సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

వర్షాన్ని ఆపి పూజకి ఆటంకం లేకుండా చేసారు బాబా.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఉత్తర భారతదేశం నుండి పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సాయిభక్తురాలి అనుభవం:

నేనొక 51 సంవత్సరాల గృహిణిని. మాది ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలో దాదాపు అందరూ బాబా భక్తులే. మహాపారాయణ గ్రూపులో చేరినప్పటినుండి బాబాపట్ల నా భక్తివిశ్వాసాలు ఇంకా ఇంకా బలపడ్డాయి. బాబా ఆశీస్సులతో నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

మేము చాలాకాలంగా అమ్మవారి పూజ ఒకటి చేయాలని అనుకుంటున్నాం. కానీ ఏవో కొన్ని కారణాలతో అది వాయిదాపడుతూ వచ్చింది. ఇక ఇలా లాభంలేదని భారీవర్షాలు పడుతున్నా లెక్కచేయకుండా ఎలాగైనా పూజ చేయాలని నిర్ణయించుకున్నాం.  అప్పటికే వారంరోజులుగా ఆగకుండా వర్షాలు పడుతున్నా, రెండు రోజుల్లో పూజ పెట్టుకున్నాం. రేపు పూజ అనగా ముందురోజు కూడా ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. పూజకి చాలామంది అతిథులను ఆహ్వానించినందువల్ల ఆరుబయట ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాగానీ మనసులో, "అంతమందిని ఆహ్వానించాము, ఈ వర్షాల కారణంగా వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో"నని చాలా ఆందోళనపడుతూ బాబా భక్తురాలినైన నేను, "వచ్చే అతిథులకు ఇబ్బంది కలగకుండా చూడండి బాబా" అని ప్రార్థిస్తూనే ఉన్నాను. "కనీసం పూజ చేసే సమయంలోనైనా (మధ్యాహ్నం 3:30 నుండి 7:30 వరకు) వర్షం కురవకుండా ఉండేలా అనుగ్రహించండి బాబా" అని గట్టిగా ప్రార్థించాను. ఆరోజు ఉదయం కూడా వర్షం పడుతోంది. నేను ఆపకుండా బాబా నామం స్మరిస్తూనే ఉన్నాను. ఆశ్చర్యం! నేను కోరుకున్నట్లుగా 3:30 అయ్యేసరికి పూర్తిగా వర్షం నిలిచిపోయింది. 7:15 వరకు వర్షం లేనేలేదు. తర్వాత కూడా చిన్న తుంపర మాత్రమే కురిసింది. అతిథులందరూ ఎటువంటి ఇబ్బందీ పడకుండా భోజనాలు చేసుకుని వెళ్ళారు. ఇది నా బాబా చేసిన అద్భుతం. అంత భారీవర్షాల మధ్యలో నేను పూజ పెట్టుకున్నప్పటికీ బాబా పూజ సమయానికి  వర్షాన్ని ఆపుచేసి మాకు ఏ ఆటంకం కలగకుండా చూసుకున్నారు. ఆయనకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకోలేను. ఎందుకంటే, మా జీవితాల్లో ఆయన అడగకుండానే ఎన్నో ఇచ్చారు. కేవలం 'థాంక్స్' అనే చిన్న మాట ఆయన చేసిన దానికి సరిపోదు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo