- 'నీకు మంచి జరుగుతుంది, నమ్మకముంచి ఓర్పుగా ఉండు!'
- బాబా ఎవ్వరినీ నిరాశపరచరు
'నీకు మంచి జరుగుతుంది, నమ్మకముంచి ఓర్పుగా ఉండు!'
పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగుని నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభవాలను చదువుతాను. నాలో బాబాపై నమ్మకం దృఢంగా పెరగటానికి ఈ బ్లాగ్ కూడా ఒక కారణం. ధన్యవాదాలు సాయీ! నా మనసులో ఉన్న విషయాన్ని మీతో ఎలా పంచుకోవాలో నాకు తెలియటంలేదు. ఇప్పటివరకు నేను అన్ని విషయాలను బాబాకు మాత్రమే చెప్పుకున్నాను. అందరితో పంచుకోవటం ఇదే మొదటిసారి. తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించండి. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. నాకోసం బాబాను ప్రార్థించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను.
11 సంవత్సరాల క్రితం ఒక ఫ్రెండ్ ద్వారా ఫోటో రూపంలో మా ఇంటికి వచ్చారు బాబా. అప్పటినుండి మాకు అన్నీ బాబానే. అప్పటికే మేము ఒక పెద్ద కోర్టు సమస్యలో ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చారు బాబా. ఎన్నో సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవటంలో అండగా నిలిచారు. కోవిడ్‌కు ముందే కోర్టులో ఉన్న ఆ సమస్యను రాజీ చేసుకుని, పెద్దమొత్తంలో డబ్బులు కట్టి మా ఆస్తిని విడిపించుకున్నాము. ఈ విషయంలో మాకెంతో సహాయం చేసినవారికి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మాకు సహాయం చేసిన ఒక అతనికి మా ఆస్తిని అమ్మాలనుకున్నాము. బాబానే ఆయన రూపంలో మాకు సహాయం చేశారని మా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆయనే ఆస్తిని తీసుకోవాలని మా ఆకాంక్ష. అలా జరిగితే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాను. అనుకోకుండా కోవిడ్ వలన మా కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ఆయనే ఆస్తిని తీసుకుంటానన్నారు. కానీ, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయినా బాబాపై నమ్మకంతో ముందుకు నడుస్తున్నాము. ఇప్పుడు మేము ఎంతగానో నమ్మిన ఒక లాయరు ద్వారా, మరో ముగ్గులు వ్యక్తుల ద్వారా క్రొత్త సమస్య వచ్చింది. మాకు నమ్మకద్రోహం చేసిన వీళ్ళ గురించి నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. ఎందుకో ఈ సమయంలో బాబా మౌనంగా ఉన్నారు. అయితే, నాకు ధైర్యం కలిగించేలా, ‘నమ్మకం ఉంచు’, ‘నీకు మంచి జరుగుతుంది’, ‘ఓర్పుగా ఉండు’ అనే బాబా మెసేజెస్ కొన్ని వస్తున్నాయి. బాబానే నమ్ముకునివున్నాము. ఆయన తప్ప మాకు ఎవ్వరూ సహాయం చేయలేరు. అన్ని విషయాలూ బాబాకు తెలుసు. “ప్లీజ్ బాబా! మేము మాట్లాడే ప్రతి మాటా నువ్వే మాట్లాడించాలి. మేము వేసే ప్రతి అడుగూ నువ్వే వేయించాలి. మమ్మల్ని ఈ సమస్య నుంచి నువ్వే బయటపడేయాలి. ఆస్తిని రిజిస్టర్ చేసి అందరి అప్పులు తీర్చాలి. మాకు సహాయం చెయ్యి బాబా. మీ అనుగ్రహంతో మా సమస్య తీరి నేను సంతోషంగా ఈ విషయాన్ని మళ్ళీ బ్లాగులో పంచుకోవాలి”.
బాబా ఎవ్వరినీ నిరాశపరచరు
సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
నా వెనుకనున్నది ఎవరో కాదు, సాక్షాత్తూ ఆ శిరిడీ సాయినాథుడు. నా ఊపిరి, నా సర్వస్వం ఆయనే. ముందుగా ఆ సాయినాథునికి నా ప్రణామములు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకు నా నమస్కారములు. నా పేరు లక్ష్మి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
మేము చాలారోజులుగా మా అబ్బాయి కోసం ఒక స్థలం కొనాలని ప్రయత్నిస్తున్నాము. ఎంతగా ప్రయత్నించినప్పటికీ మా కోరిక నెరవేరలేదు. అప్పుడు నేను నా మనసులోని కోరికను బాబాకు విన్నవించుకుని, "ఐదు గురువారాలు సాయి దివ్యపూజ చేస్తాన"ని మ్రొక్కుకుని పూజ మొదలుపెట్టాను. మరునాడు ఐదవ గురువారం పూజ ఉందనగా బుధవారంనాడు బాబా మా కోరిక నెరవేర్చారు. అలాగే, మా చెల్లెలి కూతురికి ఉద్యోగం రావాలని ఏడు గురువారాలు సాయి దివ్యపూజ చేయగా బాబా దయవలన తనకు ఉద్యోగం వచ్చింది. నాకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేను సాయినే ఆశ్రయిస్తాను. ఆయన నా ప్రతి కష్టాన్నీ ఇట్టే పరిష్కరిస్తూ నాపై అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు. "ధన్యవాదాలు సాయినాథా! తండ్రీ! నీ చల్లని దీవెన ఎల్లప్పుడూ అందరిమీదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను". భక్తుల కోరికలను తీర్చే కరుణామయుడు సాయి. ఆయన ఎవ్వరినీ నిరాశపరచరు.
ఓం సాయిరాం!
om sai very good sai leela.baba only struggles nudi rashistaru.aa nammkamu naaku uddidi.om sree sai ram
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sairam
ReplyDeleteBaba amma ki problem cure cheyi thandri pleaseeee sai sai sai sai
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDelete