- బాబా, శివుడు వేరు కాదు!
- తండ్రి లేని మాకు బాబానే ఆసరా
- ల్యాప్‌టాప్ సమస్యను పరిష్కరించిన బాబా
బాబా, శివుడు వేరు కాదు!
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను సాయిభక్తురాలిని. నేను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్న అనుభవం ఈమధ్యకాలంలోనే జరిగింది. నిజానికి నేను ఈ అనుభవాన్ని పంచుకుంటానని అనుకోలేదు. కానీ, మహాశివరాత్రి ఉదయాన ఈ బ్లాగులో ప్రచురించిన 'సాయిభక్తుల అనుభవమాలిక'లోని ఒక భక్తురాలి అనుభవం చదివాక బాబా నాకు ప్రసాదించిన ఈ అనుభవాన్ని పంచుకోవాలనిపించి ఇలా వ్రాస్తున్నాను.
2018, విజయదశమికి నేను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు కొంత ఊదీ తెచ్చుకొని, దాన్ని పూజలో పెట్టుకుని, ప్రతిరోజూ వాడుకుంటున్నాను. పదిహేను రోజుల క్రిందట పూజ చేస్తూ ఊదీ అయిపోవస్తోందని గమనించాను. దాంతో నేను, "మళ్ళీ నేను ఎప్పుడు శిరిడీ వెళ్తానో కదా! మరి నాకు బాబా ఊదీ ఎలా లభిస్తుంది?" అని అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత పూజ చేసేటప్పుడు, "బాబా! నాకు ఏదైనా మంచి చెప్పండి" అని అనుకుని సచ్చరిత్రలో ఒక పేజీ తెరిచాను. ఆ పేజీలో మేఘశ్యాముడు బాబాను శివునిగా భావించి పూజించేవాడని ఉంది. అది జరిగాక ఐదురోజుల క్రిందట ఒకరోజు నేను మా ఇంట్లోని ఒక అలమరా శుభ్రం చేస్తుంటే ఒక విభూది ప్యాకెట్ కనిపించింది. అది శ్రీశైలం దేవస్థానానికి సంబంధించింది. ముందుగా బాబా నాకు మేఘశ్యాముడు తమను శివునిగా భావించేవాడని చూపించడం, తరువాత శ్రీశైల విభూది దొరికేలా చేయడాన్ని బట్టి వారివురు వేరు కాదని నాకు తెలియజేస్తున్నారని అనిపించింది. దాంతో నేను ఆనందంగా ఆ విభూదిలో బాబా ఊదీ కలుపుకొని రోజూ పెట్టుకుంటున్నాను. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే, సరిగ్గా శివరాత్రిరోజున ఈ అనుభవాన్ని వ్రాసేలా నన్ను అనుగ్రహించారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"
తండ్రి లేని మాకు బాబానే ఆసరా
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను సాయిబాబాకు సాధారణ భక్తురాలిని. నా పేరు అమ్ములు. నేనొక గృహిణిని. మాది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గల ఒక గ్రామం. నాకు పెళ్ళైన పదినెలలకే మా నాన్న చనిపోయారు. తండ్రిలేని నాకు తండ్రిలా అండగా నిలిచి ప్రతి విషయంలో రక్షణనిచ్చారు బాబా. నాన్న మరణంతో మా కుటుంబ బాధ్యతలన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. అప్పట్లో మేము బెంగుళూరులో ఉండేవాళ్ళం. కొన్నాళ్ళకి నా సాయితండ్రి దయవలన మేము అక్కడినుండి యు.ఎస్.ఏ లోని కాలిఫోర్నియాకి వచ్చాము. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాము. సాయితండ్రి మాకు మంచి సంపాదననిచ్చి నా కుటుంబాన్ని సంరక్షించుకునేలా అనుగ్రహించారు. నాకొక తమ్ముడు ఉన్నాడు. స్వతహాగా మంచివాడైన తను కొన్ని కారణాల వలన మమ్మల్ని కొంచెం ఇబ్బందిపెట్టాడు. అప్పుడు మేము "తమ్ముడి విషయంలో సహాయం చేయమ"ని బాబాను వేడుకున్నాము. నా తండ్రి పిలిచింతనే పలికి ప్రతిక్షణం మా తమ్ముడికి రక్షణగా నిలిచి అంతా సరిచేశారు. బాబా ఆశీస్సులతో తను కూడా యు.ఎస్.ఏ కి వచ్చాడు. కానీ కేవలం పదినెలలు ఇక్కడ పనిచేశాక వీసా రిజెక్ట్ అవటం వలన తను తిరిగి ఇండియాకి వెళ్లాల్సి వచ్చింది. బాబాను తలచుకొని మేము ఏడవనిరోజే లేదు. ఇప్పుడు మా తమ్ముడు ఇండియాలోనే ఉన్నాడు. "బాబా! నేను, తమ్ముడు చాలా బాధలో ఉన్నాము. నీ మిరాకిల్‌తో మమ్మల్ని ఆనందంగా ఉంచుతావని నిన్నే నమ్ముకొని భారమంతా నీ మీదే వేశాము. ఏదైనా అద్భుతం చేసి తమ్ముడికి విదేశాల్లో మంచి ఉద్యోగాన్ని, జీతాన్ని, మంచి సంపదను, శక్తిసామర్థ్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇంకా తనకు సద్బుద్ధిని అనుగ్రహించి తన భార్యతో నిండునూరేళ్ళు ఆనందంగా ఉండేలా చల్లగా ఆశీర్వదించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా, మాకు ప్రాణమైన అమ్మను ప్రేమగా చూసుకునేలా కూడా అనుగ్రహించు తండ్రీ!"
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ల్యాప్‌టాప్ సమస్యను పరిష్కరించిన బాబా
పేర్లు వెల్లడించని ఒక సాయి భక్తురాలు ఇటీవల బాబా మనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబాను తలచుకుంటే చాలా ధైర్యంగా వుంటుంది. నా జీవితంలో గత ఏడాది నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. అన్నిట్లోనూ బాబా నాకు అండగా ఉంటున్నారు. బాబా దయవల్ల త్వరలోనే అన్నీ చక్కబడతాయని అనుకుంటున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
మా సొంత ఊరు నెల్లూరు. మావారు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కరోనా కారణంగా గత తొమ్మిది నెలల నుంచి ఇంటి నుంచే (నెల్లూరు) పనిచేస్తున్నారు. అనుకోకుండా ఒకరోజు ఎంత ప్రయత్నించినా మావారి ల్యాప్‌టాప్ ఆఫీసు సర్వర్‌కి కనెక్ట్ కాలేదు. ఆ సమస్యను పరిష్కరించడానికి ఆఫీసువాళ్ళు ఆ ల్యాప్‌టాప్ తీసుకుని మావారిని బెంగళూరు ఆఫీసుకి రమ్మన్నారు. మాకు చిన్న బాబు ఉన్నాడు. అందువల్ల, ఈ కరోనా సమయంలో మావారు బెంగళూరు వెళ్లాలనేసరికి నాకు కాస్త ఆందోళనగా అనిపించి బాబాకు నమస్కరించుకుని, “బాబా! మావారు బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా తన ల్యాప్‌టాప్ ఆఫీసు సర్వర్‌కి కనెక్ట్ అయితే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో షేర్ చేసుకుంటాను” అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం ల్యాప్‌టాప్ ఆన్ చేస్తే సర్వర్‌కి కనెక్ట్ అయింది. “బెంగళూరుకు వెళ్లకుండానే ల్యాప్‌టాప్ సమస్యను పరిష్కరించినందుకు థాంక్యూ సో మచ్ బాబా! త్వరలో మా కుటుంబ సమస్యలను పరిష్కరించు తండ్రీ! నా బిడ్డకున్న ఆరోగ్య సమస్యలు తీర్చు సాయీ! త్వరలోనే అన్నయ్యకి మంచి అమ్మాయితో వివాహమయ్యేలా అనుగ్రహించు బాబా! తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించు తండ్రీ!” ఓం సాయి రక్షక శరణం దేవా!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDelete🙏🙏🙏
Om sai ram today is baba's day. I completed my m. P. Parayan. Today I read baba grainds the wheat. With that wheat powder baba saves the people in Siridi from plague. Like that sai you save the world from Corona. You save people from deadly virus.All are suffering from deadly virus.you are only our lovely deva.keep this world virus free from Corona. Om sai ram������ ��❤❤������
ReplyDeleteOm sai ram baba amma arogyam ni kapadu thandri pleaseeee
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!