సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కొన్ని సంవత్సరాలుగా రాని ఉద్యోగం బాబా ఆశీస్సులతో వచ్చింది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువు దీపిక నంద్ వాణి తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు: 

నేను బాబాకు వినయపూర్వకమైన భక్తురాలిని. ఆయన అనుగ్రహం లేనిదే నేను లేను. బాబా నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. నా గురించి చెప్పమంటే ఎక్కువగా బాబా ఇచ్చిన అనుభవాల గురించే చెప్పగలను. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నా బాయ్‌ఫ్రెండ్ చాలా సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా ఉన్నాడు. తను ఎంత  ప్రయత్నించినా, ఏం ప్లాన్ చేసినా విజయం చేకూరక చాలా వైఫల్యాలను ఎదుర్కొన్నాడు. రెండు సంవత్సరాలపాటు నేను కూడా కోరుకున్న ఉద్యోగం రాక ఖాళీగా ఉన్నాను. అలా ఉండగా నేను 'నవ గురువార వ్రతం' చేసి, చివరి గురువారం నా బాయ్‌ఫ్రెండ్ చేతులమీదుగా నవ గురువార వ్రత పుస్తకాలు పంపిణీ చేయించాలని అనుకున్నాను. కానీ అదంత సులువు కాదు. ఎందుకంటే నా బాయ్‌ఫ్రెండ్‌కి సిగ్గు ఎక్కువ. తను తరచూ బాబా మందిరానికి వెళుతుంటాడుగాని, ఏదైనా పంపిణీ చేయడానికి మాత్రం ఇష్టపడడు. కానీ బాబా మిరాకిల్ చేసారు. చివరి గురువారం నేను పూజ వ్రతం పూర్తి చేసాక కొన్ని కారణాలవలన పుస్తకాలు పంపిణీ చేయడానికి మందిరానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో నేను నా బాయ్‌ఫ్రెండ్ తో, "మందిరానికి వెళ్లి పుస్తకాలు, ప్రసాదము పంపిణీ చేయమ"ని చెప్పాను. ఆశ్చర్యం! తను వెంటనే అంగీకరించాడు. తర్వాత మందిరానికి వెళ్లి పుస్తకాలు కూడా పంపిణీ చేశాడు. ఈ సమయంలో నేను సచ్చరిత్ర కూడా ఒక వారం పారాయణ చేశాను. కొన్నిరోజుల తరువాత నా బాయ్‌ఫ్రెండ్ కి ఉద్యోగానికి సంబంధించిన ఒక కాల్ వచ్చింది. బాబా ఆశీస్సులతో తనకి ఆ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరవలసినరోజు గురువారం అయ్యింది. తర్వాత బాబా ఆశీస్సులతో నాకు కూడా నేను కోరుకున్న ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. తర్వాత కూడా నేను సాయిబాబా వ్రతం, పూజ కంటిన్యూ చేశాను. "బాబా! మీ దివ్య పాదాలచెంత మాకు స్థానం కల్పించండి. ఎప్పుడూ మాకు తోడుగా ఉండి మీ ఆశీస్సులు మాపై కురిపించండి". సాయిభక్తులకు నేను చెప్పేది ఒక్కటే - బాబా పట్ల విశ్వాసాన్ని ఉంచండి, ఆయన మన కోసమే ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఆయన చూపిన శ్రద్ధ, సబూరి మార్గంలో ప్రయాణించడం ఒక్కటే. ఆయన మన తల్లి. ఆయనకు మన బాధ తెలుసు. ఎప్పుడూ బాబాను అనుమానించకండి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo