శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలి అనుభవం:
నేను సాయిభక్తురాలిని. నేనంటూ ఉన్నానంటే అది కేవలం బాబా వలనే. 2018 ఏప్రిల్ నెలలో నేను కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్లాగు గురించి తెలిసింది. ఇందులోని భక్తుల అనుభవాలు చదవటంతో మళ్లీ నాకు ఒక ఆశ కనిపించింది.
మా తల్లిదండ్రులు, మా బ్రదర్, నేను నా పెళ్లి విషయంగా చాలా రోజులనుండి ఎదురుచూస్తున్నాం. కానీ, జాతక ప్రభావం వలన అది సాధ్యపడలేదు. నేను చాలా రకాల పూజలు చేస్తూ, అందరూ చెప్పే అన్ని గుళ్ళకు వెళ్తూ ప్రార్థిస్తుండేదాన్ని. అయినా కూడా పరిస్థితి మారలేదు. అలా ఉండగా, ఏప్రిల్ నెలలో మా కుటుంబమంతా మా కజిన్ పెళ్లికి వెళ్లాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు చేసుకుని అంతా సవ్యంగా నడుస్తుండగా, టికెట్స్ కూడా బుక్ చేసాక మేము ఆగిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను అనుకోకుండా బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! మేము పెళ్లికి హాజరయ్యేలా ఏదైనా మిరాకిల్ చేయండి" అని ప్రార్థించాను. మరుసటిరోజు పెళ్ళి అంటే మేమింకా ఇంట్లోనే ఉన్నాము. అక్కడికి చేరుకోవాలంటే రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం మూడుగంటల సమయానికి కూడా పెళ్ళికి వెళ్లే ఆశ కనపడలేదు. "బాబా! ఏదైనా మిరాకిల్ చేయండి" అని నేను ఏడ్చాను. బాబా మిరాకిల్ మొదలయింది. అకస్మాత్తుగా మా బ్రదర్ బయటనుండి వచ్చి, "బ్యాగులు సర్దుకోండి, నేనే కారులో పెళ్ళికి తీసుకువెళ్తాను" అని చెప్పాడు. ఆ మాట వింటూనే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అసలు ముఖ్యంగా తనకే ఆ పెళ్ళికి వెళ్లడం ఇష్టంలేదు. అందుకే మమ్మల్ని వెళ్లనివ్వకుండా ఆపాడు. కానీ బాబా అద్భుతం చేసి మమ్మల్ని పెళ్ళికి తీసుకుని వెళ్లారు. అసలు మా బ్రదర్ ముందు ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటంటే, అక్కడ పెళ్ళి కాబోతున్న మా కజిన్ నాకంటే వయసులో చిన్నది. కానీ నాకు పెళ్ళి కుదరకుండానే తనకి పెళ్ళి అయిపోతోంది. ఆ కారణంచేత మా బంధువులంతా మమ్మల్ని అదే విషయం అడిగి ఇబ్బంది పెడతారని మేము అక్కడికి వెళ్లడానికి తను ఇష్టపడలేదు. ఏదేమైనా మొత్తానికి బాబా ఆశీస్సులతో అంతా సవ్యంగా జరిగింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశారు. మీ బిడ్డలందరినీ చల్లగా చూసుకోండి. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములతో పాటు శాంతిని ప్రసాదించండి".
తరువాత కజిన్ పెళ్ళిలో మాకు ఒక అబ్బాయితో, అతని కుటుంబంతో పరిచయమైంది. రెండు కుంటుంబాలు కలిసి మాట్లాడుకున్నాక మేము ఇంటికి తిరిగి వచ్చేసాం. ఒక వారం తర్వాత నేను నవగురువార వ్రతం మొదలుపెట్టి, "బాబా! గతవారం కలిసిన ఆ అబ్బాయితో నా పెళ్లి నిశ్చయమయ్యేలా ఆశీర్వదించండి" అని ప్రార్థించాను. మొదటివారం పూర్తై, రెండోవారం మొదలయ్యే గురువారంనాడే ఆ అబ్బాయితో నా పెళ్ళి నిశ్చయమైంది. నా సంతోషానికి అవధుల్లేవు. ఆరోజు సాయంత్రం నేను బాబాకు పూజ పూర్తిచేసి ఇంకా బాబా దగ్గరే ఉండగా ఆ అబ్బాయి నుండి మెసేజ్ వచ్చింది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. "బాబా! ఇది మీ మిరాకిలే! మీ అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతుంది" అని అనుకున్నాను. అప్పటినుంచి అన్నీ సాఫీగా జరుగుతూ వచ్చాయి. నేను తనతో, "నాకు సాయిబాబా అంటే ఇష్టం" అని చెప్పాను. అతను కూడా చాలా సంతోషించి, "మేము కూడా బాబాను పూర్తిగా నమ్ముతాము" అని చెప్పాడు. అతను ఆ మాట చెప్పినప్పుడు నాకింకా ఆనందంగా అనిపించింది. అతను ఎవరినైనా అర్థం చేసుకోగల మనసున్న మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి భర్తగా లభించడం నిజంగా అదృష్టం. పెద్దవాళ్ళు అన్నీ మాట్లాడుకుని నిశ్చితార్థం నిర్ణయించారు. ఆరోజు గురువారం అయ్యింది. పెళ్లి తేది కూడా గురువారంనాడే రావడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ఇలా అంతా సక్రమంగా జరుగుతుండగా, హఠాత్తుగా మా రెండు కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థలు ఏర్పడి పెళ్ళి ఆగిపోయింది. కానీ నేను పూర్తి నమ్మకంతో అంతా బాబాకి విడిచిపెట్టాను. త్వరలోనే ఆయన అన్నీ సరిచేసి నా పెళ్ళి జరిపిస్తారు. త్వరలో ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నిశ్చితార్థంతో బాబా ఇప్పుటికే మమ్మల్ని కలిపారు. పెళ్ళి కూడా ఆయనే జరిపించి, మమ్మల్ని శిరిడీకి రప్పించి ఆశీర్వదిస్తారు. "అన్నిటికీ మీకు ధన్యవాదాలు బాబా! నన్ను, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ మీ భక్తులకు తోడుగా ఉండి అందరినీ సంతోషంగా ఉంచండి".

సాయిరాం ..ఆ అమ్మాయి కి బాబా పై గల నమ్మకానికి జోహార్లు
ReplyDeleteSubham. Mi nammakam satyam, Sai saranam
ReplyDelete🕉 sai Ram
ReplyDelete