట్లాడుతుండేదాన్ని. ఆశ్చర్యం! బాబా అద్భుతం చూపించారు. ఒకరోజు మధ్యాహ్నం నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా, అందుకు అవసరమైన ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ ని బాబా నా మొబైల్ లోనే చూపించారు. "థాంక్యూ సో మచ్ బాబా! మా పాపని ఆశీర్వదించండి. మా జీవితంలోని దుఃఖం అంతా తొలగించేయండి బాబా!"
No comments:
Post a Comment