ఈ భాగంలో అనుభవం:
- 'నవగురువార వ్రతం' - శ్రీసాయిబాబా ఆశీస్సులు
ఆస్ట్రేలియా నుండి సాయి భక్తుడు అమిత్ దేశాయ్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఆస్ట్రేలియాలో నివాసముంటున్న నేను శ్రీసాయిబాబా భక్తుడిని. 2003లో నాకు ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన ఆశీస్సులతో నాకు చాలా అనుభవాలున్నాయి.
2002లో నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా మరో నగరంలో ఉన్న ఒక పెద్ద కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. నేను అంతకుమునుపు ఎన్నడూ ఇంటినుండి దూరంగా లేనందున నాకా ఉద్యోగం, చోటు నచ్చలేదు. అందువలన నెల తిరిగేసరికి వేరే ఏ ఉద్యోగం చూసుకోకుండానే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటికి వచ్చేశాను. ఖాళీగా ఉండటం ఇష్టం లేక నాకు నచ్చకపోయినా సొంత ఊరిలో ఒక అప్రెంటిస్‌షిప్ లో చేరాను. ఆ సమయంలో మా అమ్మగారికి తన కార్యాలయంలోని వాళ్లెవరో ఒక "శ్రీసాయి నవగురువార వ్రత కథ" పుస్తకాన్ని ఇచ్చారు. నేను ఆ పుస్తకం ఒకసారి చదివాను. అందులోని భక్తుల అనుభవాలు నాకు చాలా నచ్చాయి. తరువాత నేను, అమ్మ ఆ వ్రతాన్ని ప్రారంభించాము. నాకెందుకో ఏదో మంచి జరుగుతుందని అనిపించింది.
ఆ రోజుల్లో మొబైల్ సాధారణమైన విషయం కాదు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చాలా అరుదు. అందువలన ఒకరోజు నేను ఇ-మెయిల్స్ చూసుకోవడానికని ఒక ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లాను. నాకొచ్చిన ఒక మెయిల్ చూసి షాక్ అయ్యాను. మరుసటిరోజు అంటే గురువారం ఇంటర్వ్యూకి హాజరు కమ్మని 'ABB' అనే ఒక పెద్ద MNC కంపెనీ నుండి వచ్చిన మెయిల్ అది. బాబా సరైన సమయానికి మెయిల్ చూసుకునేలా చేశారు. నేను ఆ ఇంటర్వ్యూకి హాజరై దాదాపు అన్ని రౌండ్లు విజయవంతంగా పూర్తి చేసాను. తరువాత హెచ్‌ఆర్ ఆఫర్ లెటర్ విడుదల చేయడానికి ముందు మేము ఎవరితో కలిసి పనిచేయాల్సి ఉందో ఆ మేనేజరుతో తుది సమావేశం ఉందని చెప్పారు. మేమంతా ఆ సమావేశం కోసం ఎదురుచూశాము. కానీ ఏవో కారణాలతో ఆ మేనేజర్ చాలా బిజీగా ఉండి, ఆ సమావేశం లేకుండానే ఆఫర్ లెటర్ జారీ చేయమని అతను హెచ్‌ఆర్ తో చెప్పాడు. దాంతో గురువారంనాడు బాబా ఆశీర్వాదంగా ఆఫర్ లెటర్ నా చేతికి వచ్చింది. జీతం నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. శ్రీసాయిబాబా కృపతో చుట్టూ చాలామంది మంచి వ్యక్తులున్న ఒక మంచి విభాగంలో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. మీకో విషయం చెప్పాలి. 2002లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో భాగంగా 'ABB' కంపెనీ ఇంటర్వ్యూకి కూడా నేను హాజరయ్యాను. కానీ అప్పుడు నేను విఫలమయ్యాను. అప్పటినుండి 'ABB' కంపెనీలో పనిచేయాలని కలలు కన్నాను. నా కలను నిజం చేసిన సాయిబాబాకు నా ధన్యవాదాలు. ఇదంతా ఆయన చేసిన అద్భుతం.
నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ మా కుటుంబంలోని కొంతమంది సభ్యులు మా పెళ్ళికి అంగీకరించలేదు. అప్పుడు నేను శ్రీసాయిబాబాపై నమ్మకముంచి 'నవ గురువార వ్రతం' చేశాను. దాంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
2007లో నేను ఆ కంపెనీని, నా సొంత ఊరిని వదిలి ముంబాయిలోని టి.సి.ఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా చేరాను. కానీ, మళ్ళీ నేను సొంత ఊరికి దూరంగా ఉండలేకపోయాను. దాంతో నన్ను తిరిగి తీసుకోమని నా పాత మేనేజరును అభ్యర్థించి, 'నవ గురువార వ్రతం' చేశాను. శ్రీసాయిబాబా ఆశీస్సులతో మళ్ళీ అద్భుతం జరిగింది. ఆ మేనేజరు సహకారంతో నా సొంత ఊరిలో అదే 'ABB' MNC కంపెనీలో నేను ఉద్యోగం పొందాను.
2009లో నేను ఆస్ట్రేలియన్ పిఆర్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నాను. దానికోసం నేను కొన్ని పరీక్షలు, మరికొన్ని పనులు పూర్తిచేయాల్సి వచ్చింది. ఆ విషయంలో "నాకు సహాయం చేయమ"ని శ్రీసాయిబాబాను ప్రార్థించి 'నవ గురువార వ్రతం' చేశాను. బాబా ఆశీస్సులతో నాకు IELTS పరీక్షలో మంచి స్కోరింగ్ వచ్చింది. నా స్నేహితుడొకరి మార్గదర్శకత్వంలో డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి 'ఇంజనీర్స్ ఆస్ట్రేలియా అసెస్మెంట్‌కి సమర్పించాను. బాబా కృపతో అది కూడా విజయవంతంగా పూర్తయింది. "ధన్యవాదాలు శ్రీసాయిబాబా".
అయితే 2010లో, పిఆర్ వీసా నియమాలు మార్పు చేయబడ్డాయి. దాంతో నేను స్టేట్ నామినీ ప్రోగ్రాంకి దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది. నేను మళ్ళీ శ్రీసాయిబాబాను ప్రార్థించి, 'నవ గురువార వ్రతం' చేశాను. మళ్ళీ ఒక అద్భుతం జరిగింది, నాకు దక్షిణ ఆస్ట్రేలియాకు సంబంధించిన స్పాన్సర్‌షిప్ వచ్చింది.
2010లో స్పాన్సర్‌షిప్ పొందిన తరువాత, మళ్ళీ పిఆర్ కి దరఖాస్తు చేసుకోవడం కోసం నేను కావాల్సిన పత్రాలను సేకరిస్తూ, "పిఆర్ ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయమ"ని శ్రీసాయిబాబాను ప్రార్థించాను. అకస్మాత్తుగా ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం మరుసటిరోజు నుండి కొత్త దరఖాస్తులు స్వీకరిస్తామని నోటిఫికేషన్ ఇచ్చింది. అదృష్టవశాత్తూ ఆస్ట్రేలియాలో ఉన్న నా ఏజెంట్ నాకు సంబంధించిన దరఖాస్తును దాఖలు చేసి, నా తరపున ఇమ్మిగ్రేషన్ ఫీజు మొత్తం చెల్లించి, రాబోయే కొద్దిరోజుల్లో ఆ మొత్తాన్ని తనకి పంపమని ఇ-మెయిల్ పంపించాడు. 60 రోజుల్లో నాకు, నా కుటుంబానికి వీసా వచ్చింది. ఇదంతా నాకు తోడుగా శ్రీసాయిబాబా ఆశీస్సులు ఉండటం వల్లనే సాధ్యం అయ్యింది. ఆయన ఈ ప్రక్రియలో మొదటినుండి తమ సహాయాన్ని అందించారు.
నేను మళ్ళీ బాబాను, "ఆస్ట్రేలియా 'ABB'లో ఉద్యోగం ఇవ్వమ"ని ప్రార్థించాను. నేను 'క్వీన్స్ ల్యాండ్'లో నివాసముండాలని కూడా ఆశపడ్డాను. వీసా రావడంతో ఆస్ట్రేలియాకు టికెట్ బుక్ చేసుకున్నాను. తరువాత నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. నా నోటీస్ పీరియడ్ ముగిసేలోపు శ్రీసాయిబాబా కృపతో ఆస్ట్రేలియా 'ABB' నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆయన ఆశీస్సులతో మొదటి రౌండ్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. రెండవ రౌండ్ ఇంటర్వ్యూకి ఆస్ట్రేలియాలో ఉన్న కంపెనీకి రమ్మని, వెంటనే ఉద్యోగంలో కూడా చేరమని చెప్పారు. హెచ్.ఆర్ కూడా ఫోన్ చేసి టిక్కెట్లు పంపుతామని చెప్పారు. అయితే తరువాత కొన్ని వారాలపాటు వాళ్ళనుండి ఎటువంటి సమాచారం రాలేదు. అకస్మాత్తుగా అదివరకు నాతో మాట్లాడిన మేనేజర్ కాల్ చేసి, నేను ఎంత తొందరగా రాగలనో కనుక్కుని, టికెట్స్ త్వరలో అందుతాయని చెప్పారు. కానీ మళ్ళీ ఎటువంటి సమాచారం వాళ్ళనుండి రాకపోవడంతో నేనే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాను. అదే సమయంలో నేను నా భార్య, కూతురితో శ్రీసాయిబాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాను. ఎందుకంటే నేను వీసా వస్తే, శ్రీసాయిబాబాను దర్శించుకోవాలని అనుకున్నాను. మొదటిసారి మేము బాబా దర్శనం చేసుకుని మందిరం నుండి బయటకి వస్తూ నేను నా ఇ-మెయిల్స్ చూసుకున్నాను. అద్భుతం! ఆస్ట్రేలియాకి టిక్కెట్లు, అక్కడి వసతి సౌకర్యాలకు సంబంధించిన సమాచారం, ఇంకా మరికొన్ని అవసరమైన పత్రాలతో ఆస్ట్రేలియా కంపెనీ నుండి మెయిల్ ఉంది. బాబా నన్ను మళ్ళీ ఆశీర్వదించారు. నేను కోరుకున్నట్లే 'క్వీన్స్ ల్యాండ్'లోని బ్రిస్బేన్‌లో నాకు ఉద్యోగం వచ్చింది. అది చూసి నా ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందంతో హృదయపూర్వకంగా శ్రీసాయిబాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.
"బాబా! ఇదేవిధంగా మీ సహాయాన్ని అందరికీ అందించండి. ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి. దయచేసి, ఈ కరోనావైరస్ నుండి ప్రపంచాన్ని రక్షించండి. మీ అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను".
శ్రీ సాయినాథ్ శరణం.
Om sai ram నేను నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసు.ఈ రోజు అనుభవం చాలా బాగా రాసారు.బాబా నేను నిన్ను ప్రేమించుచున్నాను.నా కుమారుని,కూతురు, భర్త ని కాపాడు. దయ చూపించు.సాంుు దేవ.
ReplyDeleteJai sairam🙏🙏🙏
ReplyDeleteమన తల రాత రాసిన బ్రహ్మ చేతిలోని కలం పేరు సాయి అయినప్పుడు మన భూత భవిష్యత్ వర్తమానాలు గురించి భయమేల..
ReplyDeleteOm sai ram baba Amma arogyam bagundela chudu sai thandri pleaseeee
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete