సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 736వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. కష్టకాలంలో తప్పక చేయూతనిచ్చి ఆదుకుంటారు బాబా
  2. లెక్కలేనన్ని సాయిబాబా ఆశీస్సులు


కష్టకాలంలో తప్పక చేయూతనిచ్చి ఆదుకుంటారు బాబా


హైదరాబాదు నుండి సాయిభక్తుడు కృష్ణకుమార్ తన తల్లిని బాబా కాపాడిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు కృష్ణకుమార్. మాది హైదరాబాద్. ఇంతకుముందు నేను పంచుకున్న అనుభవం “జరగబోయే ప్రమాదం నుండి దూరంగా ఉంచి కాపాడిన బాబా” అనే శీర్షికతో ఈ బ్లాగులో ప్రచురితమైంది (https://saimaharajsannidhi.blogspot.com/2021/03/713.html).


ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం 2016, ఆగస్టు 8వ తేదీ, సోమవారంనాడు జరిగింది. ఆరోజు తను వేసుకున్న ఒక ఇంగ్లీషు మందు వికటించి శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవటంతో మా అమ్మ స్పృహకోల్పోయింది. మంచం మీదనే యూరిన్ పాస్ అయిపోయింది. అది చూసి మా అమ్మ నాకు దక్కదనే అనుకున్నాను. ఆ సమయంలో నేను బాబాను స్మరించుకుని, “బాబా! అమ్మను బ్రతికించు, నేను శిరిడీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను” అని ప్రార్థించాను. ఈలోగా మా పెద్దమ్మ కొడుకు మా అమ్మకు హోమియోమందు ఇచ్చాడు. తరువాత అంబులెన్సుని పిలిపించుకుని అందులో అమ్మను కామినేని ఆసుపత్రికి తీసుకునివెళ్ళాము. అమ్మను పరీక్షించిన డాక్టర్లు తనను హాస్పిటల్లో అడ్మిట్ చేయమనీ, రెండు మూడు రోజులు తనను అబ్జర్వేషన్లో ఉంచాలనీ చెప్పారు. కానీ బాబా దయవల్ల అమ్మ త్వరగా కోలుకోవటంతో ఆరోజు మధ్యాహ్నానికల్లా అమ్మను ఇంటికి పంపించేశారు. ఆ సంఘటన అంతా ఒక కలలా గడిచిపోయింది. బాబా అనుగ్రహంతో ఇప్పుడు మా అమ్మ తన పని తను చేసుకుంటూ ఇంట్లో ఆరోగ్యంగా తిరగగలుగుతున్నారు. ‘బాబా తన భక్తుల శ్రద్ధ, సహనాలను పరీక్షిస్తారేగానీ తన భక్తులను ఎన్నడూ పతనం కానివ్వరు, కష్టకాలంలో తప్పక చేయూతనిచ్చి ఆదుకుంటారు’ అనేది నా అనుభవం. నిరంతరం సాయినామం జపిస్తే ఆపదలు వచ్చినా బాబా అనుగ్రహంతో అవి ఏదోరకంగా తొలగిపోతాయి.


లెక్కలేనన్ని సాయిబాబా ఆశీస్సులు

సాయి భక్తురాలు నవ్య చంద్రశేఖర్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్.

సాయిబాబా అనుగ్రహాన్ని పొందిన ఆయన బిడ్డని నేను. నా స్కూల్ రోజుల్లో ఒక సగటు విద్యార్థినిగా ఉండేదాన్ని. ఎన్నో అడ్డంకుల నడుమ నా జీవితం నడుస్తుండేది. నేను ఇంజనీరింగ్ లో చేరాక ప్రతి సెమిస్టర్‌లో ఉండే ATKT పరీక్షలు అధిగమించడానికి నేను చాలా అవస్థలు పడుతుండేదాన్ని. ఆ సమయంలో అకస్మాత్తుగా నేను సాయిబాబాను దర్శించడం మొదలుపెట్టాను. నిజానికి నా చిన్నవయసులో 2008 నుండి నేను స్కూలుకి వెళ్తున్నప్పుడు సాయిబాబాకి నమస్కరించుకుంటుండేదాన్ని. కాని హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించలేదు. ఆయన గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు. అలాంటి నేను 18 ఏళ్ళు వయస్సులో అకస్మాత్తుగా మా ఇంటికి సమీపంలో ఉన్న బాబా మందిరానికి వెళ్లడం మొదలుపెట్టాను. విచిత్రమేమిటంటే, మందిరం సమీపంలోనే ఉన్నా మా ఇంట్లో వాళ్ళు ఎవరూ మందిరాన్ని దర్శించేవారు కాదు. బాబా మందిరానికి వెళ్లడం మొదలుపెట్టాక నా జీవితంలో అద్భుతాలు మొదలయ్యాయి.

కొన్ని సబ్జెక్టుల ATKT లు మాత్రమే క్లియర్ చేయగలిగే అమ్మాయి అన్ని సబ్జెక్టులు క్లియర్ చేయడం ప్రారంభించింది. అద్భుతమైన విషయం ఏమిటంటే, నేను నా బ్రాంచ్‌లో టాపర్‌గా నిలిచాను! ఇది నాకు, నా కుటుంబానికి చాలా పెద్ద షాక్. తరువాత నా సోదరి కూడా సాయిబాబా మందిరాన్ని దర్శించడం ప్రారంభించింది. తాను కూడా బాబా అనుగ్రహాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. ఇదంతా నా సాయిబాబా దయ. దురదృష్టకరమైన అమ్మాయిగా గుర్తించబడిన నేను, ఏది తాకినా బంగారమే అన్న అదృష్టవంతురాలిగా మారాను. విద్యా సంబంధమైనవి, వ్యక్తిగతమైనవి అని తేడా లేకుండా ప్రతిదాంట్లో టాప్ లో నిలిచిన అద్భుతమైన సంవత్సరాలవి. క్యాంపస్ ఇంటర్వ్యూలు మొదలైన వెంటనే ఒక ఉత్తమ సంస్థలో నాకు ఉద్యోగం వచ్చింది. అందరికన్నా ముందు నేను ఉద్యోగంలో చేరాను. వీటన్నింటికి సాయిబాబాకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన నాపై కురిపించిన ఆశీస్సులు లెక్కలేనన్ని. ఆయనపై నా విశ్వాసం ఎంతగానో వృద్ధి చెందింది.

అయితే నా టీమ్ లో ఉన్నవాళ్లు  మంచి వాళ్ళు కాకపోవడం, మా ఇంటినుండి ఆఫీస్ చాలా దూరంలో ఉండటం వల్ల నాకు ఆ ప్రాజెక్ట్ లో ఉండటం నచ్చలేదు. సుదీర్ఘమైన పని గంటలు, దూర ప్రయాణం నా జీవితాన్ని దయనీయంగా మార్చాయి. సంతోషం కరువై మళ్ళీ సహాయం కోసం నా సాయిబాబాను ఆశ్రయించాను. ఆయన ముందు ఏడ్చాను, ప్రార్థించాను, దీనంగా కృప చూపమని అర్థించాను. నా బాబా మరోసారి నన్ను రక్షించటానికి వచ్చారు. అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. నేను చేస్తున్న ప్రాజెక్ట్ నుండి నన్ను విడుదల చేసారు. నేను కోరుకున్న ప్రదేశంలోని క్రొత్త ప్రాజెక్ట్ లో స్థానం లభించింది. అదేదో యాదృఛ్చికంగా జరిగింది కాదు, ఖచ్చితంగా నా సాయిబాబా చేసిన అద్భుతం. నేను నా జీవితాంతం ఆయనకి ఋణపడి ఉంటాను.

తరువాత కూడా సాయిబాబా అద్భుతాల ప్రయాణం కొనసాగింది. నా క్లాస్‌మేట్స్‌తో పోలిస్తే స్వల్ప ప్రయత్నంతో నేను ఎంబీఏలో చేరాను. ఉద్యోగం రావడం కొంచం ఆలస్యమెనా, సమస్యలు ఎదురైనా బాబా కృపతో చివరికి చాలా మంచి కంపెనీలో చేరాను. నేను ఆ ఉద్యోగం చేరి ఇప్పటికి 6 సంవత్సరాలు అయ్యింది. అంత చక్కగా అనుగ్రహించారు.

అయితే, సాయిబాబా బిడ్డలు జీవితంలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోరని కాదు, సమస్యలు ఉంటాయికాని ఎక్కువ కాలంపాటు ఆయన మనల్ని ఇబ్బందులు పడనివ్వరని మనం తెలుసుకోవాలి. చాలాసార్లు నేను కోరుకున్నది తిరస్కరించబడింది. దాంతో నేను నిరాశ చెందాను, నా సాయిబాబాపై కోపాన్ని ప్రదర్శించాను. కాని అన్నీ నా మంచికోసమే జరిగాయని కాలక్రమంలో గ్రహించాను. కొన్నిసార్లు మనం అడిగినదానికన్నా ఉత్తమమైనది ఇవ్వడానికి కూడా బాబా మనం అడిగింది ఇవ్వరు. మనకు సరైనదేదో మనకు తెలుసని మనం అనుకుంటాము కాని, మన బాబాకు మనకన్నా బాగా తెలుసు. కాబట్టి మనం ఆయనపై పూర్తి విశ్వాసాన్ని, సబూరీని కలిగి ఉండాలి. ఎందుకంటే, ఆయన తన బిడ్డలని ఎప్పటికీ బాధపడనివ్వరు, నీచస్థితిలో ఉండనివ్వరు. బాధ ఉన్నా అది కొద్ది కాలం మాత్రమే. ఎప్పుడైనా ఆయన విషయంలో సందేహం వ్యక్తమైనప్పుడు మన గత అనుభవాలను గుర్తు చేసుకోవాలి. అప్పడు సాయిబాబా తన బిడ్డలను ఎక్కువకాలం బాధల్లో ఉండనివ్వరని అర్థమై మన నమ్మకం పునరుద్ధరింపబడుతుంది..

12 సంవత్సరాలుగా లెక్కలేనన్ని సాయిబాబా ఆశీస్సులు, ఆయన ప్రేమ చెదరని విశ్వాసంతో నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఆయనపట్ల నాకున్న ఈ విశ్వాసం, ప్రేమ నా చివరి శ్వాసవరకు నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా జీవితంలో ఆయన ఉనికిని అనుభవిస్తున్నందుకు నేను ఎంతో ఆశీర్వాదపూర్వకంగా అనుభూతి చెందుతున్నాను. నన్ను తన బిడ్డగా స్వీకరించినందుకు సాయిబాబాకు ధన్యవాదాలు. "బాబా! నేను ఈ జన్మలోనే కాదు, అన్ని జన్మలలోనూ మీకు ఋణపడి ఉంటాను. నాకు తెలిసిన ఏకైక మార్గం మీ పవిత్ర నామస్మరణ. ఎప్పుడూ మీ నామాన్ని జపిస్తూ ఉంటాను. వేరే ఏ మార్గం నేను కోరుకోను బాబా. నన్ను, మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".

ఓం సాయిరామ్!


9 comments:

  1. Om sai ram please save all world from corona virus����.you destroy this virus from the world.we are suffering very much.with fear we are living you have power to protect us from this virus.please bless my family from this virus. Om sai maa��������������

    ReplyDelete
  2. సాయి మీద మీకున్న భక్తినీ అద్భుతమైన భావవ్యక్తీకరణ తో మాకు అందించినందుకు కృతజ్ఞతలు. బాబా పై మీకున్న ఆరాధన ,సాయికి మీ మీద ఉన్న ప్రేమ మీ అనుభవం ద్వారా మేమందరం ఆస్వాదించాం. జై సాయిరాం

    ReplyDelete
  3. ఓం సాయిరామ్!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Asalu sainadha naku ee life nenu em chesanani ila badhapedhutunnav naku voddu inka ee life

    ReplyDelete
  6. Sainadha! Enduku ila chestunav nannu chala badha pedutunnav naku voddu inka ee life

    ReplyDelete
  7. Om sai ram baba amma arogyam bagundela chudu thandri nenne namukuna thandri kapadu sainatha pleaseeee sai sai sai sai sai sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo