సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 383వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అంతులేని ప్రేమను పంచిన సాయి - మూడవ భాగం... 

యు.ఎస్.ఏ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకు ప్రసాదించిన అనుభవాలలో నిన్నటి తరువాయి భాగం:

నా జీవితంలో నేనెప్పుడూ ఊహించని అతిపెద్ద అద్భుతం జరిగింది. మన బాబా ఈ సాధారణ భక్తురాలిపై ప్రేమతో గొప్ప లీల చేశారు. వెనుకద్వారం గుండా వి.ఐ.పి లను లోపలికి పంపుతున్నారు. వాళ్ళు వస్తుండటంతో నేను వాళ్ళకి దారి ఇవ్వడానికి పక్కకి తప్పుకుంటున్నాను. అంతలో సెక్యూరిటీ లేడీ, "నువ్వెందుకు ఇక్కడ నిలుచున్నావు? లోపలికి వెళ్ళు" అని అన్నది. నేను నిర్ఘాంతపోయాను, నా గొంతు మూగబోయింది. ఊహించని ఆ పరిణామానికి నా ఇంద్రియాలు స్తంభించిపోగా లోపలికి అడుగులు వేయడం మొదలుపెట్టాను. హాల్ మధ్యలో ఉన్నందున ఇక నేను బాబాను చూడగలను అనుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాను. అయితే వాళ్ళు ఇంకా ముందుకు తరుముతూనే ఉన్నారు. ఏమి జరిగిందో తెలుసా? మీరు నమ్ముతున్నారా? నేను పూజారి పక్కగా బాబా ముందు నిలబడి ఉన్నాను, వాళ్ళు బాబా కోసం చేసేవన్నీ స్పష్టంగా చూడగలుగుతున్నాను. నేను ఆనందంతో, "బాబా! ఉదయాన నేను ఏదో మాములుగా మీతో, 'ఎప్పుడైనా మీ ముందు నిలబడే అవకాశం నాకు వస్తుందా?' అని అన్నాను. మధ్యాహ్నానికే అది మీరు చేసి చూపించారు. చాలా చాలా ధన్యవాదాలు బాబా" అని ఆయనతో చెప్పుకున్నాను. మనం ప్రేమతో ఏది అడిగినా ఆయన వెంటనే మనకోసం చేస్తారు. ఎంత అమాయక ఫకీరు! మనం 'సాయి, సాయి' అని పలికితే చాలు, ఆయన కడుపు నిండిపోతుంది. ప్రేమతో మనకోసం ప్రతిదీ చేస్తారు. ఆరతి జరుగుతున్నంతసేపూ నేను ఆనందంతో ఏడుస్తూనే ఉన్నాను, ఒక్క పంక్తి కూడా పాడలేకపోయాను. ఆరతి ముగిసిన తరువాత బాబా పాదాలను తాకే అవకాశం కూడా లభించింది. నేను ఇంకా కలో, నిజమో తెలియని పరిస్థితిలోనే ఉన్నాను. తొలి ఏకాదశి అయినందున ఆరోజు బాబా ధరించిన తెల్లని వస్త్రాలు, బిల్వ పత్రాల మాల, బంగారు ఆభరణాల అలంకారం నేను ఈరోజుకీ మరచిపోలేను.

బాబా అనుగ్రహం అక్కడితో ఆగలేదు. నన్ను ఇంకా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నేను నా భర్త, పిల్లలకోసం ద్వారం వద్ద నిలబడి వేచి చూస్తున్నాను. సెక్యూరిటీ గార్డు అందరినీ బయటకు పంపుతున్నారు. నేను అతనితో 'నా కుటుంబంకోసం చూస్తున్నాన'ని ఒక్క మాట చెప్పానంతే. అతను నాతో, "ఇక్కడకు రండి. మీరు బాబాను దర్శిస్తూ ఉండొచ్చు" అని చెప్పాడు. నేను బాబాను చూస్తూ అక్కడే వేచి ఉన్నాను. నాలాగే తమ కుటుంబం కోసం చూస్తున్నామని వేరేవాళ్లు చెబితే, అతను 'వాళ్ళు బయటకు వస్తారు, అక్కడ కలుసుకోండి' అంటూ ప్రతి ఒక్కరినీ చాలా కఠినంగా పంపించేస్తున్నాడు. నన్ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. ఇంతలో సంస్థాన్ కుర్రాళ్ళు వి.ఐ.పి లను ఒక గదిలోకి తీసుకొని వెళ్లి వాళ్ళకి బాబా ప్రసాదం ఇస్తున్నారు. తరువాత ఆ కుర్రాళ్ళు ప్రసాదం పళ్లెంతో బయటకు వచ్చి నన్ను పిలిచి నా చేతిలో ప్రసాదం పెట్టారు. ఆరతి సమయంలో బాబాకు నివేదించిన నైవేద్యం నాకు లభించడంతో నేను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ బయటకు వచ్చాను.

బాబా అనుగ్రహంతో లభించిన చక్కటి దర్శనాలతో తృప్తి చెంది రైలు ఎక్కాము. మాకు కూర్చోవడానికి రెండు సీట్లే వచ్చినందున చిన్న పిల్లలతో ఎలా అని నాన్న టెన్షన్ పడటం ప్రారంభించారు. నేను తనతో, "చింతించకండి. అంతా బాగానే ఉంటుంద"ని చెప్పాను. టి.సి వచ్చి అర్థరాత్రి 12:30 సమయంలో బెర్త్ ఇవ్వగలనని చెప్పాడు. ఇంతలో మా పక్కన ఉన్న ఒక వ్యక్తి తన బెర్త్ మీద సర్దుకోమని అన్నారు. నాన్న కొంచెం ప్రశాంతించారు కానీ పిల్లలకోసం ఆలోచిస్తూ ఉన్నారు. బాబా మాకోసం ఏదైనా ఏర్పాటు చేస్తారని నేను నవ్వుతున్నాను. నాకోసం సాయి ఉన్నారని నాకు తెలుసు కాబట్టి నేనస్సలు ఆందోళన చెందలేదు. అరగంటలో టి.సి మళ్ళీ వచ్చి మా టిక్కెట్లన్నీ కన్ఫర్మ్ అయ్యాయని చెప్పారు. మేము సాయంత్రం 6:00 గంటలకు రైలు ఎక్కాము. అర్థరాత్రి 12:30 కి మాకు సీట్లు వస్తాయని చెప్పినతను, 7:00 కల్లా మా సీట్లు కన్ఫర్మ్ అయ్యాయని చెప్పాడు. అప్పుడు నేను నాన్నతో, "నా సాయి ఏం చేశారో చూశారా?" అని అన్నాను. నాన్న చాలా సంతోషంగా "అంతలా బాబాను ఎలా నమ్ముతావు?" అని అడిగారు. అందుకు నేను, "లేదు నాన్నా, నా నమ్మకమేమీ అంత గొప్పది కాదు. కానీ నా సాయి నన్ను అమితంగా ప్రేమిస్తారు" అని చెప్పాను. చివరిగా నేను బాబాను ఒక విషయం మాత్రం అడిగాను, "బాబా! నాకు అవసరమైనదానికన్నా ఎక్కువే మీరు ఇచ్చారు. కానీ నేను ఈసారి వచ్చేటప్పుడు నాకు పవిత్రమైన మీ అభిషేక తీర్థాన్ని ఇవ్వండి" అని.

చివరిగా మేము యు.ఎస్.ఏ కి తిరిగి ప్రయాణమవ్వాల్సిన రోజు వచ్చింది. బాబా చెన్నైలో అందమైన దర్శనంతో నన్ను స్వాగతించారు. మాకు వీడ్కోలు చెప్పడానికి నా సోదరుని అత్తగారి కుటుంబం కూడా వచ్చింది. ఆమె కేవలం రావడమే కాదు, నాకోసం శిరిడీ నుండి గురుపౌర్ణమినాటి అభిషేక తీర్థాన్ని సీసాలో తీసుకొచ్చింది. నేనింకేమి చెప్పగలను? పదాలు లేవు. బాబా అభిషేక తీర్థాన్ని కూడా ఇచ్చి నన్ను తిరిగి మా ఇంటికి సురక్షితంగా పంపుతున్నారు. నాకు ఇంతకన్నా ఏమి కావాలి? అలా బాబా ప్రేమ, ఆశీర్వాదాలతో నా భారత పర్యటనంతా అద్భుతంగా ముగిసింది.

నేను తట్టుకోలేనంత ప్రేమను బాబా నాపై కురిపించారు. అవి నా జీవితంలో అత్యంత ఉత్తమమైన, మరపురాని రోజులు, క్షణాలు. ఈ అనుభవాల గురించి ఎప్పుడు తలచుకున్నా నేను కన్నీళ్లపర్యంతమై 'బాబా నాపై ఎంత ప్రేమ చూపించారో!' అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు వ్రాస్తూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. బాబా నిజంగా పేద ఫకీరు. ఆయన కపటం లేనివారు. మనం ఆయన్ని 10 శాతం ప్రేమిస్తే, ఆయన మనల్ని 100 శాతం ప్రేమిస్తారు. అసలు మనం తనని ప్రేమిస్తున్నామో లేదో కూడా పట్టించుకోకుండా మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంటారు. ముఖం మీద అందమైన చిరునవ్వుతో ఆయన మనల్ని సదా ఆదరిస్తూ ఉంటారు.

నిజానికి నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవాలని అనుకోలేదు. కానీ బాబా నేను పొందిన అమితమైన ఆనందాన్ని, ఆయన ప్రేమను మీతో పంచుకొనేలా ఎలా చేసారంటే, నేను శిరిడీ నుండి వచ్చిన తరవాత ఒకరోజు ఏదో మాములుగా అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు, 'నేను శిరిడీ వెళ్ళానని, మంచి దర్శనం అయ్యింద'ని తనతో చెప్పాను. తను, "సమయం ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని నాకు పంచండి" అని అడిగారు. ఈ విషయం గుర్తు లేకుండానే అన్నయ్యతో నా అనుభవాన్ని శ్రీరామనవమినాడు పంచుకున్నాను. ఆతరువాత అన్నయ్య శిరిడీ దర్శన అనుభవాలు చదువుతున్నప్పుడు గతంలో అన్నయ్య నన్ను అడిగిన విషయం గుర్తొచ్చి, నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోమని బాబానే అన్నయ్య ద్వారా అడిగారని అర్థమై చాలా సంతోషంగా అనిపించింది. వాస్తవానికి ఆరోగ్యసమస్యల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయట పడటంలో బాబా నాకు ఎలా సహాయం చేసారో అనే అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ నేను నా శిరిడీ అనుభవాలను ముందుగా మీతో పంచుకోవాలని బాబా అనుకున్నారు. అందుకే ఆ అనుభావాన్ని పవిత్రమైన శ్రీరామనవమినాడు వ్రాసేలా చేసి, బ్లాగులో పబ్లిష్ అయ్యేలా చేసారు. తెలుగులో అనుభవాలు చదువుతుంటే బాబా మళ్ళీ నన్ను అశీర్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది.

"బాబా! దయచేసి నా జీవితాంతం ఇలాగే నాతో ఉండండి, నా తదుపరి జన్మలలో కూడా. నేను ఎప్పటికీ మీ భక్తురాలిగా ఉండాలి. నేను గొప్ప భక్తురాలిని కాదు కానీ, దయచేసి ఎప్పుడూ నాతో ఉండండి బాబా. మీ బిడ్డలందరినీ అన్ని అడ్డంకులనుండి రక్షించండి".


7 comments:

  1. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete
  2. om sairam sai blessed that devotee with good darshan in shiridi.that devotee is very very lucky.i want drashan like that.please baba bless me for darshan.om sai ram

    ReplyDelete
  3. Really u r so lucky mam....baba ananthamaina prema nu pondinanduku....jai sai ram

    ReplyDelete
  4. om sairam
    sai always be with me

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

    ReplyDelete
  6. Sai is great great great. I have no words to say his greatness.

    ReplyDelete
  7. SaiNadha!!! Baba prema ilaneyy untundhi meeru so lucky baba varuu eppudhu mitho ,mato andaritho untaru .Evarini badha pettaru

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo