- ‘నీకు నేనున్నాను’ అంటూ సదా వెంట ఉండే బాబా
- బాబా దయవల్ల తొలగిన కిడ్నీలో రాళ్లు
‘నీకు నేనున్నాను’ అంటూ సదా వెంట ఉండే బాబా
నా పేరు విజయ సాయి. నా చిన్నతనంనుండి నాకు సాయితో ఉన్న అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరిస్తున్న బాబాకు నా పాదాభివందనాలు.
నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు. నా చిన్నతనంలో మా నాన్నగారు నన్ను భీమునిపట్నం పాఠశాలలో 5వ తరగతిలో చేర్పించారు. అప్పటికి నాకు సాయిబాబా గురించి తెలియదు. భీమిలిలో మా ఇంటినుండి స్కూలుకి వెళ్ళే దారిలో బాబా గుడి ఉండేది. ఆ గుడిలో నా స్నేహితురాలు, తన తల్లిదండ్రులు బాబాకు నిత్యపూజలు చేస్తూ బాబా సన్నిధిలో ఉండేవారు. నా స్నేహితురాలు ఒకరోజు నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చింది. ఆ ఫోటోను నేను చదువుతున్న పుస్తకంలో పెట్టుకున్నాను. నేను చదువుకుంటున్నది మిషనరీ పాఠశాల కావడం వలన నాలో కొద్దిగా క్రైస్తవభావాలు ఉండేవి. కానీ ప్రతి గురువారం నేను బాబా గుడికి వెళ్ళేదానిని.
10వ తరగతి పూర్తయిన తరువాత ఇంటర్మీడియట్ కోసం విజయనగరం కాలేజీలో చేరాను. మొదటి సంవత్సరమంతా ఏదో అలా గడిచిపోయింది. మార్కులు కూడా కేవలం పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి. చాలా బాధ కలిగింది. నాకు ఇంతకుముందెప్పుడూ అంత తక్కువ మార్కులు రాలేదు. అప్పుడు ఒకసారి ఒక స్నేహితురాలితో కలిసి అనుకోకుండా విజయనగరంలోని బాబా గుడికి వెళ్ళి, నా మనస్సులో అప్పటివరకు ఉన్న క్రైస్తవభావాలను పూర్తిగా విడిచిపెట్టి బాబానే పూర్తిగా నమ్మాను. ఇంక అక్కడినుండి నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనా నాకు అద్భుతంగానే అనిపించేది.
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు మొదటి సంవత్సర బెటర్‌మెంట్ పరీక్షల్లో ఊహించని విధంగా మార్కులు పెరిగి కాలేజ్ అంతా కూడా నా పేరు తెలియటం జరిగింది. ఇది ఖచ్చితంగా బాబా నా మీద చూపించిన దయే. తరువాత బాబా దయవల్ల ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోను, డిగ్రీలోను చక్కని ఫలితాలు సాధించాను. ఆ వెంటనే బాబా దయతో నాకు బి.ఇడిలో సీటు వచ్చింది. బి.ఇడి పూర్తయ్యాక M.Scలో చేరాను. M.Sc చదువుతుండగానే బాబా దయతో నేను కోరుకున్నవ్యక్తితో నా వివాహం జరిగింది. అతనిది ప్రైవేటు ఉద్యోగం. ఇద్దరం అప్పటికి ఇంకా స్థిరపడలేదు. ఇంతలో నేను గర్భవతినయ్యాను. నా చదువు ఇంకా పూర్తి కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. తెలియని భయం, ఆందోళన ఉండేవి. భారమంతా బాబాపై వేశాను.
ఇంతలో DSC నోటిఫికేషన్ వెలువడింది. బాబానే వెన్నుతట్టి ముందుకు నడిపించి నన్ను DSCకి ప్రిపేర్ చేయించారు. నేను ప్రైమరీ స్కూల్, హైస్కూల్ ఉద్యోగాలకు రెండింటికీ దరఖాస్తు చేశాను. కానీ హైస్కూల్ ఉద్యోగానికి పోస్టులు తక్కువగా ఉండటం వలన కేవలం ప్రైమరీ పోస్టుకే ప్రిపేర్ అయ్యాను. నేను 3వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆటంకం కలుగకుండా బాబా నా చేత పరీక్షలు వ్రాయించారు. నేను 8వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు పరీక్షా ఫలితాలు వచ్చాయి. అద్భుతం! బాబా నేను ఊహించినదానికంటే నాకు ఎక్కువే ఇచ్చారు. నాకు హైస్కూల్ టీచరుగా ఉద్యోగం వచ్చింది. తరువాత బాబా కృపతో బంగారం లాంటి పాపను మాకు ప్రసాదించారు. ఈ విధంగా మమ్మల్ని జీవితంలో స్థిరపడేలా చేసిన బాబాకు ఎన్నిసార్లు నా పాదాభివందనాలు సమర్పించినా నాకు తనివితీరదు.
ఆ తరువాత మా పాపకు అవసరమైన సమయంలో నన్ను పట్టణ ప్రాంతానికి బదిలీ చేయించారు బాబా. మా పాప ఇంటర్మీడియట్ చదువుతుండగా చిన్న చిన్న అనారోగ్యాల కారణంగా తన చదువు విషయంలో చాలా ఆందోళన చెందాము. చివరకు బాబానే సర్వస్యశరణాగతి కోరాము. బాబా దయవలన పాప 2020, అక్టోబరులో ఢిల్లీ ఐఐటీలో తనకు నచ్చిన బ్రాంచిలో సీటు పొందింది. నాకు వచ్చిన ప్రతీ సమస్యను బాబాకు నివేదించగానే, ‘నీకు నేనున్నాను’ అంటూ వెంటనే పరిష్కరిస్తారు బాబా.
ఈ విధంగా కరుణామూర్తియైన బాబా సర్వకాల సర్వావస్థలయందునూ తన కరుణ, దయ, కృప, కటాక్షాలను మా కుటుంబం పట్ల చూపునట్లు అందరిపైనా చూపాలని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటూ..
సర్వేజనాః సుఖినోభవంతు.
బాబా దయవల్ల తొలగిని కిడ్నీలో రాళ్లు
నా పేరు షర్మిల. మా బాబుకి గత నాలుగు నెలల నుండి పొట్టలో బాగా నొప్పి వస్తుండేది. చాలామంది డాక్టర్లకి చూపించినప్పటికీ నొప్పి తగ్గలేదు. చివరికి ఒక డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళినపుడు ఆ డాక్టర్ "స్కానింగ్ చేయిద్దామ"ని అన్నారు. నాకు చాలా భయమేసి, "బాబా! బాబుకి ఏమీ కాకూడదు. అంతా బాగుండాలి" అని బాబాను వేడుకున్నాను. స్కానింగ్ చేయిస్తే, 'కిడ్నీలో రాళ్లు ఉన్నాయి' అని రిపోర్టు వచ్చింది. నేను బాబాను ఒక్కటే కోరుకున్నాను, "బాబా! మా బాబు కిడ్నీలో ఉన్న రాళ్లు బయటకి వచ్చేయాలి. మా బాబు ఆరోగ్యం కుదుటపడాలి" అని. తరువాత నేను రోజూ బాబాకు ఆరతి ఇచ్చి, మా బాబుకి ఊదీనీళ్లు ఇస్తూ వచ్చాను. సాయి దయవల్ల బాబు కిడ్నీలో ఉన్న రాళ్లు కొన్ని కరిగిపోయాయి, కొన్ని బయటకు వచ్చాయి. మా బాబు ఆరోగ్యం కుదుటపడింది. బాబుకి సీటీ స్కాన్ చేయిస్తే, ‘కిడ్నీలో రాళ్లు లేవ’ని రిపోర్టు వచ్చింది. కానీ అప్పుడప్పుడు బాబుకి పొట్టలో నొప్పి వస్తోంది. అది కూడా త్వరలోనే బాబా దయవల్ల తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి.

om sai baba
ReplyDeleteOm sairam
ReplyDeleteJai Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sairam
ReplyDelete619 days sai
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sai ram baba please amma ki tondarga cure cheyi thandri
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sei Sai
Om Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏
ReplyDelete