ఈరోజు భాగంలో అనుభవాలు:
- హస్తస్పర్శతో తలరాతను మార్చి పునర్జన్మను ప్రసాదించిన బాబా
- జన్మదినాన్ని ముందుగా సూచించిన బాబా
హస్తస్పర్శతో తలరాతను మార్చి పునర్జన్మను ప్రసాదించిన బాబా
ఓం
శ్రీ సాయినాథాయ నమః. నా
పేరు మోదడుగు వాసు. నేను నెల్లూరు నివాసిని. అసలే షుగర్, బి.పి పేషంటునైన నేను హఠాత్తుగా 2013,
నవంబర్ 25న తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను. 102డిగ్రీల జ్వరంతో నెల్లూరులోని వైద్యుడిని సంప్రదిస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. మందులతో జ్వరం తగ్గడం, మరలా పెరగడం, ఇలా రోజులు గడుస్తుండగా జాండిస్(కామెర్లు) కూడా అటాక్ అయ్యింది, రక్తశాతం తగ్గిపోయింది. ఏమీ అర్థంకాని పరిస్థితి. సాయిబాబా భక్తుడనైన నేను
ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత,
రాత్రి టిఫిన్ చేసిన తర్వాత మెడిసిన్ వేసుకుని సాయినాథుని స్మరిస్తూ
నిద్రలోకి జారుకునేవాడిని. అలా ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలో ఉండగా బాబా
దర్శనమిచ్చి, తమ అమృతహస్తాలతో నా నుదుటిపై స్పృశించారు.
తరువాత 7వ రోజు చెన్నైలోని విజయ హెల్త్ సెంటర్కి వెళ్ళాము. డాక్టర్లు పరీక్షించి నా శ్రీమతితో, "పరిస్థితి చాలా విషమంగా
ఉంది. ముందు జనరల్ వార్డులో జాయినవ్వండి. పరిస్థితిలో మార్పు రాకపోతే I.C.U.లో చేర్చాల్సి ఉంటుంది" అని చెప్పారు. నా భార్య, "బాబా! నా భర్తని కాపాడండి" అని దీనంగా ప్రార్థించింది. తరువాత బాబా
దయవలన 9వ రోజుకి నా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఆయన
కృపాకటాక్షములతో త్వరలోనే కోలుకున్నాను. బాబా ఇచ్చిన పునర్జన్మగా భావించి
ప్రతిరోజూ ఆయనకు ధన్యవాదములు తెలుపుకుంటూ, భజనలు, సత్సంగములు చేసుకుంటూ బాబా సేవలో పూర్తిగా తరిస్తున్నాము. ఇప్పుడు మేమెంతో
సంతోషంగా ఉన్నాము. ఆ సాయినాథుని ఆశీస్సులు లేకపోతే నేను లేను. "ధన్యవాదాలు బాబా".
జన్మదినాన్ని ముందుగా సూచించిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. అంతటా ఆయన ఉనికిని అనుభవించేలా నన్ను అనుగ్రహించారు బాబా. 2017లో నేను గర్భవతిగా ఉన్నప్పుడు
నా ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో ఆశలతో, ఆలోచనలతో చాలా ఆనందంగా
ఉన్న సమయంలో మావారు ఆఫీసులో ఉన్న పరిస్థితుల కారణంగా ఉద్యోగానికి రాజీనామా
చేసేసారు. దాంతో నేను ఆందోళనకు గురయ్యాను. తరచూ "బాబా! మావారికి మంచి ఉద్యోగం
ఎప్పుడు వస్తుందో దయచేసి చెప్పండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నేనలా
అడిగిన ప్రతిసారీ బాబా నుండి అనుకూలమైన సమాధానం వస్తూ ఉండేది. ఐతే మధ్యలో ఒకసారి
నేను బాబాని అడిగినప్పుడు, "శ్రీరాముడి పుట్టినరోజున
జన్మిస్తాడు" అని వచ్చింది. బాబా ఏం చెప్తున్నారో నాకప్పుడు అర్థంకాలేదు.
బాబా లీల అది. 2018, మార్చి 25న
శ్రీరామనవమి వచ్చింది. సరిగ్గా ఆరోజే బాబా ఆశీస్సులతో మాకు బాబు పుట్టాడు. అప్పుడు
అర్థమైంది, 'శ్రీరామనవమి రోజు జన్మిస్తాడు' అని బాబా చెప్పిన మాటకు అర్థం. అలా బాబా మా బాబు జన్మదినాన్ని ముందుగానే సూచించారు.
"లవ్ యు బాబా! మీరే నాకన్నీ".
Om sai sree sai jaya jaya sai.
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOm sairam
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDelete