ఈ భాగంలో అనుభవాలు:
- బాధను తీర్చిన బాబా
- బాబా ప్రసాదించిన పదోన్నతి
- సాయి దివ్యపూజ అనుభవాలు - నిజజీవిత అనుభవాలు
బాధను తీర్చిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. చిన్నతనంనుండి నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. బాధైనా, సంతోషమైనా నాకు ముందుగా గుర్తొచ్చేది బాబానే. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన చాలా అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటున్నాను.
మాకు ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల క్రితం నుండి మా అబ్బాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లుగా పదేపదే నిట్టూరుస్తూ ఉండేవాడు. మేము మొదట మామూలుగానే తీసుకున్నాము. కానీ, కొన్ని వారాలు గడిచినా అలాగే ఉండటంతో నాకు చాలా భయం వేసింది. తను అలా పదేపదే నిట్టూరుస్తుంటే నా గుండె పగిలిపోతున్నట్లు అనిపించింది. నాకు అన్నీ బాబానే కాబట్టి సమస్యను ఆయనకు చెప్పుకొని, రోజూ కొద్దిగా ఊదీని బాబుకి పెడుతూ, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి ఇవ్వడం మొదలుపెట్టాను. "బాబుకున్న సమస్యను తగ్గించమ"ని రోజూ బాబాను ఆర్తిగా అడుగుతుండేదాన్ని. బాబా ఊదీ మహిమతో కొన్నిరోజులలో బాబుకి ఆ సమస్య నుండి ఉపశమనం లభించింది. అయితే అంతలోనే మళ్ళీ సమస్య కనపడసాగింది. అయినా నేను బాబా మీద భారం వేశాను. మావారు బాబును ఒకసారి డాక్టరుకు చూపిద్దామని అపాయింట్‌మెంట్ బుక్ చేస్తే, ఒక నెల తరువాత దొరికింది. మేము అమెరికాలో నివసిస్తున్నందువల్ల డాక్టర్ అపాయింట్‌మెంట్ అంత తొందరగా దొరకదు. ఆ నెలరోజులూ నేను బాబాను, "బాబుకి ఏమీ కాకూడదు. అంతా బాగుండాల"ని ప్రార్థిస్తూ, "వాడికి ఏ సమస్యా లేదని డాక్టరు చెప్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. తరువాత బాబుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాము. డాక్టర్ బాబుని పరీక్షించి, "సమస్య ఏమీ లేదు. కొందరు పిల్లలకది అలవాటు" అని అన్నారు. ఆ మాట వింటూనే నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా నా బాధ విన్నారు. అన్నీ ఆయనే అనుకున్న నాకు అండగా నిలిచారు. నమ్మినవారిని ఆయన ఎన్నటికీ బాధపెట్టరు. మన నుండి ఆయన ఆశించేది నమ్మకంతో కూడుకున్న నిర్మలమైన ప్రేమను మాత్రమే. "థాంక్యూ సో మచ్ బాబా!"
సర్వేజనాః సుఖినోభవంతు.
బాబా ప్రసాదించిన పదోన్నతి
సాయిభక్తుడు వెంకట గణేష్ ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకట గణేష్. నేను ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసముంటున్నాను. బాబా నాకు ప్రసాదించిన తొలి అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా నేను మీ అందరితో పంచుకుంటున్నాను. నేను ఒక మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాను. గత ఆరేళ్లుగా నేను సేల్స్ ఆఫీసరుగా పదోన్నతికోసం చూస్తున్నాను. ఎంత ప్రయత్నించినా, ఏ దేవుడికి మ్రొక్కుకున్నా నా కోరిక నెరవేరలేదు. ఈమధ్యనే నేను సాయిబాబాకు భక్తుడనయ్యాను. ఆయన మీద నమ్మకం ఉంచి నా ప్రయత్నం నేను చేసి, "బాబా! నేను మీకు ఐదు వారాలు కిచిడీ నైవేద్యాన్ని నివేదిస్తాను. మీ అనుగ్రహంతో నాకు పదోన్నతి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు చెప్పుకున్నాను. బాబా ఎంత అద్భుతమైన నిదర్శనం ఇచ్చారంటే, నేను కిచిడీ నివేదించిన మొదటివారంలోనే సేల్స్ ఆఫీసరుగా నాకు పదోన్నతి వచ్చింది. నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ అనుభవం ద్వారా తమను నమ్మినవాళ్ళకు అన్యాయం జరగదని బాబా నిరూపించారు. "బాబా! ఇలాగే అందరినీ ఆశీర్వదించండి".
సాయి దివ్యపూజ అనుభవాలు - నిజజీవిత అనుభవాలు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
భక్తులందరికీ బాబా ఆశీస్సులు. నేను సాయిబాబా భక్తురాలిని. బాబా ఆశీస్సులతో సాయి దివ్యపూజ క్రమంతప్పకుండా చేయడం నాకు అలవాటు. రెండు సంవత్సరాల క్రితం నా భర్తకు చెవికి సంబంధించిన సమస్య కాస్త ఉండేది. డాక్టర్ని సంప్రదిస్తే, "శస్త్రచికిత్స చేయాల"ని అన్నారు. అప్పుడు నేను బాబాను, "ఏదైనా అద్భుతం చూపించమ"ని ప్రార్థించాను. తరువాత మేము రెండవ అభిప్రాయం కోసం మరో డాక్టర్ని సంప్రదించాము. ఆ డాక్టర్ సీటీ స్కాన్ మొదలైన పరీక్షలన్నీ చేశారు. సీటీ స్కాన్ రిపోర్టు నార్మల్ అని వచ్చింది. డాక్టర్ అన్ని రిపోర్టులనూ పరిశీలించి, "మీ చెవులకు ఏ సమస్యా లేదు, చాలా బాగున్నాయి. ఎటువంటి శస్త్రచికిత్సా అవసరం లేద"ని అన్నారు. ఇటువంటి అద్భుతమే సాయి దివ్యపూజ మొదటి అధ్యాయంలో ఉంది. బాబా అనుగ్రహం లేకుంటే ఇదెలా సాధ్యం?
మరో అనుభవం:
సాయి దివ్యపూజ రెండవ అధ్యాయంలో ఒక పనిమనిషి సాయిభక్తురాలిగా మారిన అనుభవం ఉంది. అదే అనుభవం నాకూ జరిగింది. నేను సాయి దివ్యపూజ ముగించిన తరువాత సాయి దివ్యపూజ పుస్తకం ఒకటి మా పనిమనిషికి ఇచ్చాను. అంతటితో ఆమె కూడా బాబా భక్తురాలైంది. ఆమె ప్రతి గురువారం సాయి దివ్యపూజ చేయడం మొదలుపెట్టింది. పూజ చేస్తున్నప్పటినుండి ఆమె చాలా సంతోషంగా ఉంది. "బాబా అనుగ్రహానికి ధన్యవాదాలు".
Om sai ram sai divya pooja is very powerful.baba's any vratamu is powerful our desires full filles.once I did sai divya pooja.sai baba worship is our luck. Om sai ram�� ❤❤❤��
ReplyDeleteCan someone please explain what is Divya puja
ReplyDeleteIs it different from Sai sacharithra parayana ?
Sai divya pooja process link
Deletehttps://youtu.be/chMeCKLMQcM
Om sai ram baba ma andari arogyalu bagundali thandri please
ReplyDeleteబాబా నీను చాల అయోమంలో ఉన్నాను నా మనసు ఏమి భోగొలేదు ఎంచేస్తుననో నాకే తలియనట్టుగా ఉంది ప్లీజ్ బాబా ఎదో ఒక దరిచుపండి నీను మీకు ఎనిస్తార్లు మొక్కుకున నాకు ప్రమోషన్ కోసం .మా పాప చధువు వియం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ బాబా హెల్ప్ చేయండి ఓం సాయిరాం 🌹🙏🌹
ReplyDeleteBaba maa ellanta allakalloam ga vundi. neve ma vallaandarini rakshincu.
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete