సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీసాయిబాబా, శ్రీరాముడు మా ప్రార్థనలు విన్నారు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ముంబాయినుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో  పంచుకుంటున్నారు.

"బాబా! ఈ అనుభవాన్ని వ్రాయడంలో నాకు సహాయం చేయండి. ఏమైనా తప్పులు వ్రాస్తే నన్ను క్షమించండి".  శ్రీరామనవమినాడు మా ఊరిలో సీతారామకళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి హాజరు కావాలని మా అమ్మ ముంబాయినుండి హైదరాబాద్ వెళ్ళి అక్కడినుంచి మా ఊరు వెళ్ళింది. మేము 2018 మార్చి 25న కళ్యాణం అన్న ఉద్దేశ్యంతో అమ్మకి అనుకూలంగా ఉంటుందని తన తిరుగుప్రయాణాన్ని మార్చి 26, సాయంత్రం గం.6.05ని.ల ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసాము. కానీ కళ్యాణం 26న అని తెలిసి, అమ్మ కళ్యాణం చూసుకుని మా ఊరినుండి ఫ్లైట్ అందుకోగలుగుతుందో, లేదోనని మేము చాలా ఆందోళనపడ్డాము. కనీసం అమ్మ ఒంటిగంటకి బయలుదేరితేగాని ఫ్లైట్ అందుకునే పరిస్థితి లేదు. కానీ పూజ, కళ్యాణం పూర్తయ్యేసరికి ఒంటిగంట దాటిపోయింది. దాంతో అమ్మ కంగారుపడుతూ, "సమయానికి ఫ్లైట్ అందుకునేలా చూడండి స్వామీ!" అని శ్రీరాముడిని ప్రార్థించింది. ఇక్కడ నేను, "బాబా! అమ్మ ప్రయాణం ఏ టెన్షన్ లేకుండా సాఫీగా సాగేలా చూడండి" అని ప్రార్థించాను.

అలా ప్రార్థించిన కొద్దిసేపటికే బాబా అనుగ్రహం అన్నట్టు నాకొక మెసేజ్ వచ్చింది, ఫ్లైట్ కొన్ని నిమిషాలు ఆలస్యమవుతుందని. వెంటనే నాన్నకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. అయితే అప్పటికీ టెన్షన్ పూర్తిగా పోలేదు. కానీ బాబా కృపవలన ఫ్లైట్ ఆలస్యం అవుతున్నట్లు రెండు మూడుసార్లు మెసేజ్ వచ్చింది. అమ్మ ఒక నిర్దిష్టమైన బస్‌స్టేషన్ కి చేరుకుంటే, అక్కడినుండి మేము క్యాబ్ బుక్ చేయాలనుకున్నాం గాని, సరిగ్గా సమయానికి ఎయిర్‌పోర్టుకి వెళ్లే నాన్‌స్టాప్ బస్సు దొరకడంతో అమ్మ ఫ్లైట్ టైం కన్నా ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. దాంతో మేమంతా ఊపిరి పీల్చుకున్నాము. తర్వాత అమ్మ బోర్డింగ్ పాస్ తీసుకుని ఫ్లైట్ ఎక్కింది. శ్రీసాయిబాబా, శ్రీరాముడు మా ప్రార్థనలు విన్నారు, అమ్మను సమయానికి ఫ్లైట్ అందుకునేలా చేసారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo