- సాయే దిక్కు
- సాయితండ్రి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు
- నెలసరి వాయిదా పడేలా అనుగ్రహించిన బాబా ఊదీ
సాయే దిక్కు
నేను ఒక సాయిభక్తురాలిని. ఒకసారి మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరం చిన్న చిన్న అనారోగ్యాలకు గురయ్యాము. అవడానికి చిన్నవే అయినప్పటికీ నన్ను మాత్రం అవి చాలా ఆందోళనకి గురిచేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము తప్పనిసరై మా దగ్గరి బంధువుల పెళ్లికి వెళ్ళాల్సి వచ్చింది. “బాబా! ఎలాగైనా మమ్మల్ని వెళ్లకుండా చేయి” అని ఎంత వేడుకున్నప్పటికీ మేము పెళ్ళికి వెళ్లక తప్పలేదు. దాంతో, పెళ్ళికి వెళ్ళడానికి బాబా అనుమతి ఉందని అనుకుని వెళ్లి వచ్చాం. అక్కడినుంచి వచ్చిన రెండు రోజుల తర్వాత మా అమ్మకు జ్వరం వచ్చింది. దాదాపు పది రోజుల వరకు జ్వరం తగ్గలేదు. అమ్మకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ, బాబా ఊదీని నీళ్లలో కలిపి అమ్మకి త్రాగిస్తూ వచ్చాం. 10 రోజుల తరువాత అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాము. అమ్మను పరీక్షించిన డాక్టర్, అమ్మకి జ్వరమేమీ లేదనీ, తనకు షుగర్ ఎక్కువైందనీ చెప్పి వేరే మందులు ఇచ్చారు. బాబా దయవల్ల అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. “సాయీ! నీకు శతకోటి ధన్యవాదాలు”
ఈ మధ్యలో నాన్నకి కూడా ఒకరోజు కాస్త జ్వరం వచ్చింది. కానీ బాబా దయవల్ల త్వరగానే తగ్గిపోయింది. కానీ ఆ తరువాత నుండి ఆయన సరిగా తినటం లేదు. “సాయీ! నాకు నువ్వే దిక్కు. దయచేసి నాన్న త్వరగా కోలుకుని మళ్ళీ ఇంతకుముందులా ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించు. నీ ఆశీస్సులు తప్పక మాపై ఉంచుతావని నేను నమ్ముతున్నాను”.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!
సాయితండ్రి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు
సాయిబంధువులకు నమస్తే! నా పేరు అంజలి. 2021, జనవరి 6వ తేదీ ఉదయం మా బాబుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబుకి ఉదయం నుంచి సాయంత్రం వరకు జ్వరం తగ్గడానికి మందులు వేస్తూనే ఉన్న కానీ, ఆ మందులతో జ్వరం తగ్గినట్టే తగ్గి మరలా వస్తుండేది. అసలు మా బాబు మూసిన కన్ను తెరవకుండా మంచం మీద పడుకునే ఉన్నాడు. నేను ఈ బ్లాగులో ప్రచురిస్తున్న బాబా లీలలను ప్రతిరోజూ చదువుతాను. ఎప్పటిలాగే ఆరోజు బ్లాగు ఓపెన్ చేసి బాబా లీలలు చదువుతుంటే పురంధరే అనుభవం వచ్చింది. అందులో, పురంధరే భార్య ఆరోగ్యపరిస్థితి విషమించినప్పుడు బాబా ఒక ఫకీరు రూపంలో పురంధరేకు దర్శనమిచ్చి ఆమెకు ఊదీతీర్థాన్ని ఇవ్వమని చెబుతారు. బాబా సూచనమేరకు పురంధరే బాబా ఊదీని నీటిలో కలిపి భార్యకు త్రాగించి, ఆమె శరీరమంతా ఊదీని రాస్తాడు. బాబా అనుగ్రహంతో కేవలం ఒక్క గంటలోనే ఆమె పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ పరిస్థితిలో ఆ లీలను చదివిన నాకు బాబా మా బాబుకి ఊదీతీర్థాన్ని ఇవ్వమని చెప్పినట్లు అనిపించింది. దాంతో వెంటనే బాబాను తలచుకుని, కొద్దిగా బాబా ఊదీని నీళ్ళలో కలిపి బాబుకి త్రాగించాను. తరువాత తన ఒళ్ళంతా ఊదీని రాశాను. బాబా అనుగ్రహంతో కేవలం కొద్ది నిమిషాల్లోనే జ్వరం తగ్గిపోయి మా బాబు లేచి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. అది చూసి ఆనందభాష్పాలతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నాకు బాబానే సర్వస్వం. ఎంతో దయామయుడైన మన సాయితండ్రి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. “బాబా! నన్ను, నా కుటుంబంలోని అందరినీ ఇలాగే కాపాడుతూ ఉండు తండ్రీ! దయామయా! నీ లీలలు మధురం”.
అఖిలాండకోటి బ్రహ్మాడనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Sai Ram!!
ReplyDeleteSai can prevent. any thing in our life.we must wait till the time comes.I learn a lesson.He blesses all devotees.sai please be with us.And prevent this corona viruses from the world
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteJai sairam
ReplyDeleteSairam
ReplyDeleteBaba amma problem tondarga cure cheyi thandri
ReplyDeleteSai sai sai
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDelete