సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 325వ భాగం.


ఖపర్డే డైరీ - పదకొండవ భాగం

19-12-1911

ఉదయం హాయిగా అనిపించి, త్వరగా లేచి ప్రార్థన చేసుకొని మొత్తానికి నేను బాగానే ఉన్నాననుకొన్నాను. నేను ప్రార్థనలో ఉండగానే సాయి మహారాజు బయటకు వెళ్ళటం వల్ల నేను వారి దర్శనం చేసుకోలేకపోయాను. తరువాత నేను మశీదుకు వెళ్ళి వారు చాలా ఉత్సాహంగా ఉండటాన్ని గమనించాను. ఒక ధనవంతుడికి ఐదుగురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారని చెప్పారాయన. వీళ్ళు కుటుంబ ఆస్తిపాస్తులను విభజించుకున్నారు. నలుగురు కొడుకులు స్థిరచరాస్థులలో తమ భాగాన్ని తీసుకొన్నారు. ఐదవ కొడుకూ, కూతురూ వారి భాగాన్ని వారు తీసుకోలేకపోయారు. వారు ఆకలితో తిరుగుతూ సాయిబాబా వద్దకు వచ్చారు. నగలతో నింపిన ఆరు బండ్లు ఉన్నాయట వారికి. అందులో రెండు బండ్లను దొంగలు దోచుకోగా, మిగిలిన నాలుగు బండ్లనీ మఱ్ఱిచెట్టు క్రింద పెట్టారు. కథ ఇక్కడున్నప్పుడు బాబాచే 'మారుతి'గా పిలువబడే త్రయంబకరావు రాకవల్ల అది వేరే మలుపు తిరిగింది. మధ్యాహ్న ఆరతి అయ్యాక నేను బసకి వచ్చి భోజనం చేసి దర్వేష్ షాతో మాట్లాడుతూ కూర్చున్నాను. ఆయన చాలా సరదా మనిషి. వామనరావు పటేలు ఈరోజు వెళ్ళిపోయాడు. రామమారుతి బువా మధ్యాహ్నం వచ్చాడు. భజన సమయంలో గంతులు వేస్తూ చక్కగా నృత్యం చేశాడు. సాయి మహారాజుని సాయంత్రం వేళా, శేజారతి సమయంలోనూ చూశాం. రామమారుతి బువా భీష్మ భజనకు వచ్చి గెంతుతూ నృత్యం చేశాడు. ఈ మధ్యాహ్నం సాయిబాబా నీంగాఁవ్ వైపు వెళ్ళి డేంగలేను కలసి, ఒక చెట్టును కొట్టి వెనక్కి వచ్చారు. సన్నాయి, డోలు మొదలైన వాద్యాలతో చాలామంది వారి వెనుక ఇంటివరకూ తోడుగా వెళ్ళి వచ్చారు. నేను ఎక్కువ దూరం పోలేదు. సాయిసాహెబ్ ను అభినందించేందుకు రాధాకృష్ణబాయి మా వాడా వద్దకు వచ్చింది. పెద్దముసుగు లేకుండా మొట్టమొదటిసారిగా ఆమెను చూశాను.

20-12-1911

నేను చాలా పొద్దున్నే లేచి కాకడ ఆరతికి వెళ్ళాను. ఆరతి అయిపోయే సమయానికి వామనరావుని అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. కోపర్గాం దగ్గర తన బండి నడిపేవాడిని జామపళ్ళు కొనుక్కురమ్మని పంపిస్తే ఎద్దులు పారిపోయాయట. అతను అక్కడంతా తిరిగి చాలా అవస్థపడ్డాడట. ఆ కథ చాలా ఆశ్చర్యం గొలిపింది. సాయి మహారాజు చావడి నుంచి వచ్చే ముందు "అల్లాయే అందరికీ యజమాని” అన్న మాట తప్ప ఎటువంటి మాటా మాట్లాడలేదు. నేను బసకి వచ్చాక నా ప్రార్థనానంతరం సాయి మహారాజు బయటకు వెళుతున్నప్పుడు, మళ్ళీ మశీదుకి తిరిగి వచ్చేటప్పుడు వారిని దర్శించుకున్నాను. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రాత్రి తనని చూసి సాయిబాబా తన కోరికను  అంగీకరించారని దర్వేష్ షా చెప్పాడు. నేను దీన్ని సాయి మహారాజుకి చెప్తే వారేమీ అనలేదు. ఈరోజు నేను సాయి మహారాజు కాళ్ళు ఒత్తాను. వారి కాళ్ళ మృదుత్వం అద్భుతం. మా భోజనం కొంచెం ఆలస్యమైంది. దాని తరువాత ఈరోజు వచ్చిన పేపరు చదువుతూ కూర్చున్నాను. సాయంత్రం మశీదుకి వెళ్ళి సాయిబాబా ఆశీస్సులు తీసుకొని, చావడి ముందు వారికి నమస్కారం చేసుకొని బసకి వచ్చేశాను. భీష్మ భజనకి రామమారుతిబువా వచ్చాడు. దీక్షిత్ రామాయణం చదివాడు.

21-12-1911

నేను మామూలుగా లేచి, ప్రార్థనానంతరం దర్వేష్ సాహెబ్‌తో మాట్లాడుతూ కూర్చున్నాను. తన కలలో తను ముగ్గురమ్మాయిలను చూశాననీ, అందులో ఒక అంధురాలు తన తలుపు తడుతోందని చెప్పాడు. వారు ఎవరని అతడు వారిని అడిగితే వారు తమని తాము సంతోషపెట్టుకొనేందుకు వచ్చామన్నారట. అప్పుడు అతను దెబ్బవల్ల కలిగిన బాధతో బయటకు వెళ్ళమని వాళ్ళని ఆజ్ఞాపించి ఒక ప్రార్థన మొదలుపెట్టాడట. ఆ ప్రార్థనలోని మాటలు వింటూనే ఆ అమ్మాయిలు, ఆ వృద్ధురాలు పారిపోయారట. అప్పుడు అతను ఆ గదిలోనూ, ఇంటిలోనూ ఉన్నవాటినన్నింటినీ, ఆ గ్రామాన్నంతటినీ ఆశీర్వదించాడు. దీనిగురించి సాయిసాహెబ్‌ను అడగమని అతను నన్నడిగాడు. వారు మశీదుకి వచ్చిన తరువాత వారిని చూసేందుకు వెళ్ళి, ఇంకా సరిగ్గా నేను కూర్చోకముందే సాయిసాహెబ్ ఒక కథ మొదలుపెట్టారు. తన మర్మావయవాల మీదా, చేతుల మీదా రాత్రి తననెవరో కొట్టారనీ, వాటికి నూనె పట్టించి, అటూ ఇటూ తిరిగాననీ, మలవిసర్జనానంతరం ధుని దగ్గర తనకు కొంచెం హాయిగా అనిపించిందనీ చెప్పారు. నేను వారి కాళ్ళు పట్టాను. బసకి తిరిగి వచ్చాక ఈ కథను దర్వేష్ సాహెబ్‌కి చెప్పాను. సమాధానం స్పష్టం. మధ్యాహ్న ఆరతి అనంతరం నేను భావార్థ రామాయణం చదువుతూ కూర్చున్నాను. తరువాత సాయి మహారాజును చావడి వద్దా, మళ్ళీ చావడిలో శేజారతప్పుడూ చూశాను. అప్పుడు భీష్మ భజన, రామమారుతి అభినయం జరిగాయి. అటు తరువాత దీక్షిత్ రామాయణం చదివాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. today is sree ramanavami.in shiridi they celebrted very nice.1st experience i liked very much.om sai ram


    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo