- సాయినాథుడే రక్ష
- అంతా బాబా దయ
సాయినాథుడే రక్ష
సాయిభక్తుడు కృష్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని, తన అభిప్రాయాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పరాత్పర గురువైన సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ, సాయినాథుడు చూపిన మరో మహత్యాన్ని వివరిస్తున్నాను. నా పేరు కృష్ణ. కొన్ని రోజుల క్రితం వికారంతో వాంతులవటం, ఆహారం సహించకపోవడం, నీరసం మొదలైన లక్షణాలతో మా అమ్మగారు బాధపడ్డారు. నా స్నేహితుడు ఒక వైద్యుడు. నేను కూడా వైద్యసంబంధమైన వృత్తిలోనే ఉన్నాను. నా స్నేహితుడు మా అమ్మకి వైద్యం చేస్తున్నాడు. కానీ నేనెప్పుడూ నా స్నేహితుడు వైద్యం చేస్తున్నాడని అనుకోను, నా స్నేహితుని ద్వారా ఆ సాయినాథుడే వైద్యం చేస్తున్నాడని ప్రగాఢంగా విశ్వసిస్తాను. అది నిజం కూడా. నేను ఎన్నో సందర్భాల్లో దీన్ని అనుభవించాను. వైద్యం జరుగుతున్నప్పటికీ రెండు మూడు రోజులైనా అమ్మ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ రావటం లేదు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎంతో భయంతో చాలా దారుణంగా ఉండేది నా పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సాయినాథుని దయవల్ల నేను చాలా ప్రశాంతంగానూ, ఆయన మీద పూర్తి విశ్వాసంతో ధైర్యంగానూ ఉండగలుగుతున్నాను. బాబా మా అమ్మను ఖచ్చితంగా కాపాడుతారని నాకు తెలుసు. వైద్యంతో పాటు అమ్మకు బాబా ఊదీ కూడా ఇస్తున్నాను. నాలుగు రోజుల తరువాత అమ్మ ఆరోగ్య పరిస్థితిలో కొద్దిగా కొద్దిగా మార్పురావడం మొదలుపెట్టి క్రమంగా ఆరోగ్యం చేకూరుతోంది. ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు కొద్దిగా నలతగా ఉన్న అమ్మ ఆరోగ్యం ఏడు గంటల తర్వాత ఉన్నట్టుండి సాధారణస్థితికి వచ్చేసింది. వికారం పోయి బాగా ఆకలి వేసింది. ఆహారం తీసుకుంటే వాంతి రావటం లేదు. సాయినాథుని దయవల్ల అమ్మ చక్కగా నార్మల్ అయిపోయారు.
అయితే, అందరికీ ఒకటి అనిపించవచ్చు, ‘అది ముందే జరగవచ్చు కదా’ అని. కానీ, నాకు తెలిసినంతవరకు నాలాంటివాళ్ళు ఎన్నోరకాల ప్రారబ్ధకర్మలతో ఉంటారు. నిజానికి మనం ఈ కర్మలను కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలలపాటు, కొన్ని రోజుల పాటు అనుభవించవలసి ఉంటుంది. కానీ మన పరాత్పరుడైన సాయినాథుడు ఎంతో దయతో మనం సంవత్సరం పాటు అనుభవించాల్సిన కర్మలను కేవలం కొన్ని రోజుల పాటు, కొన్ని రోజుల పాటు అనుభవించాల్సిన వాటిని కేవలం కొన్ని గంటలు మాత్రమే అనుభవించేలా చేసి వాటిని తొలగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ సాయినాథుడు మనకు ఏ కష్టం రాకుండా స్వప్నావస్థలోనే ఈ ప్రారబ్ధకర్మలను పూర్తిగా పోగొట్టి మనకు సరైన దారి చూపిస్తూ ఉంటారు. ఇది నా జీవితంలో ఎన్నోసార్లు పొందినటువంటి అనుభవం. నాకు తెలిసినంతవరకు ఆ పరాత్పరుడైన సాయినాథుని శరణు వేడడం తప్ప మనకు వేరే మార్గం లేదు. బాబాను పట్టుకుందామనుకుంటే ఆయన కృష్ణునిలాగా పారిపోతారు. ఆయనను పట్టుకోవడం మన వల్ల కాని పని, కేవలం శరణాగతి ఒక్కటే మనం చేయవలసింది. రెండు చేతులూ జోడించి, “నాకు మీరే దిక్కు” అని వేడుకుంటే, మన దగ్గరకు వచ్చి మనలను పూర్తిగా దగ్గరకు తీసుకొని అనంతమైన తన ప్రేమను పంచుతారు. ఇది నా స్వానుభవం. రెండు చేతులూ జోడించి శరణాగతి పొందడం ఒక్కటే మార్గం. అయితే, ఈ శరణాగతిగానీ, శ్రద్ధ-సబూరి గానీ, ఆయన మీద భక్తిగానీ మనకు ప్రసాదించమని మళ్ళీ తిరిగి ఆయననే వేడుకోవాలి తప్ప నాకు తెలిసినంతవరకు వేరే మార్గం లేదు. “నాకు మీయందు భక్తి కలగాలి, నాకు మీయందు నమ్మకం ఉండాలి, నేను మిమ్మల్ని విశ్వసించాలి, మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి” అని బాబాను మనసారా వేడుకోవాలి. అన్నీ ఆయనే ప్రసాదిస్తారు. ఆయన తప్ప వేరేవాళ్ళెవరూ చేయలేరు. ఇది నా స్వానుభవం మరియు అభిప్రాయం. ఏది ఏమైనా మనలను రక్షించేది, కాపాడేది ఆ సాయినాథుడే. కాస్త ఆలస్యమైనప్పటికీ బాబా మనలను ఖచ్చితంగా కాపాడతారు. మా ఇంటిలోని వారందరినీ ఆ సాయినాథుడు ఎల్లవేళలా అనుక్షణం వెన్నంటి ఉండి కాపాడుతూ ఉన్నారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు. మాకు ఆ సాయినాథుడే రక్ష.
అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన, రక్ష రక్ష సాయినాథ!
అంతా బాబా దయ
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు నికిత. నేను ఇంతకుముందు నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. మళ్ళీ ఇంత త్వరగా బాబా ప్రసాదించిన మరో అనుభవంతో మీ ముందుకు వస్తానని నేను అనుకోలేదు. అంతా బాబా దయ.
మా అక్క, బావల మధ్య చాలా గొడవలు వచ్చాయి. దానివలన మా అక్క ఎంతో బాధపడినప్పటికీ తన అత్తగారింట్లో గొడవల గురించి తను మాకు ఏనాడూ చెప్పలేదు. ఒక్కసారిగా ఆ విషయాలు తెలిసేసరికి మేము చాలా బాధపడ్డాము. ఆ బాధతో అమ్మ, నాన్న అస్సలు నిద్రపోలేదు. నేను మాత్రం, "గొడవలన్నీ సర్దుకునేలా చేయమ"ని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. తరువాత నేను మొబైల్లో ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు, "ఒక గంటలో అంతా సద్దుమణుగుతుంది" అని బాబా మెసేజ్ నా కంటపడింది. బాబా చెప్పినట్లే గొడవలన్నీ సద్దుమణిగాయి. ఇప్పుడు అందరం చాలా సంతోషంగా ఉన్నాము. అంతా బాబా దయ. బాబా ఆశీస్సులతో ఇప్పుడు మా అక్క గర్భవతి. "థాంక్యూ బాబా. మీ దయవలన అక్కకి సాధారణ కాన్పు జరగాలని కోరుకుంటున్నాను".
మరొక అనుభవం:
నేనొకసారి నా స్నేహితురాలి అన్నయ్యను కలవాలని అనుకున్నాను. ఆ విషయమై నేను మూడు వారాలుగా అడుగుతున్నప్పటికీ మా అమ్మానాన్నలు ఒప్పుకోలేదు. అప్పుడు నేను, "మా అమ్మానాన్నల మనసు మార్చి, నేను వెళ్ళడానికి అనుమతించేలా చేయమ"ని బాబాను ప్రార్థించాను. ఆశ్చర్యం! బాబాను ప్రార్థించిన అయిదు నిమిషాల్లో అమ్మ నన్ను వెళ్ళమని చెప్పింది. నాన్న కూడా ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాను.
మరొక అనుభవం:
ఒక అంకుల్ ద్వారా నాకు బాబా పరిచయమయ్యారు. ఆ అంకుల్‌కి బాబా అంటే చాలా ఇష్టం. ఒకసారి నాకు కలలో ఆ అంకుల్ ఏడుస్తూ కనిపించారు. నాకు ఏమీ అర్థం కాలేదు. ‘అంతా బాబా చూసుకుంటారులే’ అని ఊరుకున్నాను. కానీ, 'అంకుల్ కరోనా సమయంలో చాలా భయపడిపోయార'ని నాకు తరువాత తెలిసింది. ప్రస్తుతం బాబా దయవలన అంకుల్ బాగానే ఉన్నారు. "థాంక్యూ బాబా".
Om sai ram very nice sai leelas.my sister-in-law suffered from cancer.with baba blessings she is fine.cancer is enough bearable disease.corona, cancer are very dangerous diseases.with udi sai cures.all diseases.That is the power of udi.om sai ram❤❤❤
ReplyDeleteBaba ne udhi tho ma rogalanu kuda bagu cheyi thandri sainatha please
ReplyDeleteJai sairam 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteSai bandhuvulaku namaskaram
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete