సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 646వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. సకాలంలో నా డిగ్రీ పూర్తయ్యేటట్టు ఆశీర్వదించారు బాబా
  2. బాబా నాతోనే, నాకు తోడుగా ఉన్నారు


సకాలంలో నా డిగ్రీ పూర్తయ్యేటట్టు ఆశీర్వదించారు బాబా


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ముందుగా, ఈ బ్లాగును ఇంత చక్కగా నడిపిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఈ బ్లాగ్ వలన నేను బాబాకు చాలా దగ్గరయ్యాను. బ్లాగులో వచ్చే బాబా సందేశాల వలన బాబాపై విశ్వాసం, నమ్మకం పెరిగాయి. బాబా నా జీవితంలోకి వచ్చిన తరువాత ఎన్నో అద్భుతాలను చేశారు. నన్ను సంస్కరించి ధర్మం వైపు నడిపిస్తున్నారు. బాబా కృపకు పాత్రురాలైనందుకు నేనెంతో ధన్యురాలిని. 2020, డిసెంబరు 12వ తేదీన నాకు కలిగిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 


నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు బాబా నా జీవితంలోకి వచ్చారు. అప్పటినుండి నేను బాబా కృపను తెలుసుకుంటూ ఉన్నాను. బాబా దయవలన డిగ్రీ రెండవ సంవత్సరం మరియు చివరి సంవత్సరం పరీక్షల్లో చక్కని విజయం సాధించాను. అయితే, నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు జరిగిన రెండవ సెమిస్టరు పరీక్షల్లో నేను ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యాను. ఆ సబ్జెక్టులో రెండవసారి పరీక్ష రాసినా పాస్ కాలేకపోయాను. బాబా దయవలన ఈ సంవత్సరంలో (డిగ్రీ చివరి సంవత్సరంలో) మళ్ళీ ఆ పరీక్ష వ్రాయడానికి సిద్ధమయ్యాను. “ఎవరైతే కష్టపడి పనిచేస్తారో పాలకుండతో నేను వారివద్ద ఉంటాను. కష్టపడకుండా బాబా ఉంటారని ఆశించవద్దు” అని బాబా చెప్పారు కదా! అందువల్ల నేను పరీక్షకు బాగా ప్రిపేరై వెళ్ళాను. అడుగడుగునా బాబా తన నిదర్శనాలను నాకు చూపించారు. కానీ, పరీక్ష పేపరు చాలా కఠినంగా వచ్చింది. నేను మళ్ళీ పెయిలవుతానేమో అనుకున్నాను. పరీక్ష పేపరు కఠినంగా వచ్చినప్పటికీ బాబాపై నమ్మకంతో ధైర్యంగా పరీక్ష వ్రాశాను. కొద్ది రోజుల తరువాత, డిసెంబరు 12వ తేదీన పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. పరీక్షా ఫలితాలు తెలుసుకుందామని వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ఎంతసేపైనా లింక్ ఓపెన్ కాలేదు. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “వెబ్‌సైట్ ఓపెన్ అయి నేను పాసైతే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన”ని అనుకున్నాను. ఆ తరువాత కొద్దిసేపటికే వెబ్‌సైట్ ఓపెన్ అయింది. అలాగే నేను పాసయ్యాను కూడా. నేను ఈ పరీక్ష ఫెయిలై వుంటే నాకు ఈ సంవత్సరం డిగ్రీ సర్టిఫికెట్ రాదు. దీనివలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక సంవత్సరం కూడా వృధా అవుతుంది. అదే ఆలోచనతో నేను ఎంతో భయపడ్డాను. అయినప్పటికీ, బాబాపై ఉన్న భక్తివిశ్వాసాల కారణంగా నేను పాసవుతాననే నమ్మకం ఉండేది. నేను నమ్మకం పెట్టుకున్నట్లే సకాలంలో నా డిగ్రీ పూర్తయ్యేటట్టు చేశారు బాబా.


నా డిగ్రీ చివరి సంవత్సరంలో జరిగిన అయిదవ సెమిస్టర్ పరీక్షల సమయంలో కూడా నేను మానసికంగా ఎంతో కృంగిపోయి ఉన్నాను. కేవలం బాబా దయవల్ల మాత్రమే ఆయనపై భారం వేసి పరీక్షలు వ్రాశాను. ఆ పరీక్షా ఫలితాల గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్‌సైట్‌లో బాబాను అడిగితే, ‘నీవు పరీక్ష పాసవుతావు’ అని సమాధానం వచ్చింది. నేను పరీక్షలు అంత బాగా వ్రాయనప్పటికీ కేవలం బాబా దయవల్లనే నేను డిగ్రీ పాసయ్యాను. “మీకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”


బాబా నాతోనే, నాకు తోడుగా ఉన్నారు

తెనాలి నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ సాయిరాం! ఈ సాయిభక్తుల అనుభవాల బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. మాది తెనాలి. మాకు సర్వస్వం బాబానే. బాబా నన్ను, నా భర్తను దగ్గరుండి నడిపిస్తూ కాపాడుతున్నారు. ఆ తండ్రి దయ లేకపోతే మనం ఏం చేయగలం? ఆయన దయవల్ల నేను ఎన్నో సమస్యల నుండి బయటపడ్డాను. నా వివాహ సమయంలో బాబా నాకెంతో సహాయం చేశారు. వివాహమయ్యాక నేను అత్తవారింటికి వెళుతున్నప్పుడు, "నాకు తోడుగా ఉండమ"ని బాబాను ప్రార్థించాను. అత్తవారింటికి వెళ్ళగానే ఫోటో రూపంలో నాకు దర్శనమిచ్చారు బాబా. అంతేకాదు, అక్కడ చుట్టాల ఇంట్లో కూడా బాబా దర్శనమిచ్చారు. ఆవిధంగా బాబా నాతోనే, నాకు తోడుగా ఉన్నానని నిదర్శనమిచ్చారు.

అయితే మా కాపురంలో ఏర్పడిన అవాంతరాలను చూసి నేనెంతో భయపడ్డాను. ఆ సమస్యల నుండి ఒడ్డెక్కించి నన్ను నా భర్త దగ్గరకు క్షేమంగా చేర్చారు బాబా. వివాహమైన తరువాత నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. దాంతో నేను విజయనగరంలోని మా పుట్టింటికి వచ్చాను. నా అనారోగ్యం కారణంగా తిరిగి మావారి దగ్గరకు వెళ్లలేనేమోనని నేను చాలా ఆందోళన చెంది, "నన్ను క్షేమంగా నా భర్త వద్దకు చేర్చి, నా ఆరోగ్య సమస్యను పరిష్కరిస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత ఒకరోజు విజయనగరం నుండి తెనాలి బయలుదేరాను. అనుకున్నట్లుగానే సమయానికి నన్ను తెనాలి చేర్చారు బాబా. విజయనగరంలో ఉన్నప్పుడు, అలాగే తెనాలి వచ్చాక కూడా బాబానే ఎంతో కృపతో నా ఆరోగ్య సమస్యను తగ్గించారు. బాబా ఎల్లప్పుడూ మనతో ఉంటారు. మనకు శ్రద్ధ, సబూరి ఉండాలి. “ఈ అనుభవం పంచుకోవడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా! ఇప్పుడు నేను చిత్రమైన బాధలో ఉన్నాను. ఆ బాధవల్ల మరియు నాకు, మావారికి ఉన్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల చాలా సమస్యగా ఉంది బాబా. ప్రస్తుతం మావారు జ్వరంతో బాధపడుతున్నారు బాబా. నా ఈ సమస్యలన్నిటినీ మీరే తీర్చగలరు. దయచేసి నన్ను ఆశీర్వదించండి బాబా. నా తప్పులేమైనా ఉంటే నన్ను మన్నించి సత్వరమే ఆదుకోవా బాబా! మాకు అన్నీ నువ్వే కాదా నా తండ్రీ! నన్ను ఆశీర్వదించి కాపాడు బాబా! నీ దయ మాపై నిరంతరం వర్షించనీ తండ్రీ!”



4 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Om sai ram helped us taking care. My self husband, daughter-in-law. Suffered from Flu fever after taking vaccine. With baba blessings we all became with normal health. He saves his devotees with love and affection

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri problem cure cheyi thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo