- బాబా ఉన్నారు, ఆయనే మనల్ని రక్షిస్తారు
- మరుసటిరోజుకే దయచూపిన బాబా
బాబా ఉన్నారు, ఆయనే మనల్ని రక్షిస్తారు
సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు సంధ్య. శ్రీ సాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, సాయిబాబా మాపై చూపిన ప్రేమను, కరుణను సాటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారములు.
మొదటి అనుభవం:
2021, మార్చి నెల మొదటివారంలో మావారికి నోటిలో చిగురు మెత్తబడి ఒక పన్ను ఊడిపోయింది. దానివల్ల బయట నలుగురిలో మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా ఉందనీ, అందరితో సరిగా మాట్లాడలేకపోతున్నాననీ తను బాధపడేవారు. పోనీ, దంతవైద్యుడిని సంప్రదించి పన్ను పెట్టించుకోమంటే, తనకు షుగర్, బి.పి ఉన్నందువల్ల ఈ కరోనా సమయంలో పన్ను పెట్టించుకోవాలంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమోనని భయపడ్డారు. దాంతో నేను బాబాపై భారం వేసి, “సాయితండ్రీ! ఏ భయమూ లేకుండా మావారు దంతవైద్యుడిని సంప్రదించి చక్కగా పన్ను పెట్టించుకునేలా అనుగ్రహించండి” అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. బాబా దయతో మావారు దంతవైద్యుడిని సంప్రదించి ఆయన చెప్పిన విధంగా పన్ను పెట్టించుకోవడానికి సిద్ధమయ్యారు. నేను బాబాకు నమస్కరించుకుని, “సాయిబాబా! మీరే వైద్యుడిగా వచ్చి మావారికి ట్రీట్‌మెంట్ చేసి చక్కగా పన్ను అమర్చండి తండ్రీ!” అని ప్రార్థించాను. రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ జరిగేటప్పుడు బాబానే డాక్టర్ రూపంలో స్వయంగా మావారికి వైద్యం చేస్తున్నట్లు భావించాను. “బాబా, మీ కరుణతో ట్రీట్‌మెంట్ చక్కగా జరిగేలా అనుగ్రహించండి తండ్రీ. మీరు మాపై చూపిన ప్రేమను, కరుణను సాటి సాయిబంధువులతో పంచుకుంటాను” అని బాబాను వేడుకుని, ఆ సమయమంతా ‘ఓం శ్రీ సాయినాథాయ నమః’ అని స్మరిస్తూ కూర్చున్నాను. బాబా దయవలన మావారికి ఏ ఇబ్బందీ కలుగకుండా రూట్ కెనాల్ చేసి చక్కగా పన్ను అమర్చారు డాక్టర్. ఇప్పుడు మావారు ఎలాంటి బిడియం లేకుండా అందరితో మాట్లాడుతున్నారు. సాయితండ్రిపై భారం వేసి దంతచికిత్స చేయించుకుని చక్కటి పలువరుసతో సంతోషంగా ఉన్నారు. అంతా బాబా దయ. “బాబా, మీకు వేలవేల కృతజ్ఞతలు”.
రెండవ అనుభవం:
2021, మార్చి 21, ఆదివారం మధ్యాహ్నం నేను భోజనం చేస్తుండగా నోటిలో ఏదో ఇబ్బందిగా అనిపించింది. అన్నం నములుతున్నప్పుడు నాలుక పైన ఏదో ఉన్నట్టుగా అనిపించి అద్దంలో చూసుకున్నాను. నాలుకకు ప్రక్కన రెండు భయంకరమైన ఎర్రటి గడ్డలు కనిపించాయి. ఒకటి చిన్నదిగా, మరొకటి కాస్త పెద్దదిగా ఉంది. అవి చూసి నేను చాలా భయపడ్డాను. వెంటనే బాబాను ప్రార్థించి వాటిపై ఊదీ పెట్టాను. ఆ తరువాత, “ఆ ఎర్రటి గడ్డలు పెరగకుండా చూడు బాబా” అని ప్రార్థించి, మరోసారి బాబా ఊదీని ఆ ఎర్రటి గడ్డలపై పెట్టాను. మావారు, పిల్లలు వాటిని చూసి భయంతో ఆశ్చర్యపోయారు. నేను భయంతో చాలా నీరసించిపోయాను. అయినా, “బాబా ఉన్నారు, నాకేం కాదు” అని బాబా నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. మావారు ‘హాస్పిటల్‍కి వెళదాం, పద’ అని అంటే, ‘అదే తగ్గిపోతుందిలే’ అన్నాను. దాంతో మావారు ‘హాస్పిటల్‍కి వెళ్ళాలా, వద్దా’ అని చీటీలు వేసి బాబాను అడిగారు. బాబా హాస్పిటల్‍కి వెళ్ళమని సూచించారు. వెంటనే హాస్పిటల్‍కి వెళ్ళి డాక్టరును సంప్రదించాము. డాక్టర్ పరీక్షించి, ‘ఈ ఎర్రటి గడ్డలు ఎప్పటినుండి ఉన్నాయి?’ అని అడిగారు. “అవి ఇంతకుముందు లేవు, హఠాత్తుగా కనిపించాయి” అని చెప్పాను. ఆ గడ్డలు తగ్గటానికి మందులిచ్చి, “10 రోజుల పాటు ఈ మందులు వాడండి. మందులతో తగ్గకపోతే ఆపరేషన్ చేసి తీసేస్తాను” అన్నారు. సరేనని మావారు, నేను మందులషాపుకి వెళ్ళాము. మావారు మందులు తీసుకున్నారు. నేను నిలుచున్నచోటనే బాబా నామస్మరణ చేస్తూ, “ఏంటి బాబా, ఎర్రటి రక్తపు గడ్డలు ఎందుకు వచ్చాయి? నన్ను రక్షించు సాయీ” అని మనసులోనే ప్రార్థించాను. వెంటనే అభయహస్తంతో ఆశీర్వదిస్తున్న ఫోటో రూపంలో బాబా ఆ మందులషాపులో దర్శనమిచ్చారు. మరోచోట కూడా బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. నేను బాధపడుతున్న సమయంలో “నీకు ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుందిలే” అనే విధంగా బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. బాబా దయవలన ఒక్కరోజులోనే ఆ ఎర్రటిగడ్డలు ఎలా వచ్చాయో అలాగే మాయమైపోయాయి. అంతా బాబా ఊదీ ఆశీర్వాదమే. బాబా ఉనికిని, ఆయన అపార ప్రేమను పొందిన భక్తురాలిగా ఏ సమస్య వచ్చినా ‘బాబా ఉన్నారు, ఆయనే మనల్ని రక్షిస్తారు’ అనే విశ్వాసంతో ధైర్యంగా జీవిస్తున్నాను. “బాబా! మీకు శతకోటి ప్రణామాలు తండ్రీ!”
సద్గురు చరణం భవభయహరణం సాయినాథ శరణం
మరుసటిరోజుకే దయచూపిన బాబా
సాయిభక్తురాలు ప్రియాంక తనకు బాబా ఇటీవల ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నా పేరు ప్రియాంక. నాకు pcod సమస్య ఉందని ఈమధ్యనే తెలిసింది. దానివలన మందులు వాడుతున్నప్పటికీ నెలసరి ఇంకా ఆలస్యం కాసాగింది. అప్పుడు నేను మనస్ఫూర్తిగా సాయికి నమస్కరించి, నా సమస్యను పరిష్కరించమని ప్రార్థించి, ఆయన మీద నమ్మకం ఉంచాను. మరుసటిరోజుకే బాబా నాపై దయచూపారు. "సాయిబాబా! నువ్వు నా వెంట ఉన్నావని మరోసారి నిరూపించావయ్యా. ఎప్పుడూ ఇలాగే మా అందరికీ తోడుగా ఉండవయ్యా".
Om sairam
ReplyDelete🙏🙏🙏
Om sai ram 1st sai leela is very nice. Baba I am having trout infaction. It is troublely me. With medicines it's not curering.please baba bless me with health. ❤❤❤ I love you baba.
ReplyDeletePlease baba bless me..I have open pores issue...udi pedtuna... please baba taggela chudu
ReplyDeleteఓం సాయిరాం 🌹🙏🌹
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundela chudu sai thandri nenne namukunanu thandri kapadu thandri pleaseeee
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః
ReplyDelete