ఖపర్డే డైరీ - పధ్నాలుగవ భాగం
30-12-1911
ఉదయ ప్రార్థనానంతరం మా అబ్బాయి అయిన బాబాకి, భావూదురానీకి నేను మరో రెండు నెలల వరకు రాకపోవచ్చునని రెండు ఉత్తరాలు రాశాను. నటేకర్ రాధాకృష్ణఆయీ వద్దకు వెళ్ళాడు. ఆమె అక్కడ లేదు కాబోలు అతనక్కడ కూర్చుని ప్రశాంతంగా, హాయిగా ఉండటంవల్ల రోజంతా అక్కడే గడిపేశాడు. నేను ఉదయం రామాయణం చదివి, మధ్యాహ్నం భాగవతం విని, సాయంత్రానికి కొంచెం ముందే సాయిమహారాజు వద్దకు వెళ్ళాను. వారు నన్ను నా పేరు పెట్టి సంబోధించి, నాతో ఎంతో కరుణ జాలువారేలా మాట్లాడి, సహనం యొక్క విశిష్టతను తెలిపే ఒక చిన్న కథను చెప్పారు. తాను అనేక ప్రదేశాలు తిరుగుతున్న సమయంలో ఒకసారి ఔరంగాబాదు వెళ్ళి మశీదులో కూర్చున్న ఓ ఫకీరును చూశారట. అక్కడ ఒక పెద్ద చింతచెట్టు ఉందట. మొదట ఆ ఫకీరు వారిని ఆ మశీదులోకి అడుగు పెట్టనివ్వలేదట. కానీ చివరికి అందుకు అంగీకరించారట. మధ్యాహ్నం పూట ఒక వృద్ధురాలు ఇచ్చే ఒక రొట్టెమీద ఆధారపడి జీవించేవారట ఆ ఫకీరు. సాయి మహారాజు ఆ ఫకీరు కోసం భిక్ష చేయాలని తనంతట తానే నిర్ణయించుకొని, పన్నెండు సంవత్సరాలు వారికి చాలినంత ఆహారాన్ని సమర్పించుకొంటూ, తరువాత ఆ ప్రదేశాన్ని వదిలేయాలనుకున్నారుట. ఆ వృద్ధఫకీరు కంటివెంట నీరు పెట్టుకొంటే, ఆయన్ని మృదువైన మాటలతో ఓదార్చవలసి వచ్చిందిట. సాయిమహారాజు నాలుగు సంవత్సరాల తరువాత ఆయన్ని మళ్ళీ చూసి ఆయన క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నారట. ఆ ఫకీరు కొద్ది సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చి చావడిలో బస చేశారు. ఫకీరు మంచి చెడులను తల్లిలా చూశారు బాబా. ఆయన చెప్పినదాన్ని బట్టి నేను గ్రహించినదేమిటంటే, సాయిబాబా పన్నెండు సంవత్సరాలు అక్కడ ఉండటానికి కారణం ఔరంగాబాదు ఫకీరుకు బోధ చేసి, అతన్ని పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంచటానికేనని. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి. అక్కడకొచ్చిన నటేకర్ కూడా ఒక అధ్యాయం చదివాడు.
31-12-1911.
నేను చాలా పొద్దున్నే త్వరగా లేచి, ప్రార్థన చేసుకొని, వరండాలో పచార్లు చేస్తుంటే హంస క్రింది అంతస్థులోకి వచ్చి, తను రాత్రి బాగా నిద్రపోలేకపోయాననీ, అటూ ఇటూ తిరుగుతూ ఖండోబా దేవాలయానికి వెళ్ళి, అక్కడనుండి రాధాకృష్ణఆయి ఉంటున్న ఇంటికి వెళ్ళి ఆమె ప్రార్థనలు వినవచ్చునన్న ఆశతో వెళితే అక్కడ అలాంటి ఛాయలేమీ కనిపించలేదని చెప్పాడు. తను గ్రామ సరిహద్దుల్లో తిరుగుతూ ఉన్నాడట. తరువాత వెళ్ళి రాధాకృష్ణఆయిని కలిశాడట. ఆమె ఎంతో దయతో సహాయపడిందట. కాబట్టి అతను స్నానం చేసి బాబా రాధాకృష్ణఆయికి పంపిన ప్రసాదాన్నే ఉదయ ఫలహారంగా తీసుకున్నాడట. అతనితో మాట్లాడుతూ నిలుచున్నాను. రాధాకృష్ణఆయికి వీడ్కోలు చెప్పటానికి మళ్ళీ వెళితే ఆమె అతనికి ఒక ధోవతి, ఒక చొక్కా ప్రసాదంగా ఇచ్చింది. అతను తనతో వచ్చిన ముగ్గురు యువకులతో కలసి వెళ్ళిపోయాడు. అందులో ఒకతని పేరు రేగే. దీనివల్ల నాకు ప్రతి పనీ ఆలస్యమైంది. క్షురకుని వల్ల మరింత ఆలస్యమైంది. సాయిబాబా బయటకు వెళ్ళటం చూశాను, కానీ ఆయన ఎవర్నీ తన దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకోనివ్వలేదు. నేను తరువాత మశీదుకు వెళ్ళి, మధ్యాహ్న పూజకి హాజరయ్యేందుకు అక్కడే కూర్చున్నాను. అంత సమయంలో ఈరోజు మగవారంతా అరుగు క్రింద నిలబడి, మశీదంతా స్త్రీలకే వదలి వేయవలసి వచ్చింది. ఈ ఏర్పాటు చాలా బాగుంది. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడే ఉండటం తటస్థించిన కోపర్గాఁవ్ మామ్లేదారుతో మాట్లాడుతూ కూర్చున్నాను. తరువాత దహనుకు చెందిన దేవ్ మామ్లేదారు వచ్చాడు. ఆరతి ముందు నానాసాహెబ్ చందోర్కర్ వచ్చాడు. ఉదయ ఫలహారం మామూలు ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు చేశాము. దాని తరువాత నేను ఆరోజు వచ్చిన దినపత్రికలు చదువుతూ కూర్చున్నాను. సాయంత్రం నేను మశీదుకు వెళ్ళాను గానీ సాయి మహారాజు 'ఊదీ' వెంటనే ఇచ్చేశారు. అందుకని నేను అప్పుడు కడుతున్న కొత్త భవనంలో గోవర్థనదాసుతో వచ్చిన గుజరాతీ శాస్త్రితో మాట్లాడుతూ కూర్చున్నాను. సాయిమహారాజు బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి శేజారతి సమయంలోనూ మేం నమస్కరించుకున్నాం. అప్పుడు భీష్మ భజనా, దీక్షిత్ రామాయణమూ జరిగాయి.
తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm Sri sairam������
ReplyDeleteOm Sri sairam 🙏🙏🙏
ReplyDelete