సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 749వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. సాయిదేవుని కృప
  2. పిలిచినంతనే పలికే కొంగుబంగారం మన సాయి

సాయిదేవుని కృప


సాయిభక్తుడు రాంప్రసాద్ తమకి బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


సాయి మహరాజ్ సన్నిది బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. ఈ బ్లాగ్ సముఖంగా నేను ఇదివరలో ఎన్నో అనుభవాలు సాయిబంధువులతో పంచుకున్నాను. నాకు సమస్య వచ్చిన ప్రతిసారీ సాటి సాయిబంధువులతో బాబా ప్రేమను పంచుకోవడం ద్వారా ఎంతో సాంత్వన చేకూరింది.


నా సాయిదేవుడు తన కృపను ఎల్లవేళలా నాపై కురిపిస్తూ నాకు ఎంతో ధైర్యాన్నిస్తున్నారు. 2009 నుంచి ఇప్పటివరకు మా స్థిరాస్తి తనఖాలో నలిగిపోతూ వస్తోంది. గడచిన 12 సంవత్సరాలు నేను సాయిబాబా మార్గంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూశాను. నా బాల్యం నుంచి నాకు సాయిబాబా గురించి కొంచెం అవగాహన ఉండేది. శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ, శ్రీగురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా, సాయిబాబా చూపిన ఎన్నో లీలల ద్వారా బాబా పట్ల నా విశ్వాసం దృఢమవుతూ వస్తోంది. కానీ ఎన్ని చేసినా మా స్థిరాస్తి గొడవ మాత్రం ఎప్పటికీ తీరని ఒక సమస్యగానే ఉండిపోయింది. 2009లో దృఢంగా సంకల్పం చేసుకొని, “మా ఆస్తి మాకు దక్కేలా చూడు బాబా” అని ఆర్తిగా బాబాను వేడుకుని పారాయణలు చేస్తున్నాను. కాలం గడిచే కొద్దీ ఆస్తి విషయంలో అవమానాలు, కోర్టు సమస్యలు అధికమవుతూ వస్తున్నాయి. బాబా ‘ప్రశ్నలు-సమాధానాలు’ పుస్తకంలో బాబా సూచనలకోసం చూసినప్పుడల్లా, “పని విజయమంతమవుతుంది” అని బాబా నుండి సమాధానం వస్తోంది. ‘బహుశా శ్రద్ధ, సబూరిలు అలవరచుకోమనీ, కాలం కలిసి వచ్చేవరకు వేచి ఉండమని బాబా చెప్తున్నారు కాబోలు’ అని నన్ను నేను సమాధానపరచుకున్నాను. ఒకరోజు అకస్మాత్తుగా బాబా ‘ప్రశ్నలు-జవాబులు” పుస్తకంలో, "నేను నిన్ను నీ చిన్నప్పటినుంచి చూస్తున్నాను. నీలో శ్రద్ధ లేదు, భక్తి లేదు” అని వచ్చింది. "నా విశ్వాసంలో ఎక్కడో అపశ్రుతి ఉంది, నన్ను నేను బాబాకు సరిగా శరణాగతి కాలేకపోయాను” అనుకుని మరింత పట్టుదలతో సచ్చరిత్ర పారాయణ చేస్తూ వచ్చాను. ప్రతి గురువారం సంధ్య ఆరతికి బాబా మందిరానికి వెళ్లి అందరితో కలిసి ఆరతిలో, పూజలో పాల్గొంటూ బాబాకు మరింత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాను. 2018 నుంచి ప్రతి గురువారం సంధ్య ఆరతికి వెళ్తూ ఉండటంతో ఆరతి పాట కంఠస్థమైంది. ధుని ప్రదక్షిణలు, సచ్చరిత్ర పారాయణ నిత్యకృత్యం. కానీ నా ఆస్తి విషయంలో మాత్రం కాలయాపన జరుగుతూనే ఉంది. బాబా సూచనలు, సలహాలు మాత్రం ఆశాజనకంగానే వస్తున్నాయి. 12 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఈ నరకయాతనను ఇక భరించలేక, “బాబా! ఈ నరకయాతనను భరించలేకపోతున్నాను. నా ఆస్తి నాకు రాకపోయినా పర్వాలేదు. మీరు ఇచ్చిందే భిక్ష అనుకొని మీ సేవలో ఈ జీవితం హాయిగా సాగనీ” అని బాబాను వేడుకున్నాను. నాకు తెలుసు, బాబా మన భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ఒక ప్రణాళికతో ఉంటారు. మన ప్రణాళిక కంటే బాబా ప్రణాళిక చాలా గొప్పది. మనకు ఏది శ్రేయస్సునిస్తుందో అది మాత్రం బాబా మనకు తప్పకుండా ప్రసాదిస్తారని విశ్వసిస్తున్నాను. ఒకరోజు హఠాత్తుగా భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని తాత్పర్యం నా కంటపడింది. అది, "శ్రీహరి ముందుగా తను రక్షించదలచుకున్న భక్తుని యొక్క సర్వాన్ని హరించివేస్తాడు" అని. అది చూసి, ‘బహుశా నన్ను కూడా బాబా అలాగే కరుణిస్తారు’ అని సమన్వయపరచుకున్నాను. ఇంతలో, 2021, మార్చి 29న బాబా తమ అద్భుత లీలను చూపిస్తూ నా ఆస్తి విషయంలో ఒక సందేశం ద్వారా శుభసంకేతం ఇచ్చారు. ఆ సందేశం: “భయపడవద్దు. ఈ దయగల ఫకీరు నిన్ను తప్పక రక్షించును. నీవు నిశ్చింతగా కూర్చో! జరగవలసినదంతా నేను చూసుకుంటాను”. అది చూసి, “నా సమస్యకు పరిష్కారం వస్తే ఈరోజే నేను నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు ద్వారా తోటి సాయిబంధువులతో పంచుకుంటాను” అని అనుకున్నాను. సందేశమిచ్చినట్లుగానే బాబా నా ఆస్తి విషయంలో ఒక శుభసంకేతంగా తొందరలో పని జరిగేదానికి సమయము, సందర్భము సూచనప్రాయంగా తెలిపారు. బాబాకిచ్చిన మాట ప్రకారం వెంటనే నా ఆనందాన్ని ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా తోటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. బాబా ఆశీస్సులతో త్వరలో మా సమస్యకు పరిష్కారం దొరకగానే ఆ అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


పిలిచినంతనే పలికే కొంగుబంగారం మన సాయి


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో వచ్చే బాబా లీలలను చదివి చాలా ఆనందిస్తాను. ఆ లీలలు చదువుతుంటే నాకు సచ్చరిత్ర పారాయణ చేసినట్లుగా ఉంటుంది. పొరపాటున ఏ రోజైనా చదవలేకపోతే నాకు ఏదో వెలితిగా అనిపిస్తుంది. అంతగా నేను ఈ బ్లాగుకు అలవాటుపడ్డాను. ఇదివరకు నేను నా అనుభవాలను కొన్నింటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. సాయినాథుని ఆశీస్సులతో ఇప్పుడు మరొక అనుభవాన్ని పంచుకుంటున్నందుకు చాలా ఆనందిస్తున్నాను.


కొద్ది రోజుల క్రితం ఒకరోజు సాయంత్రం 5 గంటల సమయంలో అకస్మాత్తుగా మా అబ్బాయికి తుమ్ములు మొదలై, జలుబు చేసి ముక్కు కారసాగింది. అసలే చుట్టూ నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా చాలా భయంగా ఉంటోంది. వెంటనే నేను, "తండ్రీ, సాయినాథా! బాబుకి త్వరగా జలుబు తగ్గేలా చూడు. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మన సద్గురు సాయినాథుని ప్రార్థించి, వేడినీళ్లలో బాబా ఊదీ వేసి మా అబ్బాయి చేత ఆవిరి పట్టించాను. బాబా దివ్య ఆశీర్వాదబలంతో మా అబ్బాయికి జలుబు తగ్గింది. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే బాబా అనుగ్రహించకపోవడమంటూ ఉండదు. పిలిచినంతనే పలికే కొంగుబంగారం మన సాయి. ఆయనకు సర్వస్య శరణాగతి చేసి ప్రార్థించడమే మనం చేయాల్సింది. బాబా ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను.


20 comments:

  1. Congratulations to all the Sai devotees and also to the admin team of this blog on completing 3 years successfully
    Jai sairam

    ReplyDelete
  2. Congratulations to all the team members of this blog on completing 3years successfully.om sairam

    ReplyDelete
  3. Congratulations to all the team members of this blog on completing 3years successfully.om sairam

    ReplyDelete
  4. Congratulations to all your admin team of this blog.congrats to sai baba also.with his blessings they started this blog.this is modern satcharitra.sai blesses all devotees through this blog. Om sai ram ❤❤❤💛🧡💚💙

    ReplyDelete
  5. బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సిబ్బందికి మనః పూర్వక వార్షికోత్సవ శుభాభినందనలు.రోజూ చదవడానికి సాయి లీలలను అందిస్తూ మమ్మల్ని సాయికి మరింత దగ్గర చేస్తున్న వీరిని సాయి సదా తన అనుగ్రహ వర్షాన్ని కురిపించు గాక.

    ReplyDelete
  6. Congratulations to all team members of this blog and to all devotees

    ReplyDelete
  7. Congratulations to all team members.

    ReplyDelete
  8. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  9. Om Sairam
    Congratulation to all
    Thank you for sharing devotee's experiences.
    Sai always with us

    ReplyDelete
  10. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  11. Congratulations blog admin and team thank you for sharing devotees experiences. heartfelt congratulations
    ����������

    ReplyDelete
  12. 🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  13. Congratulations to all the baba devoties. And thank you admin ji. We all are receiving baba blessings by the help of this blog.

    ReplyDelete
  14. Heartfully congratulations to all the Members and Admin of this Blog for successful completion of 3 years.Praying Lord Sai Baba to bless all with good health and energy to lead the blog continuously with out any obstacles.Om Sai Sree Sai Jaya Jaya Sai.

    ReplyDelete
  15. The above comment send by me i.e Suryanarayana Murthy Nittala of Vijay Nagar colony.Hyderabad.

    ReplyDelete
  16. Om sai ram Congratulations to sai blog members baba please andarini bless cheyandi sai

    ReplyDelete
  17. Om sai ram baba please amma ki problem tondarga cure cheyi thandri please

    ReplyDelete
  18. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo