సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 751వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా ఊదీ ఆశీర్వచనం - కనిపించనివి కనిపించే సాయి లీలలు
  2. బాబా ఆశీస్సులతో పుట్టినరోజునాడు భగవద్దర్శనం

బాబా ఊదీ ఆశీర్వచనం - కనిపించనివి కనిపించే సాయి లీలలు


సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు సంధ్య. సాయినాథుని దివ్యపాదాలకు శిరస్సువంచి నమస్కరిస్తూ సాయిబాబా లీలలను సాటి సాయిబంధువులతో పంచుకోబోతున్నాను. సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు.


మొదటి అనుభవం:


2021, జనవరి నెలలో వాషింగ్ మెషీన్లో బట్టలు వేసి మెషీన్ ఆన్ చేశాను. బట్టలు వాష్ అవుతుండగా ఉన్నట్టుండి మెషీన్ మధ్యలో ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా వాషింగ్ మెషీన్ స్టార్ట్ అవటం లేదు. అసలే చలికాలం. చలి బాగా ఎక్కువగా ఉంది. బట్టలు బయటకు తీసి ఉతకాలంటే నా వల్ల కాని పని. ఇంతలో, ‘తమ తమ ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయకపోతే వాటికి బాబా ఊదీ పెట్టామనీ, బాబా ఆశీర్వాదంతో ఆ వస్తువులు ఎప్పటిలాగే పనిచేయడం ప్రారంభించాయనీ’ సాటి సాయిబంధువులు ఈ బ్లాగులో పంచుకున్న బాబా లీలలు గుర్తుకువచ్చి, బాబాను ప్రార్థించి వాషింగ్ మెషీన్‌కు ఊదీ పెట్టాను. కొద్దిసేపటి తరువాత మళ్ళీ మెషీన్ ఆన్ చేస్తే, మెషీన్ ఆన్ అయి ఎప్పటిలాగా పనిచేసింది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. బాబా మన ప్రతీ బాధనూ వింటారు. “ధన్యవాదాలు తండ్రీ, సాయీశ్వరా!”


రెండు అనుభవం:


అది 2021, మార్చి నెల మొదటివారం. ఆరోజు మా పాప హాస్టల్‌కు బయలుదేరేరోజు. ఆరోజు ఉదయం మా పాప బట్టలు మెషీన్లో వేశాను. ‘బట్టలు త్వరగా ఆరిపోతాయి, బ్యాగ్ త్వరగా సర్దేయొచ్చు’ అనుకున్నాను. అయితే అనుకోకుండా వాషింగ్ మెషీన్ మధ్యలోనే ఆగిపోయింది. ఆరోజు మధ్యాహ్నం పాప హాస్టల్‌కు బయలుదేరుతుంది. ఆ బట్టలను మెషీన్లో నించి బయటకు తీసి ఉతికినా సమయానికి ఆరవు. బట్టలు ఆరకపోతే నేను తన బ్యాగ్ సర్దలేను. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, ప్లీజ్! వాషింగ్ మెషీన్ ఎప్పటిలాగా పనిచేసేలా ఆశీర్వదించండి” అని ప్రార్థించి, మెషీన్‌కు ఊదీ పెట్టి, “మెషీన్ పనిచేస్తే మీ లీలను సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను తండ్రీ” అని వేడుకుని, మళ్ళీ మళ్ళీ బాబాను ప్రార్థిస్తూ మెషీన్ ఆన్ చేశాను. బాబాను ప్రార్థించగానే మెషీన్ ఇంతకుముందులాగే పనిచేయడం ప్రారంభించింది. బట్టలు పూర్తిగా వాష్ అయ్యేవరకు ఏ ఇబ్బందీ కలుగలేదు. ఇప్పటికీ వాషింగ్ మెషీన్ చాలా చక్కగా పనిచేస్తోంది. బాబా ఊదీ ఆశీర్వచనం ఎనలేనిది. ఊదీ పరమ ఔషధం. “ధన్యవాదాలు బాబా!”


మూడవ అనుభవం:


ఒకరోజు నేను బీరువాలో బట్టలు చక్కగా సర్ది బీరువాకు తాళంవేసి తాళంచెవులను ఒకచోట ఉంచాను. కొంతసేపటి తరువాత మావారు “బయటకు వెళతాను, బట్టలు కావాలి, బీరువా తాళాలు ఎక్కడున్నాయి?” అని అడిగారు. ఆరోజెందుకో మావారు చాలా కోపంగా, చిరాకుగా ఉన్నారు. బీరువా తాళాలు పెట్టిన చోట చూస్తే అవి కనిపించలేదు. చాలా భయమేసింది. ‘అసలే ఆయన కోపంగా ఉన్నారు, తాళాలు కనిపించకపోతే ఇంకేమైనా ఉందా?’ అనుకుంటూ పెట్టినచోటే చాలాసేపు వెతికాను. ఎంతకీ తాళాలు కనిపించలేదు. “బాబా, సాయితండ్రీ! బీరువా తాళాలు ఇక్కడే కదా ఉంచాను. మరెక్కడైనా పెట్టివుంటే నాకు గుర్తుకువచ్చేలా చూడు తండ్రీ!” అని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. బాబాను ప్రార్థించగానే ఆశ్చర్యంగా నేను వెతికినచోటే బీరువా తాళాలు కనిపించాయి. ఒక్కసారిగా గండం గట్టెక్కినట్లనిపించింది. ఎంతో సంతోషంగా బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


నాలుగవ అనుభవం:


ఒకరోజు వంట చేస్తూ పెసరపప్పు కోసం వెతుకుతున్నాను. ఎంత వెతికినా కనిపించలేదు. “ఇక్కడే ఉండాలి కదా, ఎందుకు కనిపించడంలేదు?” అనుకుంటూ చాలా వెతికాను. నేను ప్రతిరోజూ నాకు తెలియకుండానే నా మనసులో బాబాతో మాట్లాడుతూ ఉంటాను. అలాగే అప్పుడు కూడా నాకు తెలియకుండానే, ‘పెసరపప్పు ప్యాకెట్టు ఇక్కడే ఉండాలి కదా తండ్రీ సాయీ’ అని అంటూ ఉండగానే పెసరపప్పు ప్యాకెట్ నా చేతికి తగిలింది. దాంతో నేనెంతో ఆశ్చర్యపోయాను. “బాబా! మీరు నా ప్రతి మాటా వింటున్నారు కదా!” అని బాబాతో చెప్పుకుని చాలా ఆనందించాను. అంతలోనే నాకు ఒక ఆలోచన వచ్చి బాబాను అడిగాను: “బాబా! మీరు సాక్షాత్తూ చిన్నికృష్ణులే కదా! మీ లీలలు చూస్తుంటే మీరు సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్ములే అనిపిస్తోంది. లేదంటే ఎంత వెతికినా కనిపించని వస్తువులు మిమ్మల్ని తలచుకోగానే ఎలా కనిపిస్తాయి? బాబా! మీ భక్తుల (బిడ్డల) ఆందోళనలను తొలగించి వారి సంతోషాన్ని చూసి మురిసిపోయే తండ్రి మీరు. అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప మీ లీలలు ఎవరికీ అంతుపట్టనివి తండ్రీ”. సాయి రామ హరే, సాయి కృష్ణ హరే, సాయీ సాయీ హరే హరే!


సాయిబంధువులతో నా అనుభవాలను పంచుకోవడం బాబా ఆశీర్వాదమే. బాబా మన ప్రతి మాటా వింటారు. ప్రతి బాధనూ వింటారు. సంతోషమైనా, దుఃఖమైనా మనతో ఉండేది సాయినాథుడే. మన తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు, ప్రియుడు, బంధువు, బలగం, సర్వం సాయే. ఇదే సత్యం.


“నీవే తల్లివి, తండ్రివి

నీవే దైవము, నీవే గురుడవు

నీవే బంధువు, నీవే బలగము

నీవే నా తోడు నీడ నిజముగ సాయీ!

“బాబా, మీ ప్రేమే చాలు సాయీ!”


సద్గురు చరణం - భవభయ హరణం


బాబా ఆశీస్సులతో పుట్టినరోజునాడు భగవద్దర్శనం


సాయిభక్తురాలు పద్మావతి తమకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


మేము ప్రతి సంవత్సరం తీర్థయాత్రకి వెళ్లి భగవంతుని ఆశీస్సులు పొందుతాము. ఇటీవల నేను తిరుమల వెళ్లి శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలని అనుకున్నాను. సర్వాంతర్యామి అయిన బాబాకు నా మనసు తెలుసు. ఆయన మేము తిరుమల వెళ్లేలా అనుగ్రహించి మాకు చక్కటి శ్రీవారి దర్శనాన్ని ప్రసాదించారు. ఆరోజు నా పుట్టినరోజు. ఆరోజున భగవంతుని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందినందుకు నేను చాలా సంతోషించాను. తరువాత మేము శ్రీకాళహస్తిలో శివుని దర్శనం చేసుకొని, ఆ తరువాత సోమవారంనాడు కాణిపాకం వెళ్లి గణపతి ఆశీస్సులు పొందాము. అక్కడి (చిత్తూరు) నుండి మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న తమిళనాడులోని ప్రసిద్ధ పొన్నై గణపతి దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందాము. అక్కడ హోమం కూడా చేసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము. ఇంతలా బాబా మమ్మల్ని అనుగ్రహించారు. ఆయన ఆశీస్సులతో మేము చాలా ఆనందకరమైన సమయాన్ని గడిపాము. "బాబా! నా కోరిక తీర్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు".


6 comments:

  1. Today is Sree Rama navami. Today my experience came. I felt happy.that is baba leela.lord Rama bless all from this Pandamic. Om sai ram�� ❤����������

    ReplyDelete
  2. Kothakonda SrinivasApril 21, 2021 at 9:04 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Om sai ram baba Amma problem tondarga cure cheyi thandri

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo