సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 374వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా నాకోసం వచ్చారు - క్షేమంగా మా ఇంటి దగ్గర దింపారు

అందరికీ సాయిరాం! నా పేరు భాను. మాది నిజామాబాద్ దగ్గర ఒక గ్రామం. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో నాలుగింటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో రీసెంట్ అనుభవాన్ని పంచుకుంటాను.

నేను హైదరాబాదులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. కరోనా వైరస్ వల్ల హఠాత్తుగా 2020, మార్చి 22, ఆదివారంనాడు కర్ఫ్యూ ప్రకటించారు. నేను ఆ ఒక్కరోజే కర్ఫ్యూ ఉంటుందనుకున్నాను. 23వ తారీఖునుండి బస్సులు నడవవని నాకు ముందుగా తెలియదు. పైగా ఆఫీసులో కూడా సెలవులు ఇవ్వలేదని నేను ఇంటికి వెళ్ళలేదు. కానీ, 23వ తారీఖున మా సార్ నాకు ఫోన్ చేసి 31వ తారీఖు వరకు ఆఫీసుకి సెలవులని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోదామంటే బస్సులు నడవట్లేదు, పైగా హైదరాబాదులో రోడ్లన్నీ బ్లాక్ చేశారు. దాంతో ఎలా ఇంటికి వెళ్ళాలా అని ఆలోచించసాగాను. ఇంతలో, బాబానే స్వయంగా కారు డ్రైవరుగా వచ్చి తన భక్తురాలిని ఇంటి దగ్గర క్షేమంగా దింపిన ఒక అనుభవం గుర్తొచ్చింది. వెంటనే, సాయిబాబా క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో, “బాబా! నేను ఈరోజు ఇంటికి బయలుదేరాలనుకుంటున్నాను, కానీ రోడ్లన్నీ బ్లాక్ చేశారు. మరి నేను బయలుదేరాలా, వద్దా? అడ్డంకులేమైనా ఉంటాయా?” అని అడిగాను. “పని ప్రారంభించు, మిరాకిల్స్ చూస్తావు” అని సమాధానం వచ్చింది. వెంటనే బాబా మీద భారం వేసి బ్యాగ్ తీసుకుని బయలుదేరి ఒక షేర్ ఆటో ఎక్కాను. కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు బ్లాక్ చేసివుండటంతో ఆటోవాడు అందర్నీ దింపేశాడు. 'ఈరోజు నేను తిరిగి రూముకి వెళ్ళాల్సివస్తుందేమో!' అని నాకు భయమేసింది. అంతలోనే 'బయలుదేరమ'ని బాబా చెప్పారుగా అని ధైర్యంతో ముందుకు నడిచాను. కొంచెం దూరం నడిచాక ఒక అంకుల్‌ని లిఫ్ట్ అడిగాను. ఆయన కాస్త దూరం తీసుకెళ్లి దింపారు. అక్కడనుండి మరొకరిని లిఫ్ట్ అడిగి బోయినపల్లిలో దిగాను. అక్కడ చాలామంది ఊర్లకి వెళ్ళడానికి ట్యాక్సీల కోసం వేచిచూస్తున్నారు. నేను కూడా కారు కోసం వెయిట్ చేయసాగాను. కాసేపటికి పోలీసులు వచ్చి, "ఇక్కడ కార్లు ఆగవు, అందరూ వెళ్ళిపోండి" అని చెప్పి తొందరపెట్టారు. వచ్చిన కార్లన్నీ ఖాళీగా వెళ్ళిపోయిన కాసేపటికి పోలీసులు కూడా వెళ్ళిపోయారు. నేను ఆ చోటునుండి కాస్త దూరంగా వెళ్లి నిలబడ్డాను. ట్యాక్సీలు ఒక్కొక్కటీ వస్తున్నాయి. నిజమాబాద్ వెళ్ళడానికి ఒక్కొక్కరికి 800, 1000 రూపాయలు అడుగుతున్నారు. నా దగ్గర 300 రూపాయలు మాత్రమే వున్నాయి. ఫోన్-పేలో మరో 500 రూపాయలు వున్నాయి. నేను హడావిడిలో డబ్బులు డ్రా చేయడం మర్చిపోయాను. ఇప్పుడెలాగా అని అనుకుంటూ ఉన్నాను. అక్కడ నాకు నిజామాబాద్, కామారెడ్డి వెళ్ళే ఇద్దరు ఆడవాళ్ళు, ఒక తాత పరిచయమయ్యారు. అంత ఎండలో దాదాపు ఒక గంటసేపు వెయిట్ చేశాము. క్యాబ్‌లు ఏవీ రాలేదు. ఒకవేళ వచ్చినా వేరేవాళ్లు ఎక్కి క్యాబ్‌లు ఫుల్ అయి వెళ్ళిపోయాయి. ఎండలో ఇబ్బందిపడుతున్న తాతని చూసి నేను బాబాతో, "బాబా! ఈ తాతని, నన్ను క్షేమంగా ఇంటికి  తీసుకెళ్లు" అని అనుకోగానే ఒక క్యాబ్ వచ్చి మా ముందు ఆగింది. మా కంటే ముందు నిలుచున్న కొందరు అబ్బాయిలు ఆపుతున్నా ఆగకుండా మా దగ్గరికి వచ్చి ఆ కారు ఆగింది. కారు నడుపుతున్న అతను, "ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కండి, నాకు డబ్బులేమీ వద్దు, నేను సరదాగా హైదరాబాద్ చూడటానికి వచ్చాను. ఎక్కండి" అన్నాడు. డబ్బులిచ్చినా ఆ పరిస్థితిలో ఎవరూ ఎక్కించుకోవడం లేదు. అలాంటిది అతను ఫ్రీగా తీసుకెళ్తాను అంటున్నాడు. నేను "నిజామాబాద్ వెళ్ళాలి" అని అన్నాను. అతను "కామారెడ్డి వరకు తీసుకెళ్తాను" అని అన్నాడు. నేను నా మనసులో, 'ముందు వున్న అబ్బాయిలను కాదని మరీ వచ్చాడు. ఎంత డబ్బు అడుగుతాడో' అని ఆలోచిస్తూ, 'అయినా అతను డబ్బేమీ వద్దు అని ముందే చెప్పాడు కదా' అనుకుంటున్నాను. అంతలో నా ప్రక్కన వున్న ఇద్దరు ఆడవాళ్లు, ఆ తాత కారు ఎక్కారు. వాళ్ళతో పాటు నేనూ ఎక్కాను. నేను కామారెడ్డిలో దిగి అక్కడ నుండి వేరే వెహికల్ చూసుకోవాలని అనుకున్నాను. కానీ, కామారెడ్డి వరకు తీసుకెళ్తానని చెప్పినతను నన్ను మా ఊరి వరకు తీసుకొచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ కామారెడ్డిలోనే దిగేసి నిజామాబాద్ వెళ్ళిపోయారు. నన్ను మాత్రం అతను మా ఊరులో దింపేసి వెళ్ళాడు. మేము డబ్బులు ఇవ్వబోయినా అతను తీసుకోలేదు.

'బాబా ఎవరి రూపంలో అయినా వచ్చి నన్ను ఇంటికి తీసుకెళతారు' అని నేను వెయిట్ చేస్తున్న సమయంలో ఆ డ్రైవర్ అంకుల్ రూపంలో వచ్చారు. దారిలో, "నాకు ఆకలేస్తోంది. మీరేమైనా తెచ్చుకుని ఉంటారుగా, ఉంటే ఇవ్వండి. ఉదయం నుండి నేను ఏమీ తినలేదు" అన్నారు. నా బ్యాగులో ఉన్న అరిసె ఒకటి అతనికిచ్చాను. అతను, "నిన్ను తేనె సాయి మందిరంలో చూశాను, ఆ బాబా గుడికి వెళ్తారు కదా" అని అడిగాడు. నిజమే! నాకు ఆ సాయి మందిరంతో చాలా అనుబంధం ఉంది. ఒకప్పుడు ఆ మందిరమే నాకు ఆశ్రయమిచ్చింది, అక్కడి బాబాయే నా కడుపు నింపారు. ఆ అనుభవాలను గతంలో ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. 

(ఆ అనుభవం చదవాలనుకునే వారికోసం ఇక్కడ లింక్ ఇస్తున్నాను. https://saimaharajsannidhi.blogspot.com/2019/03/blog-post_54.html

చూశారా! బాబా నాకోసం వచ్చారు. ఆటోకి ఇచ్చిన 20 రూపాయలు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నన్ను క్షేమంగా మా ఇంటి దగ్గర దింపారు. బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండండి. ఆయన మనకోసం ఖచ్చితంగా వస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయిరాం. నేను తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమిస్తూ నన్ను కన్నతల్లిలా కాపాడుతున్నావు. నేను నీకు ఆజన్మాంతం ఋణపడివుంటాను. భక్తులకోసం ఏ రూపంలో అయినా నువ్వు వస్తావని తెలియజేశావు బాబా".


5 comments:

  1. om sairam
    sai always be with me

    ReplyDelete
  2. om sai namo namaha
    sri sai namo namaha
    jaya jaya sai namo namaha
    sadgugu sai namo namaha

    sarvam sri sai natharpanam

    ReplyDelete
  3. Looking for right solution for your problems? Sai Baba Answers to get precise information for your problems. Tamil Typing offer great answers for all your questions. Sai Baba Live Darshan

    ReplyDelete
  4. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo