ఈ భాగంలో అనుభవాలు:
- నిర్బంధాల నుండి విముక్తి - బాబా నీడలో ఆశ్రయం
- బాబా ఆశీస్సులతో ఇంటర్వ్యూకి లెటర్ వచ్చింది
నిర్బంధాల నుండి విముక్తి - బాబా నీడలో ఆశ్రయం
హైదరాబాదు నుండి శ్రీమతి మాధవీరెడ్డి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి ఓం సాయి! నా పేరు మాధవి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో నుండి కొన్నింటిని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దాదాపు 10 సంవత్సరాల క్రితం చిన్నజీయర్ స్వామివారి నుండి చక్రాంకితం స్వీకరించాను. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత, స్వామి భక్తులు నాతో, "చక్రాంకితం స్వీకరించిన తరువాత శ్రీమన్నారాయణుని తప్ప వేరే దైవాన్ని ప్రార్థించకూడదు" అని చెప్పారు. ఈ మాటలు నాలో కలవరాన్ని రేపాయి. నాకు ఏం జరుగుతోందో అసలు అర్థం కాలేదు. నేనెంతో కలత చెందాను, బాధపడ్డాను. ఒకరోజు ఈ సమస్యకి పరిష్కారం చూపమని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. ఆ తరువాత బాబా మందిరానికి వెళ్ళాను. బయలుదేరేటప్పుడు టైం ఎంతయిందో నేను చూసుకోలేదు. మందిరానికి చేరుకునేటప్పటికి సమయం మధ్యాహ్నం 1:10 అయింది. సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకి మందిరం మూసివేస్తారు. నేను కారు పార్క్ చేసి, మందిరం తెరచి ఉందో లేదో చూద్దామని హడావిడిగా పరిగెత్తాను. మందిర ద్వారం వద్దనే నిలబడి ఉన్న పూజారిగారు నన్ను చూసి, తానేదో పనిచేసుకుంటూ ఉండిపోయాననీ, అప్పుడే మందిరం తలుపులు మూయబోతున్నాననీ చెప్పి నన్ను లోపలికి రమ్మని పిలిచారు. దాంతో బాబా నన్ను తమ దర్బారులోకి తిరిగి ఆహ్వానిస్తున్నట్లుగా అనుభూతి చెందాను. తరువాత పూజారిగారు నాకు రెండు చాక్లెట్లు ఇస్తూ, "ఈ చాక్లెట్లు నీ కోసమే వేచి ఉన్నట్లున్నాయి" అన్నారు. ఆ చాక్లెట్లు నన్ను స్వాగతిస్తూ బాబా నాకిచ్చిన బహుమతిగా భావించాను. అప్పటినుండి నాలో ఉన్న అలజడి పూర్తిగా తొలగిపోయింది. నేను నా నిర్బంధాల నుండి విముక్తి పొంది బాబా నీడలో ఆశ్రయం పొందినట్లు అనిపించింది. బాబా ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. "బాబా, నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడండి తండ్రీ!"
మరో అనుభవం:
మా అబ్బాయి, మా అమ్మాయి వాళ్ళు చదువుకునే కాలేజీలలో కొంతమందివల్ల చదువులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళిద్దరికీ తోడుగా ఉండమని నేను బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో మా అబ్బాయి ఫైనల్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణుడై, ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. "మా అబ్బాయికి తోడుగా ఉంటూ వాడిని ఆశీర్వదించినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!".
ఇటీవల మా అమ్మాయి తన టీచర్లు పెట్టే ఇబ్బందుల వల్ల కలత చెంది చదువుపై సరిగా దృష్టిపెట్టలేకపోయింది. తను చాలా ఆందోళనచెందేది. నేను సాయివ్రతం, సాయి దివ్యపూజ చేయటం ప్రారంభించాను. బాబా ఆశీస్సులతో తను పరీక్షలు బాగా వ్రాసి తరువాత తరగతికి అర్హత పొందింది. "బాబా! తను ఆత్మవిశ్వాసంతో ఉండేలా, బాగా చదువుకునేలా అనుగ్రహించండి. ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉండండి బాబా".
"బాబా! మీ భక్తులకు ఏది మంచిదో మీకు బాగా తెలుసు. ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటూ మీ సహాయాన్ని అందించండి బాబా. మా కుటుంబంపై మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించండి బాబా!"

బాబా ఆశీస్సులతో ఇంటర్వ్యూకి లెటర్ వచ్చింది
ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నేను బాబాకు చిన్న భక్తురాలిని. ఆయన ఆశీస్సులతో నేను సంతోషకరమైన కుటుంబజీవితాన్ని గడుపుతున్నాను. బాబా నాకు లెక్కలేనన్ని అనుభవాలిచ్చారు. నేను మానసికంగా కృంగిపోయి మనశ్శాంతి కోల్పోయిన ప్రతీసారీ బాబా నాకు ధైర్యాన్నిస్తున్నారు. నేనిప్పుడు నా సోదరుడికి బాబా ఆశీస్సులతో ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చిన అనుభవాన్ని పంచుకుంటాను.
నా సోదరుడు ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటర్వ్యూ తేదీలు వెలువడినప్పటికీ తనకి కాల్ లెటర్ రాలేదు. దాంతో తను చాలా నిరుత్సాహపడి నాకు ఫోన్ చేశాడు. నేను తనతో బాబాని నమ్మమని, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారని చెప్పాను. తరువాత నేను కూడా పగలు, రాత్రి, "బాబా! నా సోదరుడికి ఉద్యోగం చాలా అవసరం, దయచేసి తనకి సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. ఆ విషయమై నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాని అడిగితే, "లెటర్ అందుతుంది, విశ్వాసంతో ఉండమ"ని వచ్చింది. నా సోదరుడు సదరు సంస్థను సంప్రదించాడు. వాళ్ళు "లెటర్ స్పీడ్‌పోస్టులో పంపాము, ఒకటి రెండురోజుల్లో మీకు అందుతుంది" అని చెప్పారు. (కేవలం 3 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ప్రదేశానికి ఆ లెటర్ 25 రోజుల తరువాత వచ్చింది.) కొన్నిరోజుల తరువాత నా సోదరుడు ఇంటర్వ్యూకి పిలవబడ్డ అభ్యర్థుల పేర్లు ఉన్న పి.డి.ఎఫ్. ని నాకు పంపి అందులో తన పేరు లేదని దిగులుగా చెప్పాడు. అయితే నా సాయిపై నాకు ఇంకా విశ్వాసం ఉంది. నేను తనతో సంస్థ డైరెక్టర్‌ను సంప్రదించమని చెప్పాను. తను అలాగే చేసి ఒక విన్నపం వ్రాసి ఇచ్చాడు. మరుసటిరోజు గురువారం నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో మళ్ళీ బాబాను అడిగాను. అప్పుడు, "సాయిబాబా పేరిట వందరూపాయలు ఖర్చు చేయండి. పని జరుగుతుంది" అని వచ్చింది. నేను సాయంత్రం సాయి మందిరానికి వెళ్లి బాబా పాదాల వద్ద వంద రూపాయలు పెట్టి, ఆయన ముందు మోకరిల్లి, ప్రార్థన చేసి ఇంటికి వచ్చాను. రాత్రి 11.30 గంటలకి నా సోదరుడు ఫోన్ చేసి, 'ఇ-మెయిల్ ద్వారా తనకి కాల్ లెటర్ వచ్చింద'ని చెప్పాడు. నేను చాలా సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నాకు తెలుసు, నా బాబా హృదయపూర్వకంగా ప్రార్థించే వారిని ఎప్పుడూ నిరాశపరచరు. "లవ్ యూ బాబా!"
ఓం సాయిరామ్!
Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete