- బాబా ఆశీస్సులతో నెరవేరిన సమస్యలు
- అమ్మానాన్నల క్షేమాన్ని చూసుకున్న బాబా
బాబా ఆశీస్సులతో నెరవేరిన సమస్యలు
రాజమండ్రి నుండి సాయిభక్తుడు రాధాకృష్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో నుండి ఒకదానిని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఆ అనుభవం ‘ఎంతో కృపతో మాకు ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకున్న బాబా’ అనే శీర్షికతో ఈ బ్లాగులో ప్రచురితమైంది. ఆ లింక్‌ను ఈ క్రింద జతపరుస్తున్నాను.
https://saimaharajsannidhi.blogspot.com/2021/01/652.html
ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనీ, ఆ సాయినాథుని లీలలను మీకు విశదపరచాలనీ నా కోరిక. మా అక్క, బావగారు మద్రాసులో ఉంటారు. ఒకరోజు మా అక్క నాకు ఫోన్ చేసి, “మీ బావగారికి ఒంట్లో బాగాలేదు. ఒకటే వాంతులవుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయంటున్నారు” అని చెప్పింది. అక్క చెప్పింది విని నేను బాబాకు నమస్కరించుకుని, “బావగారికి వాంతులు, కళ్ళుతిరగటం తగ్గిపోయి తను ఆరోగ్యంగా ఉంటే ఆ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించాను. బాబా అనుగ్రహం వల్ల మా బావగారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. తనకున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించమని బాబాను కోరుకుంటున్నాను.
మా అమ్మాయికి వివాహమై ఒక సంవత్సరం అయింది. వివాహమైన తరువాత వాళ్ళు ఒరిస్సాలో కాపురం పెట్టారు. కొంతకాలానికి మా అమ్మాయి గర్భవతి అయింది. 4 నెలలు గడచిన తరువాత కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు. గర్భం దాల్చిన తొలి మాసాలలో వాంతులతో ఇబ్బందిపడుతుండటంతో మా అమ్మాయి స్పెషల్ పాస్ తీసుకుని తన భర్త, అత్తగారితో కలిసి మా వద్దకు వచ్చింది. నెలలు నిండాక బాబా కృపతో తను పండంటి బాబుకు జన్మనిచ్చింది. మళ్ళీ ఒరిస్సా వెళితే సహాయం చేసేవారు ఎవరూ లేక చంటిబిడ్డతో మా అమ్మాయి అక్కడ ఎలా ఉంటుందో అని దిగులుపడి ఈ సమస్యకు పరిష్కారం చూపమని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా అల్లుడిగారికి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. బంధుమిత్రులంతా అక్కడికి దగ్గరలోనే ఉండటం వల్ల మా అమ్మాయి చంటిబిడ్డతో వెళ్ళి బెంగళూరులో కాపురం పెట్టినా తను ధైర్యంగా ఉండగలదనే భరోసాను ఈ అనుభవం ద్వారా బాబా మాకు ప్రసాదించారు. ఈ లీల ద్వారా బాబా సహకారం మాకు ఎల్లప్పుడూ ఉన్నదన్న నమ్మకం మరింత దృఢపడింది.
నా శ్రీమతికి ఈమధ్య ఒళ్ళంతా ఎలర్జీ వచ్చింది. నేను బాబాకు నమస్కరించుకుని, ‘నా భార్య ఎలర్జీ తగ్గితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో ఆ ఎలర్జీ తీవ్రత తగ్గిపోయింది. ఇలా సాయిలీలలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరిన్ని సాయిలీలలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ...
రాధాకృష్ణ.
అమ్మానాన్నల క్షేమాన్ని చూసుకున్న బాబా
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానే అయిన సాయితండ్రికి నా శతకోటి ధన్యవాదాలు. ఒకరోజు మా అమ్మ పనిచేస్తుండగా హఠాత్తుగా తన కాలు బెణికింది. దానివల్ల అమ్మ నడవలేకపోయింది. కాలినొప్పి తగ్గటానికి మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఇంక అమ్మను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి డాక్టరుకి చూపించాలనుకున్నాము. కానీ మా అమ్మకు ఇంజక్షన్ అంటే భయం. అందువల్ల నేను బాబాకు నా బాధను చెప్పుకుని, “మీ అనుగ్రహంతో అమ్మకు కాలినొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అనుకున్నాను. బాబా దయవల్ల అమ్మకు మరుసటిరోజు ఉదయానికల్లా నొప్పి తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
మరో అనుభవం:
ఒకరోజు సాయంత్రం మా నాన్నగారు సరుకులు తేవడానికి బయటికి వెళ్ళారు. ఇంతలోనే చిన్న తుఫానులాగా విపరీతమైన గాలివాన ప్రారంభమైంది. నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఈ గాలివానలో ఆయన ఎక్కడ చిక్కుకున్నారోనని మాకు ఒకటే ఆందోళన. అప్పుడు నేను బాబాకు నమస్కరించి, “మా నాన్న క్షేమంగా ఇంటికి చేరుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని బాబాను ప్రార్థించాను. కాసేపట్లోనే నాన్న క్షేమంగా ఇంటికి వచ్చేలా చేశారు బాబా. “థాంక్యూ సో మచ్ బాబా. నేను ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నాను. దాన్ని ఎలాగైనా నువ్వే నయం చేయాలి బాబా. ఈ చంచల మనస్కురాలిని నువ్వే ఆదుకోవాలి బాబా. నీకు శతకోటి ధన్యవాదాలు తండ్రీ!”
Om Sairam
ReplyDelete🙏🙏🙏
Saindha! Naku inka chavuni prasadinchu tandri. Eee world loney unlucky ga nenu.
ReplyDeleteom sairam
DeleteOm sai ram please cure my irritation in skin problem.icing I am suffering from 1 year.no solution.it is cured by you.i will share my experience in this blog.i am waiting for so many days. Baba please cure it.i trust you with my whole heart❤�� ����������❤❤����
ReplyDeleteOm sai ram baba ma amma arogyam bagundela chudu sai thandri pleaseeee
ReplyDeleteOm sai ram
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
This comment has been removed by the author.
ReplyDelete715 days
ReplyDeletesairam
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete