సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 744వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అపారమైన బాబా దయ

సాయిభక్తురాలు శ్రీమతి రేవతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పూర్వజన్మ సుకృతం వలన నేను మన సాయికుటుంబంలో సభ్యురాలినయ్యాను. నా పేరు రేవతి. నేను ఇదివరకు నా అనుభవాలను కొన్నిటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నా అనుభవాలతో మీ ముందుకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను.


మొదటి అనుభవం:


నేను, మావారు ప్రభుత్వ ఉపాధ్యాయులం. 2021, ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నాలుగు విడతలుగా జరిగాయి. అందులో మొదటి, మూడవ విడత ఎన్నికలకు మాకు డ్యూటీ వేస్తారని తెలిసింది. కానీ మొదటి విడత ఎన్నికల సమయం నాకు నెలసరి వచ్చే సమయం. ఆ సమయంలో డ్యూటీకి వెళ్ళడమెలా అనుకుంటూ నా సమస్యకు పరిష్కారం చూపమని బాబాను చాలాసార్లు ప్రార్థించాను. నేను బాబాను అడిగినప్పుడల్లా, ‘నేను ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తానో చూడు’ అని బాబా నుండి సమాధానం వచ్చేది. ఊహించినట్లుగానే బాబా దయవలన మొదటి విడత ఎన్నికలకి నన్ను రిజర్వ్‌లో ఉంచారు. ఆ విధంగా బాబా నన్ను ఎన్నికల విధులకు దూరంగా ఉంచి నా సమస్యను పరిష్కరించారు. కానీ, మావారికి PO(Presiding Officer)గా ఒక సెన్సిటివ్ ఏరియాలో (గొడవలు జరిగే అవకాశముండే ప్రాంతం) డ్యూటీ పడింది. ఎన్నికలు పూర్తయి మా కొలీగ్స్, తెలిసినవారందరూ ఇళ్ళకు చేరుకున్నారు. కానీ మావారి నుండి మాత్రం ఎంతకీ ఫోన్ రాలేదు. నేను ఫోన్ చేస్తుంటే స్విచ్చాఫ్ వస్తోంది. దాంతో నేను బాబాను ప్రార్థిస్తూ తెలిసినవాళ్ళందరికీ ఫోన్ చేశాను. అనుకున్నట్లుగానే మావారు డ్యూటీ చేసిన ప్రాంతంలో గొడవలు జరిగాయని తెలిసింది. నేనిక కంగారుపడుతూ, ఏడుస్తూ, “బాబా! తాను క్షేమంగా ఉన్నట్లు మావారి వద్ద నుండి త్వరగా ఫోన్ వచ్చేలా అనుగ్రహించండి” అని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. రాత్రి పదకొండు గంటలకు మావారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తరువాత అర్థరాత్రి 3 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అక్కడ గొడవలు జరిగినా, అంత రాత్రిపూట బండిమీద ప్రయాణం చేసినా మావారు మాత్రం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇదంతా నా బాబా నాపై చూపిన కరుణ. “థాంక్యూ బాబా!”


రెండవ అనుభవం:


మూడవ దశ ఎన్నికలకు నాకు, మావారికి డ్యూటీ పడింది. ఈసారి మావారికి మంచి గ్రామంలోనే డ్యూటీ వేశారు. కానీ నాకు మాత్రం సెన్సిటివ్ ఏరియాలో డ్యూటీ పడింది, అది కూడా APO(Assistant Presiding Officer)గా. అయినా నాకు మాత్రం బాబాపై ఉన్న నమ్మకంతో భయం కలుగలేదు. బాబా దయవలన ఎటువంటి గొడవలూ లేకుండా ఎన్నికలు జరిగాయి. కానీ కౌంటింగ్ పూర్తయ్యేవరకు మమ్మల్ని అక్కడే ఉండమన్నారు. ఎందుకంటే అది పెద్ద పంచాయితీ. అందువల్ల గొడవలు జరుగుతాయేమోనని RO(Returning Officer) గారు ఎవ్వరినీ ఇంటికి వెళ్ళటానికి అనుమతించలేదు. మండలంలో అందరి కౌంటింగ్ పూర్తయిపోతోంది. కానీ మాది పూర్తయ్యేసరికి రాత్రి ఒంటిగంట కావచ్చు అన్నారు. మావారు కూడా తన డ్యూటీ పూర్తిచేసుకుని ఇంటికి వచ్చేశారు. ఇంతలో మా పాప నాకు ఫోన్ చేసి, “మమ్మీ, త్వరగా రా” అని ఏడవసాగింది. నేనేమో ఇంటికి వెళ్ళే స్థితిలో లేను. నా మీద బెంగతో పాప ఏడ్చి, ఏడ్చి వాంతి చేసుకుంది. తనకు జ్వరం కూడా వచ్చేసింది. ఆ సంగతి తెలిసి నేను ఇంత రాత్రివేళలో ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ నాకు దారిచూపమని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. చివరికి ధైర్యం చేసి బాబాను ప్రార్థించి, ఇంటికి వెళ్ళడానికి RO గారిని అనుమతి అడిగాను. చిత్రంగా, ఎవ్వరికీ అనుమతి ఇవ్వని RO గారు నాకు మాత్రమే అనుమతినిస్తూ, “మీ PO ఒప్పుకుంటే పంపిస్తాను” అన్నారు. మా PO గారు చాలా మంచివారు. ఆయన RO గారితో, "ఆమెకి చిన్న పాప ఉందట సార్, తనను ఇంటికి పంపించండి” అన్నారు. దాంతో RO గారు నన్ను ఇంటికి పంపడానికి ఒప్పుకున్నారు. ఆ రాత్రివేళలో మావారు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. బాబా దయవలన మాత్రమే నాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి లభించింది. మిగతావాళ్ళందరూ రాత్రి ఒంటిగంట వరకు ఉన్నారట.


ఇంటికి వచ్చాక, జ్వరం, వాంతులతో నీరసించిపోయిన పాపను చూసి, తను త్వరగా కోలుకునేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థించి, పాపకు బాబా ఊదీ పెట్టి, కొంచెం ఊదీని నీళ్ళలో కలిపి త్రాగించాను. అలా రెండు రోజులు చేశాక బాబా దయవల్ల పాప పూర్తిగా కోలుకుంది. “థాంక్యూ బాబా, నా కుటుంబాన్ని అడుగడుగునా కాపాడుతున్నారు”.


మూడవ అనుభవం:


మా తమ్ముడు వైజాగ్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. వాడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే కంపెనీలలో మంచి ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూలకు హాజరవుతుండేవాడు. తను రాజీనామా చేసిన కంపెనీవాళ్ళు తనకు 3 నెలల గడువిచ్చారు. గడువు సమయం దగ్గరపడుతున్నా తనకు ఏ ఉద్యోగమూ రావట్లేదు. దాంతో తను చాలా టెన్షన్ పడుతున్నాడు. ఈ విషయంలో మా తల్లిదండ్రులు కూడా చాలా టెన్షన్ పడేవారు. నేను ఎన్నోసార్లు వాళ్ళకు చెప్పాను, ‘బాబా మనకు కావలసింది చేస్తారు, ఓపికగా ఉండమ’ని. మా అమ్మ, మా తమ్ముడు ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళి, ధునిలో కొబ్బరికాయను సమర్పించి, త్వరగా మంచి ఉద్యోగం ప్రసాదించమని బాబాను ప్రార్థించి వచ్చేవారు. ఇలా చేస్తుండగా మూడవవారం మా తమ్ముడికి రెండు కంపెనీల నుండి ఇంటర్వ్యూలు వచ్చాయి. బాబా దయవల్ల వాటిలో ఒక కంపెనీకి వాడు సెలెక్ట్ అయ్యాడు. వాడు మొదట చేసిన కంపెనీకి రెట్టింపు ప్యాకేజీతో ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్లు 2021, మార్చి 18, గురువారంనాడు మెయిల్ వచ్చింది. మేమంతా ఎంత సంతోషించామో మాటల్లో చెప్పలేను. నిజంగా బాబా మనకేది మంచిదో అదే చేస్తారు, కానీ మనకు సబూరి (సంతోషంతో కూడిన ఓరిమి) అవసరం. నేను బాబా భక్తురాలినే గానీ సహనం తక్కువ. నన్ను కూడా బాబా మెల్లగా మారుస్తారని ఆశిస్తున్నాను. “బాబా, మీ దయ ఎల్లప్పుడూ మా అందరిపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను”.


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


9 comments:

  1. Om sai ram very nice sai leela.sai maakes very little desire also.udi is medicine to all health problems.sai gave to us. We are lucky. Om sai ram�� ❤❤❤��

    ReplyDelete
  2. Baba...
    మా బావగారు కరోన వ్యాధితో బాధపడుతున్నారు..
    . జ్వరం చాలా ఎక్కువగా ఉంది. దయచేసి సాయినాధ... మా బావగారికి జ్వరం తగ్గి నయం అయేటట్టు చూడు బాబా... ఎన్నో మందిని రోగాలనుండి కాపాడావు.. మా బావగారిని కూడా కాపాడు బాబా...
    శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కి జై...

    ReplyDelete
  3. Om sai ram baba Amma arogya samasya ni teerchu thandri

    ReplyDelete
  4. సాయిరాం బాబా నా ఆరోగ్యం త్వరగా బాగుపడి నందుకు వ్యాపారం అన్ని విషయాలు నాకు అనుకూలంగా ఉన్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు నీవే కలవు.. నీవే తప్పా మాకెవరూ ఈభువిలో..

    ReplyDelete
  5. సాయిరాం బాబా నా ఆరోగ్యం త్వరగా బాగుపడి నందుకు వ్యాపారం అన్ని విషయాలు నాకు అనుకూలంగా ఉన్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు నీవే కలవు.. నీవే తప్పా మాకెవరూ ఈభువిలో.. సాయినాధ నీ కరుణా కటాక్ష వీక్షణాలు ఉంటే మేము అన్ని రకాలుగా గొప్ప విజయం సాధిస్తాం ఆరోగ్యం పొందుతాము. నిప్పు లో పడిన బాబును కాపాడిన విధంగా నన్ను కూడా అనారోగ్యం బారిన పడిన సమయంలో..నీ గొప్ప మహిమల తో నన్ను కనికరించి పెద్దగా ఇబ్బంది లేకుండా చేసి జాండిస్ జ్వరం నుంచి బయట పడేసి ఆరోగ్యం ప్రసాదించిన మహిమ కలిగిన షిరిడీశ్వరా.. సర్వేశ్వరా.. మాకు మీరిచ్చిన అద్భుతమైన అనుభవాలు, అమృతం లాంటి లీలలు మాకు పూర్వ జన్మ పుణ్య ఫలితం అనుకుంటాము. జై జై జై సాయిరాం బాబా దేవా.. నన్ను నా కుటుంబాన్ని అందరిని అన్ని వేళలలో అనునిత్యం కాపాడుతున్న కల్పతరువు కృపా కలిగిన దేవా సాయిబాబా మీకు వేల కోట్ల ప్రణామములు.

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo